నిరుపేద విశ్వకర్మల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని, దాదాపు గతేడాది నుంచి ఉపాధి కోల్పోయి, ఆకలితో పస్తులుంటున్న నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబాలు తెలంగామలో వేలాదిగా ఉన్నాయని, వారికి చేయూతనందించాలని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్యసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కౌలే జగన్నాథం విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 10 వేల రూపాయలు, 50 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. జగన్నాథం-వెంకటలక్ష్మి దంపతుల 37 ఏళ్ల పెళ్లిరోజు సందర్భంగా పలువురు విశ్వబ్రాహ్మణ సమాజం నాయకులు.. ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్యసంఘం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి, బహదూర్ పురా మండలాధ్యక్షుడు వలబోజు రవికిరణ్ చారి, ప్రధాన కార్యదర్శి మారోజు రవీంద్రాచారి, సైదాబాద్ మండలాధ్యక్షుడు వొరువాల వీరేశ్ చారి, ప్రధానకార్యదర్శి మేడిపల్లి వెంకటేశంచారి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు. కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...
Wish a happy wedding anniversary day sir
ReplyDelete