కరోనా కాటేసిన వేళ చిన్ననాటి మిత్రులే ఆప్త బంధువులు అయ్యారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం మారేడుపాక కు చెందిన పాడి మహేందర్ రెడ్డి 10రోజుల క్రితం కరోనాతో చనిపోయారు. చాలా చిన్న వయసులోనే మహేందర్ రెడ్డి చనిపోవడంతో కుటుంబం కష్టాలపాలైంది. దీంతో చిన్ననాటి మిత్రులందరూ కలిసి వారి కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆ చెక్కును మహేందర్ రెడ్డి భార్య కు అందించారు.
ఈ కార్యక్రమంలో ఇనుగంటి రామారావు, నాగభూషణాచారి, చారి, ఇనుగంటి శ్రవణ్ కుమార్, తిరుపతి యాదవ్, రాజమౌళి, నర్సింహాచారి, నాగరాజు, శ్యామ్, మిగతా మిత్ర బృందం పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: