ప్రొఫెసర్ తియ్యబిండి కామేశ్వరరావు స్వగృహంలో
తెలుగువారి ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. గతేడాది లాగే ఈసారి కూడా కరోనా విజృంభించిన తరుణంలో వీరగురుడి ఆరాధనోత్సవాలను సాదాసీదాగా, నిష్టగా జరుపుకున్నారు. కాలజ్ఞాన ప్రదాత అయిన వీరబ్రహ్మేంద్రస్వామి 327 ఏళ్ల క్రితం కందిమల్లాయపల్లిలో జీవసమాధిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులు ఎక్కడికక్కడ స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహించుకున్నారు. పలుచోట్ల జరిగిన ఈ ఆరాధనోత్సవాలకు సకల వర్గాల ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ఇక విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం తానాజీనగర్ ఉప్పుగూడలో నిర్వహించారు. ఆ సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బండ్లగూడ మండలాధ్యక్షులు తోట శ్రీనివాసాచారి, బహదూర్ పురా మండలాధ్యక్షుడు వలబోజు రవికిరణ్, సైదాబాద్ మండలాధ్యక్షుడు వోరువాళ్ళ వీరేష్, మేడిపల్లి వెంకటేశంచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశ్వకర్మ భవన్ లో సుదర్శన హోమం
అటు సికింద్రాబాద్ లోని విశ్వకర్మ సంఘం భవనంలో వీరగురుడి ఆరాధనోత్సవాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం అధ్యక్షుడు మోటుకూరి నాగభూషణం, విశ్వకర్మ భవనం అధ్యక్షుడు దుబ్బాక కిషన్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశప్రజలందరూ కరోనా మహమ్మారి బారిన పడకుండా సుఖ-సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శాంతిపూజ, సుదర్శన హోమం నిర్వహించారు. కాలజ్ఞాన ప్రదాత అయిన వీరబ్రహ్మేంద్రస్వామి కరుణా కటాక్షాలతో ప్రపంచ పజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తాము ఈ యజ్ఞం నిర్వహించామని దుబ్బాక కిషన్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో..
ఖమ్మం, బీసీ కాలనీలోని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జెండా గద్దె వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వీవీఐఎస్ ఖమ్మం నగర ఎలక్షన్ కమిటీ కన్వీనర్ కొనపర్తి రాజేశ్వరాచారి, 58వ డివిజన్ కార్యవర్గ ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని శ్రీనివాాస్ విశ్వకర్మ చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
----------------------------------
కె. శ్రీనివాసాచార్యులు ఇంట్లో
కందుకూరి వెంకటేశ్వరరావు నివాసంలో
మారోజు ఉమాపతిఆచార్యులు శ్రద్ధాభక్తులు
తుమ్మోజు రామలక్ష్మణాచార్యుల ఇంట్లో
------------------------------
ట్యాంక్ బండ్ మీద వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం వద్ద
ఇలా తెలుగురాష్ట్రాల్లో అన్ని చోట్లా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలను భక్తిపూర్వకంగా జరుపుకున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: