భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయం ఆసన్నమైందని హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు అంటున్నారు. గతేడాదికి పైగాా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం నుంచీ శాస్త్రీయ వైద్యంగా భుజకీర్తులు తగిలించుకున్న అల్లోపతి వైద్యం ఇప్పటివరకు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందని, అయినా పాలకులు, ప్రపంచ దేశాలు, డబ్ల్యు.హెచ్.ఒ వంటి వ్యవస్థలన్నీ ఇప్పటికీ పునరాలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నాానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడితే దాన్ని నాటువైద్యంగా అభివర్ణిస్తున్న ఆధునిక మీడియా పోకడలను ఆయన ఖండించారు.
ఏది నాటు వైద్యం? ఏది శాస్త్రీయ వైద్యం?
శాస్త్రీయ వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు గుంజుతూ, పేషెంట్ ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని సంతకం చేయించుకుని మరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే కార్పొరేట్ దవాఖానాాల్లో జరిగేది శాస్త్రీయ వైద్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రాణాలు పోతే ప్రశ్నించే అవకాశాన్ని కూడా లేకుండా చేసేదాన్ని శాస్త్రీయ వైద్యంగా పిలిచేవారి అజ్ఞానానికి జాలిపడాల్సిందేనన్నారు. ఆయుర్వేదంలో అనేక రోగాలకు మందులు ఉన్నాయని, ఎంతో విలువైన ఆ విజ్ఞానాన్ని నాటువైద్యం పేరుతో ప్రజలకు దూరం చేసే కుట్ర దశాబ్దాలుగా దేశంలో విజయవంతంగా అమలైందన్నారు. చదువుకున్నవారు, మీడియా సంస్థల అజ్ఞానం వల్లే ఆయుర్వేద వైద్యులు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో డబ్బులు కట్టినా ప్రాణాలు పోతున్న క్రమంలో ఆనందయ్య అందిస్తున్న చికిత్స కరోనా పేషెంట్లకు దివ్యౌషధంగా మారిందని, ఈ ఉదంతం వల్ల ప్రభుత్వాల్లో కాసింతైనా చలనం రావడం సంతోషదాయకమన్నారు. ఒక్క కరోనాకే కాదని, ఆధునిక వైద్య విధానానికి అంతుబట్టని అనేక రోగాలకు ఆయుర్వేదంలో చికిత్స ఉందని గుర్తించాలని కామేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఆనందయ్య లాంటి ఎంతో మంది ఆయుర్వేద వైద్యులు వెలుగులోకి రాకుండా నాటువైద్యులుగా తెరమరుగైపోయారని, ఇప్పుడైనా దేశీయ వైద్యానికి మంచిరోజులు రావాలని ఆకాంక్షించారు. అయితే ప్రజలే ముందుకొచ్చి ఆయుర్వేదాన్ని బతికించుకుంటే ప్రభుత్వాలు చచ్చినట్టు గుర్తిస్తాయని, నెల్లూరు సంఘటన ఇందుకు ఓ తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాల కళ్లు తెరిపించే సత్తా ప్రజలకే ఉందని, ఆయుర్వేదానికి మద్దతుగా నిలబడాల్సింది కూడా ప్రజలేనన్నారు. వైద్య వృత్తిలోకి వస్తున్న ఎవరైనా వారికి నిర్దేశించినట్టు ఐదేళ్ల కోర్సు పూర్తి చేసుకొని వృత్తిని చేపడుతున్నారు. అయితే అల్లోపతి డాక్టర్ల చేతిలో ఏదైనా పొరపాటు జరిగితే లేదా అనుకోని సంఘటన జరిగితే ప్రాక్టీసులో భాగంగా, శాస్త్రీయమైన ప్రాక్టీసులో భాగంగా పరిగణిస్తున్న, ప్రచారం చేస్తున్న వ్యవస్థలు లేదా సంస్థలు... ఇతర వైద్య విధానాల్లో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు.. దాన్ని తెలిసీ తెలియని వైద్యంగా, అశాస్త్రీయ వైద్యంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. వైద్యులు అయిదేళ్ళు పూర్తిచేసుకుని, పట్టా పుచ్చుకొని, రోగులకు శాయశక్తులా నయం చేస్తామని ప్రమాణం చేశాకే వైద్య వృత్తిని అవలంబిస్తున్నారు. కానీ బుద్ధిజీవులు అందరూ ఈ విషయాలను కావాలనే విస్మరిస్తున్నారని కామేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కామేశ్వరరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తొలితరం ఆయుర్వేద వైద్యుడు. 20 ఏళ్లుగా ఆయన ఆయుర్వేదం మీదనే అనేక పరిశోధనలు చేసి ఇప్పటికి దాదాపు 70 రకాల మందులు సొంతంగా తయారు చేశారు. సురభి ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో సొంత ప్రయోగశాలను నడుపుతున్నారు. తన ల్యాబ్ లో తయారవుతున్న ఆయుర్వేద మందులు వందశాతం సహజసిద్ధమైనవని, సువాసన కోసం గానీ, కలర్స్ కోసం గానీ ఎలాంటి కృత్రిమ పదార్థాలు కలపడం లేదని, అందువల్లే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తన మందులకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందన్నారు. వికలాంగుడైన డాక్టర్ కామేశ్వరరావు తన పరిస్థితిని లెక్క చేయకుండా వారధి ఫౌండేషన్ పేరుతో పేదలకు క్రమం తప్పకుండా రేషన్ సరుకులు అందిస్తుండడం విశేషం.
Comments
Post a Comment
Your Comments Please: