వార్తల కవరేజీ విషయంలో కరోనా మహమ్మారికి ఎదురీదుతూ పనిచేస్తున్న జర్నలిస్టులను గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జైన్ కుమార్ విశ్వకర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది కాలంగా కరోనా విజృంభణకు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన తరుణంలో మీడియా సంస్థలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ఆదుకునే విషయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం స్వాగతించాల్సిన అంశమని జైన్ అన్నారు. అదే స్ఫూర్తితో స్థానిక ప్రభుత్వాలు కూడా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు వర్తింపజేసి జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో కొందరు జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి తనవంతుగా ఒక నెలకు సరిపడా సరుకులు అందజేశామని, జర్నలిస్టులకు చేయూతనందించే విషయంలో అన్ని సామాజికవర్గాలవారూ ముందుకు రావాలని జైన్ పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు టి.రమేశ్ బాబు కు ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ తరఫున ఈ సరుకులు అందజేశామని, ఇతర ప్రాంతాల్లోని బాధ్యులు కూడా ఎక్కడికక్కడ ఈ తరహాలో సరుకులు పంచాలని ఫెడరేషన్ సభ్యులను కోరారు.
ఈ కార్యక్రమంలో జైన్ తో పాటు వీవీఐఎస్ హైదరాబాద్ అధ్యక్షుడు కమ్మరి మహేశ్ ఆచార్య, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేపూరి లక్ష్మణాచారి, రాంచందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Good job
ReplyDelete