Skip to main content

Posts

Showing posts from September, 2021

వీరబ్రహ్మేంద్రస్వామినే అటకాయిస్తున్న ప్రబుద్ధులు

తెెలుగునాటనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోనే కాలజ్ఞాన కర్తగా, భవిష్యత్ దార్శనికుడిగా సకల సమాజం చేత పూజలందుకునే యుగపురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రమే. అలాంటిది తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో సాక్షాత్తూ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కుంటాల మండలం కల్లూరు గ్రామంలో మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామికి 40 ఏళ్లకు పైగా పూజలు జరుగుతూ వచ్చాయి. అయితే స్వామివార్ల విగ్రహాలు జీర్ణావస్థకు చేరుకోవడంతో.. అలాంటి విగ్రహాలకు పూజలు చేయరాదన్న నియమాల కారణంగా ఆ విగ్రహాలను పక్కన పెట్టారు. అలా దాదాపు తొొమ్మిదేళ్లుగా వీరబ్రహ్మేంద్రస్వామి నిత్యపూజలు ఆగిపోయాయి. స్వామివార్ల విగ్రహాలు మళ్లీ పునఃప్రతిష్టించడానికి అవసరమైన వనరుల కొరత కారణంగా ఆ  విషయం వాయిదా పడుతూ వస్తోంది. అయితే అదే విగ్రహాలున్న చోట ఖాళీగా ఉంచడం ఎందుకని కొన్ని సంవత్సరాల క్రితమే దేవీ నవరాత్రులకు అంకురారోపణ చేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రతియేటా దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నారు.  ఇటీవల కల్లూరు గ్రామంలోని విశ్వ...

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదు-ఎర్రోజు భిక్షపతి

ఏ నాయకుడు ఏ పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆగేది లేదని, విశ్వబ్రాహ్మణ జాతి అభ్యున్నతి కోసం మడమ తిప్పకుండా పోరాడతానని, ఈ ప్రయాణంలో జాతి రత్నాల్లాంటివారు కూడా అడ్డుకున్నా ప్రజల మద్దతుతో ముందుకెళ్తానని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి కరాఖండిగా తేల్చేశారు. సెప్టెంబర్ 5న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభలో భిక్షపతి తన వైఖరిని ప్రజలందరికీ విడమరచి చెప్పారు. గత పదేళ్లుగా కులసంఘంలో పని చేస్తూ జాతి అభివృద్ధి కోసం పాటు పడుతున్నానని, అన్ని రంగాల్లో వెనుకబడ్డ విశ్వబ్రాహ్మలకు ఏం చేయాలో తనకంటూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయన్నారు. 30 ఏళ్లకు పైగా విశ్వబ్రాహ్మణ కుల సంఘం పేరుతో పనిచేస్తున్న కొందరు పెద్దలు ఇప్పటివరకు ఏం చేశారో ఏ ఒక్కరికీ తెలియదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఉనికి చాటుకునేందుకే సంఘాల పేరుతో అమాయకులైన విశ్వబ్రాహ్మలను మోసం చేస్తున్నారని, ఆ మోసాలను ప్రశ్నిస్తున్నందువల్లే తన మీద కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారాలు  సాగిస్తున్నాయన్నారు. అయితే కులం ఎదుర్కొంటున...