తెెలుగునాటనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోనే కాలజ్ఞాన కర్తగా, భవిష్యత్ దార్శనికుడిగా సకల సమాజం చేత పూజలందుకునే యుగపురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రమే. అలాంటిది తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో సాక్షాత్తూ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కుంటాల మండలం కల్లూరు గ్రామంలో మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామికి 40 ఏళ్లకు పైగా పూజలు జరుగుతూ వచ్చాయి. అయితే స్వామివార్ల విగ్రహాలు జీర్ణావస్థకు చేరుకోవడంతో.. అలాంటి విగ్రహాలకు పూజలు చేయరాదన్న నియమాల కారణంగా ఆ విగ్రహాలను పక్కన పెట్టారు. అలా దాదాపు తొొమ్మిదేళ్లుగా వీరబ్రహ్మేంద్రస్వామి నిత్యపూజలు ఆగిపోయాయి. స్వామివార్ల విగ్రహాలు మళ్లీ పునఃప్రతిష్టించడానికి అవసరమైన వనరుల కొరత కారణంగా ఆ విషయం వాయిదా పడుతూ వస్తోంది. అయితే అదే విగ్రహాలున్న చోట ఖాళీగా ఉంచడం ఎందుకని కొన్ని సంవత్సరాల క్రితమే దేవీ నవరాత్రులకు అంకురారోపణ చేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రతియేటా దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నారు.
ఇటీవల కల్లూరు గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ, శివలింగం, గణపతి, సిద్ధయ్య తదితర విగ్రహాలు కొత్తవి తీసుకొచ్చి అక్కడ పునఃప్రతిష్ట చేసేందుుకు పూనుకున్నారు. అయితే తమ ఈ ప్రయత్నాన్ని గ్రామంలోని కొందరు యువకులు అడ్డుకుంటున్నారని, అక్కడ బ్రహ్మంగారి గుడి పునరుద్ధరించడానికి వీల్లేదని గొడవ పడుతున్నారని ఆ గ్రామంలోని పలువురు విశ్వబ్రాహ్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక కుంటాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే... అక్కడ బ్రహ్మంగారి గుడిపై అభ్యంతరాలున్నాయని, కాబట్టి ఆ ప్రయత్నం విరమించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారని, ఇదేం న్యాయమని వారు వాపోతున్నారు.
అయితే ఆ స్థలం విశ్వబ్రాహ్మణులకు చెందిందేనని ఊరందరికీ తెలుసని, తమ స్థలమే అయినా అమ్మవారి నవరాత్రోత్సవాలను తామంతా కలిసి ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నామని, కానీ ఇదివరకు ఉన్నట్టు బ్రహ్మంగారి విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే తమను అడ్డుకోవడం బాధగానే కాక అవమానంగానూ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని బ్రహ్మంగారి స్థలంగానే ఊరివారంతా చెప్పుకోవడం విశేషం. బ్రహ్మంగారి విగ్రహాలు ఏర్పాటు చేయటానికి విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కారణంగా పూజాదికాలకు అంతరాయం ఏర్పడిందని వారంటున్నారు. 50 సంవత్సరాల క్రిందట విశ్వబ్రాహ్మణుడైన ఆకోజి వెంకటస్వామి (స్వర్ణకార వృత్తి), రామిస్వామితో పాటు సైకిల్ టాక్స్ తో జీవనోపాధి పొందే మరో విశ్వబ్రాహ్మణుడు, హోటల్ నడుపుకునే మరో వ్యక్తి కల్లూరులో నివాసం ఉండేవారు. ఆర్థికపరమైన, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా రామస్వామి కమ్మర్పల్లి గ్రామానికి వలస వెళ్ళగా మిగతావారు రామ్ టెక్ వెళ్లారు. దీంతో అక్కడ బ్రహ్మంగారి విగ్రహాలను పట్టించుకునేవారు కరవయ్యారు. ఆ విధంగా పూజలకు నోచుకోని విగ్రహాలు జీర్ణావస్థకు చేరుకున్నాయి. మళ్లీ ఇప్పుడు తమ విగ్రహాలను తాము ప్రతిష్టించుకుంటే అవగాహన లేని కొందరు యువకులు తమను అడ్డుకోవడం సరైంది కాదని వారంటున్నారు. దీనిపై విశ్వబ్రాహ్మణ నాయకులు, సంఘాలు తమకు అండగా నిలవాలని కోరుతున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: