Skip to main content

Posts

Showing posts from November, 2021

వీవీఐఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేపూరి

విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ ఐక్య సంఘం  (వీవీఐఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేపూరి లక్ష్మణాచారిని నియమిస్తూ ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన ఆ సంఘం ముఖ్యనేతల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో చేపూరి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలపై చేపూరి ఎంతోకాలంగా పోరాడుతున్నారు. యువతరానికి తనదైన పంథాలో అవగాహన కల్పిస్తూ... కుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర నాయకత్వం.. తమ సంఘాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో మరింత పటిష్టం చేసేందుకు లక్ష్మణాచారికి చాలా కీలకమైన బాధ్యతలు కట్టబెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. విశ్వబ్రాహ్మణ సమాజం కోసం తాను పడుతున్న తపనను, తన శక్తి-సామర్థ్యాలను, రాష్ట్ర నాయకత్వం మీద తనకు గల విశ్వాసాన్ని గుర్తించి, తనకు చాలా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించిన ఎర్రోజు భిక్షపతికి ఈ సందర్భంగా చేపూరి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్...