విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ ఐక్య సంఘం (వీవీఐఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేపూరి లక్ష్మణాచారిని నియమిస్తూ ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన ఆ సంఘం ముఖ్యనేతల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో చేపూరి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలపై చేపూరి ఎంతోకాలంగా పోరాడుతున్నారు. యువతరానికి తనదైన పంథాలో అవగాహన కల్పిస్తూ... కుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర నాయకత్వం.. తమ సంఘాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో మరింత పటిష్టం చేసేందుకు లక్ష్మణాచారికి చాలా కీలకమైన బాధ్యతలు కట్టబెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.
విశ్వబ్రాహ్మణ సమాజం కోసం తాను పడుతున్న తపనను, తన శక్తి-సామర్థ్యాలను, రాష్ట్ర నాయకత్వం మీద తనకు గల విశ్వాసాన్ని గుర్తించి, తనకు చాలా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించిన ఎర్రోజు భిక్షపతికి ఈ సందర్భంగా చేపూరి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఇందుకోసం రాష్ట్ర నాయకులు, మహిళా, యువజన విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, ఆయా జిల్లాల నాయకుల సమన్వయంతో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నయ్యాచారి, ఇతర కార్యవర్గానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు. కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...
Comments
Post a Comment
Your Comments Please: