Skip to main content

Posts

Showing posts from December, 2021

శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్

చిత్రం ఏమంత దరిద్రంగా వుంది??? బానే తీశారు కదా.... నటన, కథ, నాట్యం, సంగీతం, సాహిత్యం అన్నీ బానే వున్నాయి కదా.. గొప్ప చిత్రం కాకపోయినా అసహ్యంగా అయితే లేదు కదా అనే అనుమానం మనకు రాక మానదు.. నిజమే సాంకేతికంగా అన్నీ బానే వున్న చిత్రమే.... అందునా నాని చిత్రం....సాయి పల్లవి లాంటి నాట్యం నటన అద్భుతంగా చేసే నటి వున్న చిత్రం అన్నీ సమపాళ్లలో వున్న చిత్రమే. కాకపోతే వొచ్చిన చిక్కల్లా అనసరంగా పెట్టిన రెండు విషయాలు.  1. కమ్యూనిజం. 2. హిందూ ద్వేషం. అనవసరంగా పెట్టారు అనేకన్నా కావాలనే పెట్టినట్టు అనిపించింది. అందుకే పొరబాటు అయితే పోనీలే అని వొదిలెయ్యొచ్చు కానీ కావాలని చేస్తే మాత్రం తగ్గేదెలే.. అందుకే ఈ విశ్లేషణ.. అసలు నేను దీనికి విశ్లేషణ రాయకూడదు అనుకున్నా. రాసినా రెండే రెండు ముక్కల్లో ముగించెయ్యాలి న్యాయంగా.  కానీ మరీ రెండు ముక్కల్లో అయితే సదరు దర్శకుని సంగతి అంచనా వెయ్యటం కష్టం కదా, అందుకే ఇలా... మొట్ట మొదటగా కొన్ని విషయాలు చెప్పేసి తర్వాత చిత్రం గూర్చి చర్చించుకుందాం. 1. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద జోక్ ప్రజాస్వామ్య దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉండి, అది ఎన్నికల్లో పాలుపంచ...

12 ఏళ్ల లోపు పిల్లలకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్

రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థను (ఆర్టీసీ) కొత్తపుంతలు తొక్కిిస్తున్న ఎండీ సజ్జనార్ మరో కొత్త ఆఫర్ తో ముందుకొచ్చారు. ఆంగ్ల సంవత్సరాది, జనవరి ఫస్టును పురస్కరించుకొని 12 ఏళ్ల లోపువారికి  ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సజ్జనార్ కల్పించారు. ఆ ఒక్కరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా వారి వెంట ఉండాలి. ఆర్టీసీ ప్రయాణంలో ఉండే సౌకర్యం, భద్రతతో పాటు పెరిగిన పెట్రో ధరల కారణంగా ప్రైవేట్ సర్వీసుల్లో ప్రయాణం చాలా కాస్ట్ లీ గా తయారైన దరిమిలా ఈ సౌకర్యాన్ని పేరెంట్స్, పిల్లలు ఉపయోగించుకోవాలని సజ్జనార్ సూచించారు. పేద, మద్య తరగతి ప్రజలు జనవరి ఫస్టు  రోజున సెలబ్రేషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ సర్వీసును ఉపయోగించుకోవచ్చని కోరారు. ప్రభుత్వ అధికారులందరూ ఈ విషయాన్ని పెద్దస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. సజ్జనార్ ఇప్పటికే జంట నగరాల్లో రూ. 100 కే 24 గంటలు అన్ని సర్వీసుల్లోనూ తిరగగలిగేలా టీ-24 (ట్రావెల్ 24 అవర్స్) ఆ...

బండీ.. నీ దొంగ దీక్ష ఢిల్లీలో చెయ్యి

- నిరుద్యోగ దీక్ష ఢిల్లీలో చేయి..మోడీ ఇస్తానన్న 14 కోట్ల ఉద్యోగాలు ఏవి..? - కేంద్రంలో ఖాళీగా ఉన్న 9 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదు..? - కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి - రేవంత్ రెడ్డి, బండి సంజయ్ రాజకీయ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన వయసు కు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ది నిరుద్యోగ దీక్ష కాదు దొంగ దీక్ష అని విమర్శించారు.నిరుద్యోగ దీక్ష ఢిల్లీలో చేయాలన్నారు. మోడీ ఇస్తానన్న 14 కోట్ల ఉద్య...

జనవరి ఫస్టు రోజున చలో రామప్ప - బొడ్డుపల్లి బాలబ్రహ్మం

ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఫస్టున  ఓ భారీ యాత్రను తలపెట్టారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఖ్యాతికెక్కిన రామప్ప దేవాలయ యాత్రను శనివారం (జనవరి ఫస్టు) తలపెట్టామని మంగళంపల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి బాలబ్రహ్మాచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటవ తేదీ శనివారం రాత్రి‌ BHEL నుండి ఓ లగ్జరీ బస్సు బయలుదేరి రెండవతేదీ ఆదివారం ఉదయానికల్లా దక్షిణ  కాశీగా అందరూ పిలుచుకునే కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి త్రివేణి సంగమంలో పుణ్యనదీ స్నానం  ఆచరించి, ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ప్రాణవట్టం పై (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు) యముడు, శివుడి దర్శనం చేసుకుంటారు. అనంతరం బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశ్వరీమాత నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనం ముగించుకొని మద్యాహ్నం 2 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత రామప్ప గుడిని చేరుకుంటారు. రామప్ప గుడి శిల్పసంపద, ముఖ్యమైన ప్రదేశాలు, వాటి గొప్పతనం తెలిపే విషయ...

అద్భుతమైన సినిమా - చెత్త మెసేజ్

శ్యామ్ సింగారాయ్ సినిమా చాలా మంచి కళాత్మక విలువలున్న సినిమా. చిత్రీకరణ, ఫోటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ కు న్యాయం చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి కూడా బాగా నటించింది. మంచి పాత్ర ను ఎంచుకోడంలో సాయి పల్లవి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు హైలెట్ హీరో నాని పాత్ర శ్యామ్ సింగరాయి , చాలా హుందాగా ఉంది పాత్ర. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కథక్ నృత్యం చేస్తూ ఒక సీన్ లో ఆమె చేసే నాట్యం ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది.  కథ విషయానికి వస్తే, హీరో సినిమా డైరెక్టర్. 2020 లోమొదటి సినిమా తీసి హిట్ సాధిస్తాడు. అతను పేరు సాధిస్తాడు. అనుకోకుండా అతను ఒక కేసులో  ఇరుక్కుని పోతాడు. ఆ కేసు నుండి బయట పడడానికి అతన్ని, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే, ఆమె అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకొంటుంది. సినిమా 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి శ్యామ్ సింగరాయ్ దగ్గరకు వెళుతుంది. అతను ఒక బెంగాల్ కవి, అతని తల్లి తెలుగామే, కాబట్టి తెలుగు కూడా వస్తుంది. హీరో , 4 అన్నతమ్ముల్లో చిన్నోడు. వారిది ఉన్నత కుటుంబం, అభ్యుదయ భావాలు కలిగిన అతడు నాస్తికుడు, దేవుని నమ్మడు. కులానికి, మతాలకు వ్యతిరేకంగ...

ఎల్లూరి శివారెడ్డికి వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం

స్వయంగా రచనలు చేయడం ద్వారానే కాకుండా తెలుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, తెలంగాణ సారస్వత పరిషత్ వంటి సంస్థల ద్వారా తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి అత్యున్నతమైన సేవలందించిన డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి ఎంతో అభినందనీయులని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలోని శాంతా-వసంతా ట్రస్టు తెలంగాణ సారస్వత పరిషత్తులోని  డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి డా.వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. అలాగే పరిషత్ ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్యకు తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా, వరప్రసాదరెడ్డి సభాధ్యక్షులుగా పాల్గొని పురస్కార గ్రహీతలకు లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, సన్మానపత్రం అందజేశారు. శాలువాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ శాంతా బయోటెక్నిక్స్ ద్వ...