రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థను (ఆర్టీసీ) కొత్తపుంతలు తొక్కిిస్తున్న ఎండీ సజ్జనార్ మరో కొత్త ఆఫర్ తో ముందుకొచ్చారు. ఆంగ్ల సంవత్సరాది, జనవరి ఫస్టును పురస్కరించుకొని 12 ఏళ్ల లోపువారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సజ్జనార్ కల్పించారు. ఆ ఒక్కరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా వారి వెంట ఉండాలి. ఆర్టీసీ ప్రయాణంలో ఉండే సౌకర్యం, భద్రతతో పాటు పెరిగిన పెట్రో ధరల కారణంగా ప్రైవేట్ సర్వీసుల్లో ప్రయాణం చాలా కాస్ట్ లీ గా తయారైన దరిమిలా ఈ సౌకర్యాన్ని పేరెంట్స్, పిల్లలు ఉపయోగించుకోవాలని సజ్జనార్ సూచించారు. పేద, మద్య తరగతి ప్రజలు జనవరి ఫస్టు రోజున సెలబ్రేషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ సర్వీసును ఉపయోగించుకోవచ్చని కోరారు. ప్రభుత్వ అధికారులందరూ ఈ విషయాన్ని పెద్దస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. సజ్జనార్ ఇప్పటికే జంట నగరాల్లో రూ. 100 కే 24 గంటలు అన్ని సర్వీసుల్లోనూ తిరగగలిగేలా టీ-24 (ట్రావెల్ 24 అవర్స్) ఆఫర్ పరిచయం చేశారు. సిటీలోని ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ లకు కూడా టీ-24 టికెట్ వర్తిస్తుంది.
Read This Also: జనవరి ఫస్టు - చలో రామప్ప
Comments
Post a Comment
Your Comments Please: