శ్యామ్ సింగారాయ్ సినిమా చాలా మంచి కళాత్మక విలువలున్న సినిమా. చిత్రీకరణ, ఫోటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ కు న్యాయం చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి కూడా బాగా నటించింది. మంచి పాత్ర ను ఎంచుకోడంలో సాయి పల్లవి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు హైలెట్ హీరో నాని పాత్ర శ్యామ్ సింగరాయి , చాలా హుందాగా ఉంది పాత్ర. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కథక్ నృత్యం చేస్తూ ఒక సీన్ లో ఆమె చేసే నాట్యం ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది.
సినిమా 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి శ్యామ్ సింగరాయ్ దగ్గరకు వెళుతుంది. అతను ఒక బెంగాల్ కవి, అతని తల్లి తెలుగామే, కాబట్టి తెలుగు కూడా వస్తుంది. హీరో , 4 అన్నతమ్ముల్లో చిన్నోడు. వారిది ఉన్నత కుటుంబం, అభ్యుదయ భావాలు కలిగిన అతడు నాస్తికుడు, దేవుని నమ్మడు. కులానికి, మతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. అతను ప్రజల కోసం పోరాడే ఒక సామాజిక కార్యకర్త, కవి.
*****
హీరో: "నేను ప్రపంచం గురించి రాస్తూ ఉంటాను"
హీరోయిన్: "మరి నాగురించి ఎప్పుడు రాస్తావు?"
"నేను వెళ్తాను
నేను రాస్తాను"
లాంటి డైలాగ్ లు బాగున్నాయి.
నీ విలువ నీకు తెలియదు, నాతో రా! అని హీరో అంటే, "అర్ద మూట బియ్యం కోసం మా అమ్మ నన్ను చిన్నప్పుడే అమ్మేసింది. అది నా విలువ" అంటుంది.
"మా మీద హక్కు ఆ దేవుడికి కూడా లేదు",
"ఆ నీరు దళితులు తాగితే అంటారానిడైతే, మరి వారు పీల్చిన గాలి మీరెందుకు పీలుస్తున్నారు",
"నీ వల్ల మా పరువంతా పోయింది, నిన్ను చంపితే కాస్తయినా మా పరువూ నిలబడుతుంది"
అమ్మాయి తలను, కళ్ళను,పెదవులను, జుట్టును వర్ణిస్తూ కవిత్వం చెప్పే సీన్ బాగుంటుంది.
"మైత్రేయి! ఇన్ని ముళ్ళ మద్య కూడా నువ్వు వికసిస్తున్నావు, నీ పేరు ఇప్పటి నుండి రోసీ(Rosy)"
లాంటి డైలాగ్ లు బాగున్నాయి. "అమావాస్య రోజు, నీ ఒడిలో నేను చచ్చిపోతే నాకు గౌరవం" అని వయస్సులో అన్న హీరోయిన్ పునర్జన్మ ఎత్తిన ప్రీయున్ని తన వృద్దాప్యంలో అతని వొడిలో చనిపోవడం తో కథ ముగుస్తుంది.
చాలా అద్భుతమైన సినిమా....
ఫోటోగ్రఫీ ,డైలాగ్ లు సూపర్...
కానీ పునర్జన్మ అనే కాన్సెప్ట్ బాగాలేదు. సందేశం బాగా లేదు, హీరోయిన్ తన హావభావాలను పలికించడానికి కూడా నాట్యాన్ని చూపారు. కవిగా,సంస్కర్త గా, సోషల్ ఆక్టివిస్ట్ గా హీరో నాని అద్భుతంగా నటించాడు. డైరెక్షన్ బాగుంది. పునర్జన్మ కాన్సెప్ట్ తప్ప, మిగిలిన సినిమా మొత్తం సూపర్. శ్యామ్ సింఘారాయ్ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా చూసాను అనే ఫీలింగ్ కలిగింది.
- చీపాటి రాజేశ్వరరావు
Also Read: శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్
Comments
Post a Comment
Your Comments Please: