ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఫస్టున ఓ భారీ యాత్రను తలపెట్టారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఖ్యాతికెక్కిన రామప్ప దేవాలయ యాత్రను శనివారం (జనవరి ఫస్టు) తలపెట్టామని మంగళంపల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి బాలబ్రహ్మాచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటవ తేదీ శనివారం రాత్రి BHEL నుండి ఓ లగ్జరీ బస్సు బయలుదేరి రెండవతేదీ ఆదివారం ఉదయానికల్లా దక్షిణ కాశీగా అందరూ పిలుచుకునే కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి త్రివేణి సంగమంలో పుణ్యనదీ స్నానం ఆచరించి, ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ప్రాణవట్టం పై (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు) యముడు, శివుడి దర్శనం చేసుకుంటారు. అనంతరం బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశ్వరీమాత నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనం ముగించుకొని మద్యాహ్నం 2 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత రామప్ప గుడిని చేరుకుంటారు. రామప్ప గుడి శిల్పసంపద, ముఖ్యమైన ప్రదేశాలు, వాటి గొప్పతనం తెలిపే విషయాలను వీడియో షూట్ చేస్తారు. యాత్రలో పాల్గొన్నవారి అభిప్రాయాలు, అనుభూతులను రికార్డు చేస్తారు. సాయంత్రం 5 గంటలకు రామప్ప నుంచి బయలుదేరి వరంగల్ వేయి స్తంభాల గుడి, రుద్రేశ్వరాలయం, భధ్రకాళి అమ్మవార్లను దర్శించుకొని రాత్రి పది గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని బాలబ్రహ్మాచారి చెప్పారు. ఈ యాత్రలో భాగంగా రామప్ప గుడిని తీర్చిదిద్దిన రాక్ మెల్టింగ్ టెక్నాలజీ, శాండ్ టెక్నాలజీలపై నిపుణుల చేత ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తామన్నారు.
రామప్ప గుడికి అంతర్జాతీయ ఖ్యాతి లభించగానే కొందరు సూడో మేధావులు రామప్ప దేవాలయం పేరు మార్చే కుట్రలకు పాల్పడుతున్నారని, ఎన్నడూ లేనిది రుద్రేశ్వరాలయంగా పేర్కొంటూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని, శతాబ్దాలుగా ప్రజలందరూ పిలుచుకునే పేరుకు బదులుగా కొత్తగా ఆనాటి పాలకుడి పేరును తెరమీదికి తెస్తున్నారని బాలబ్రహ్మం ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మన ప్రాచీన శిల్పాచార్యులను శంకించడం, అవమానించడమే అవుతుందన్నారు. ఆధునిక చరిత్రకు అందని రోజుల్లోనే ఎందరో శిల్పాచార్యులు తమ జీవితాలను ధారవోసి భారతీయ సంస్కృతిని, కళలను సుసంపన్నం చేశారని, అలాంటివారి అసమాన ప్రతిభను తెరమరుగు చేసే కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
యాత్ర సందర్భంగా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ- స్నాక్స్ లు సైతం ఏర్పాటు చేస్తున్నామని, యాత్రలో పాల్గొనేవారు రూ. వెయ్యి రూపాయలు చెల్లించి సీటు రిజర్వు చేసుకోవాలని సూచించారు. తనను 92477 37298 నెంబరులో సంప్రదించవచ్చని, అలాగే ఈ యాత్రకు పక్కా ప్లాన్ చేసి సహకరిస్తున్న కొత్తపల్లి సీతారామాచారిని 98499 32519 నెంబరులో సంప్రదించవచ్చని ఆయన చెప్పారు. జనవరి ఫస్టున అమరశిల్పి జక్కన జయంతి కావడం విశేషం.
బొడ్డుపల్లి బాలబ్రహ్మాచారి
Nice article , useful info
ReplyDeletethank you
Delete