ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దయ తలచారు. చిన్న, మధ్య తరహా స్థాయి పత్రికలు ఇంకా బతికే ఉన్నాయని గుర్తించారు. తామంతా బతికున్న విషయం కేసీఆర్ గుర్తించినందుకు పత్రికా యాజమాన్యాలు తెగ సంబరపడిపోతున్నారు. తమ ఆకలికేకలు తీరుతాయో లేదో తెలీదు కానీ, తమ పత్రికలకు మాత్రం ఊపిరి పోసినందుకు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాసిన్ని ఆనందబాష్పాలు కూడా రాల్చారు. తెలంగాణ కోసం పెద్దపత్రికలు ఏం చేశాయో ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు. మదపుటేనుగు లాంటి పెద్దపత్రికల వ్యవహార శైలికి సాక్షాత్తూ ముఖ్యమంత్రులే నిండు అసెంబ్లీల్లో ఏం అభిప్రాయాలు వెలిబుచ్చారో, ఎంత ఆగ్రహం వెళ్లగక్కారో ఇప్పుడు చెప్పుకోవడం అస్సలు బాగుండదు. కానీ చిన్న పత్రికలు మాత్రం తెలంగాణవాదం మినహా మరో మాటకు తావు లేకుండా పని చేశాయి. ఉడుతా భక్తిని ప్రదర్శించాయి. ఉద్యమ నాయకుడి వెంట ఉద్యమ గొంతుకలై చిన్న పత్రికల సంపాదకులు, విలేకర్లంతా కలాలతో కవాతులు చేయించారు. అయితే ప్రజలకు వాటి రీచ్ పెద్దగా లేకపోవచ్చు గానీ ఒకవేళ ఉంటే అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలందరూ ఈ చిన్న పత్రికలనే అక్కున చేర్చుకొని ఉండేవారు. ఆ విషయం ఈనాడు అధికారంలో ఉన్న ఆనాటిి ఉద్యమ నాయకులందరికీ తెలుసు. అయినా చిన్న పత్రికల మొహాల్లో ఒక చిరునవ్వు మొలిపించటానికి ఇంత టైమ్ తీసుకున్నారు. అయినా అదే పదివేలు.
చిన్న పత్రికలకు అండగా ప్రభుత్వం - అల్లం నారాయణ
చిన్న పత్రికలకు అన్నివిధాలా అండగా ఉంటామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన చిన్న పత్రికల కృతజ్ఞతా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు ముందు చిన్న పత్రికల సంపాదకులు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లకు క్షీరాభిషేకం చేసి ఆనందోత్సాహాలు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చిన్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం ఆనందించాల్సిన విషయమని అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. చెయ్యనివాటి గురించి మాట్లాడుకున్నట్లుగానే చేసిన వాటి పట్ల కృతజ్ఞతలు తెలపడం జర్నలిస్టులుగా మనందరి కనీస బాధ్యత అంటూ గుర్తు చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు తక్షణ సహాయం అందించి ఆదుకుందని ప్రశంసించారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, మేగజైన్స్ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ఎంప్యానెల్ మెంట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గం
హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఎంప్యానల్డ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా బిజిగిరి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిరికొండ ఆగస్టిన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసరి వెంకటేశ్వర్ రావు, గౌరవాధ్యక్షులుగా డి.ఎస్.ఎన్ మూర్తి, సలహాదారులుగా కె. సూర్యనారాయణ, ఉస్మాన్ రషీద్, ఉపాధ్యక్షులుగా జానకి రామ్, అవ్వారి భాస్కర్, అర్పెల్లి శ్రీనివాస్, వెన్నమళ్ళ రమేష్ బాబు, కట్టా రాఘవేందర్ రావు, ట్రెజరర్ గా జి. ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ గా ఖలీల్, జె. సంపత్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా సాయి కిరణ్, పి. సత్యం నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో టి.యు.డబ్ల్యు.జె. పట్టణ అధ్యక్షులు యోగానంద్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ యారా, ఎలక్ట్రాన్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, చిన్న, మధ్య తరహా పత్రికల సంపాదకులు, తదితరులు పాల్గొన్నారు.

Weakend Story: కృషి ఉంటే యువకులు రమేశ్ లు అవుతారు
Comments
Post a Comment
Your Comments Please: