Skip to main content

Posts

Showing posts from March, 2022

నకిలీ డీఎస్పీకి కొమ్ముకాస్తున్న అస్లీ ఖాకీలు

కర్నూల్, భాగ్యనగర్ పోస్ట్ ప్రతినిధి: శ్రీశైల మహాక్షేత్రంలో  గత సం డిసెంబర్ 31 రాత్రి నకిలీ డీఎస్పీ రజాక్ అనుచరులు శ్రీశైలం వచ్చిన భక్తులపై దాడి చేశారు. ఆ దాడిలో భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేస్తే,  ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 323, 324, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పోలీసుల దుర్బుద్ధి, దురుద్దేశాలు ఇక్కడే బయట పడుతున్నాయంటున్నారు బాధిత భక్తులు. మారణాయుధాలతో దాడులు చేసి, రక్తాలు కారేలా కొట్టి, చంపడానికి యత్నిస్తే.. హత్యా యత్నాన్ని సూచించే 307 పెట్టకపోవడం ఏంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఆ రాత్రి శ్రీశైలంలో నకిలీ డీఎస్పీ అనుచరులు నానా బీభత్సమే సృష్టించారు. ఓ సత్రంలోని రెండో అంతస్తు నుంచి ఓ వ్యక్తిని తోసేశారు. బాధితుణ్ని  హుటాహుటిన ప్రాజెక్ట్ వైద్యశాలకు తరలించారు. తనను ఎవరు ఏం చేశారు.. ఎలా గాయాలయ్యాయో.. పోలీసుల సమక్షంలో, వైద్యుల ముందే బాధితుడు చెబుతున్నా అతని వాంగ్మూలాన్ని మాత్రం పోలీసులు రికార్డు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో తీయకపోవడం, స్టేట్మెంట్ ఫైల్ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తక్షణం జిల్లా యంత్రాంగం

శ్రీశైలం కమ్మవారి సత్రంలో ఉచిత కంటి పరీక్షలు

శ్రీశైలంలో కాకతీయ కమ్మవారి అన్న సత్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందజేశారు. కాకతీయ కమ్మవారి అన్న సత్రం ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వారి సారథ్యంలో ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 232 మందికి కంటి పరీక్ష చేశారు. వారిలో కంటి అద్దాలు 146 మందికి, 53 మందికి కంటి శస్త్ర చికిత్సలు చెయ్యవలసి ఉంది. అయితే ఈ శిబిరంలో 63 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని, మిగిలిన 83 మందికి వారం రోజుల్లో కళ్లజోళ్లు అందిస్తామని.. 53 మందికి శస్త్ర చికిత్స మార్కాపురంలోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో ఉచితంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కమ్మ సత్రం ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్రబోస్, కమిటీ సభ్యులు కె.మల్లికార్జున, కె.రమణ,పి.వెంగయ్య, సి.విద్యాధరరావు, సత్రం మేనేజర్ రామచంద్రరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నుంచి వైద్య సిబ్బంది వి.వాసుబాబు (రీజినల్ అడ్మినిస్ట్రేటర్), కె.మహేష్ (అడ్మినిస్ట్రేటర్), జె.పాపయ్య  (అడ్మినిస్ట్రేటర్), డి.కాశి (ఐ స్పెషలిస్ట్), సి.చరణ్ (ఐ స్పెషలిస్ట్), జి.వందనం, నాగరాజు ప