శ్రీశైలంలో కాకతీయ కమ్మవారి అన్న సత్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందజేశారు. కాకతీయ కమ్మవారి అన్న సత్రం ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వారి సారథ్యంలో ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 232 మందికి కంటి పరీక్ష చేశారు. వారిలో కంటి అద్దాలు 146 మందికి, 53 మందికి కంటి శస్త్ర చికిత్సలు చెయ్యవలసి ఉంది. అయితే ఈ శిబిరంలో 63 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని, మిగిలిన 83 మందికి వారం రోజుల్లో కళ్లజోళ్లు అందిస్తామని.. 53 మందికి శస్త్ర చికిత్స మార్కాపురంలోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో ఉచితంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమ్మ సత్రం ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్రబోస్, కమిటీ సభ్యులు కె.మల్లికార్జున, కె.రమణ,పి.వెంగయ్య, సి.విద్యాధరరావు, సత్రం మేనేజర్ రామచంద్రరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నుంచి వైద్య సిబ్బంది వి.వాసుబాబు (రీజినల్ అడ్మినిస్ట్రేటర్), కె.మహేష్ (అడ్మినిస్ట్రేటర్), జె.పాపయ్య
(అడ్మినిస్ట్రేటర్), డి.కాశి (ఐ స్పెషలిస్ట్), సి.చరణ్ (ఐ స్పెషలిస్ట్), జి.వందనం, నాగరాజు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: