Skip to main content

భారత్-రష్యా స్ట్రాంగ్ అయితే అమెరికా ఏం చేస్తుంది?

రష్యా-భారత్ మైత్రీ బంధం బలపడితే అమెరికా ఏం చేస్తుంది? మనతో స్నేహపూర్వకంగా ఉన్న అమెరికా ఆ స్నేహబంధాన్ని తెంచుకునే సాహసం చేస్తుందా? అసలు అమెరికా లాంటి అగ్రరాజ్యాలు అంతర్జాతీయ అంశాలను శాసించాలనుకోవడం ఎంతవరకు క్షేమకరం? అలాంటి అవాంఛనీయ జోక్యాలకు ఆస్కారం ఇవ్వకుండా రష్యా-భారత్ ఏదైనా ఉపాయం కోసం అన్వేషిస్తున్నాయా? నిన్న రష్యా విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటించాక ఈ అంశాల మీదనే చర్చ జరుగుతోంది. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న క్రమంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇండియాలో పర్యటించడమే కాక.. ఇండియా మీద సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. ఇండియాకు ఎలాంటి సాయమైనా చేసేందుకు, ఎలాంటి సరుకైనా అందించేందుకు ఎంతదూరమైనా వెళ్తామన్నారు. మరి.. ప్రపంచానికే పెద్దన్నగా భావించే అమెరికాకు ఈ అంశం మింగుడు పడుతుందా? భారత్-రష్యా చెట్టపట్టాలేసుకుంటే అగ్రరాజ్యపు ఆధిపత్యానికే మచ్చ కదా? ఇలాంటి తరుణంలో అమెరికా స్పందిస్తున్న తీరు దేనికి సంకేతం? రానున్న రోజుల్లో ఇండియా దౌత్య సంబంధాలు ఎలా ఉంటాయి? ఇప్పటివరకూ భారత్ ను నమ్మకమైన దేశంగా భావిస్తున్న అమెరికా.. ఇకనుంచి అనుమానించడం మొదలెడుతుందా? రష్యా-ఉక్రెయిన్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న భారత్.. అటు రష్యాకు, ఇటు ఉక్రెయిన్ కు మిత్రదేశంగా ఎలా మనగలుగుతుంది? ఇప్పటికే చైనాతో శత్రుత్వం పతాక స్థాయికి చేరిన దృష్ట్యా.. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కొత్త శత్రువుగా తయారు చేసుకుంటుందా? ఇవే అంశాలు మన దేశ రాజకీయ పండితులను ఆలోచింపజేస్తున్నాయి. 

రష్యా విదేశాంగ మంత్రి వచ్చీరాగానే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ను కలిశారు.  అక్కడ కాస్త బ్రీఫింగ్ అయిన తరువాత ప్రధాని మోడీతో ఫైనల్ మీటింగ్ జరిగింది. వారిద్దరి భేటీ చాలా ఓపెన్ మైండెడ్ గా సాగింది. రెండు దేశాల ప్రయోజనాలు, అంతర్జాతీయ ఆటంకాలు, అమెరికా ఆంక్షలను తప్పించుకునే మార్గాలు.. ఇలా కీలకమైన అంశాలమీద చర్చ జరిగినట్లు సమాచారం. ఆ ఇద్దరి చర్చల తరువాత లావ్రోవ్.. భారత్ పట్ల పూర్తి విశ్వాసం ప్రకటించడం విశేషం. భారత వైఖరిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని డిక్లేర్ చేయడం.. ఇక్కడ అండర్ లైన్ చేసుకోవాల్సిన అంశం. మరి రష్యా వార్ కు ఫుల్ స్టాప్ పెడతానని హామీ ఇచ్చిందా? ఒకవైపు చర్చలు జరుపుతూనే ఉక్రెయిన్ మీద బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా... శాంతి కోసం ప్రయత్నిస్తున్న ఇండియా మాట వింటుందా? భారత్ తన స్టాండ్ మీద క్లారిటీ ఇవ్వకుండానే రష్యా ఇంత గొప్ప నమ్మకాన్ని ఎలా ప్రకటించుకుంటుంది? ఇలాంటి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టే ఒకే ఒక శబ్దం.. బహుళ ధృవ ప్రపంచం. అవును.. ప్రపంచంలోని అన్ని దేశాల మీద ఏదో ఒక అగ్రరాజ్యం పెత్తనం చెలాయించడానికి చెక్ పెట్టాలనే సుదీర్ఘమైన ఆలోచనల మీద వర్కవుట్ చేయాలని నిశ్చయించుకున్నారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఈ బహుళ ధృవ ప్రపంచమే హైలైట్ అంశంగా నిలిచింది. ఈ ఆలోచనను బలోపేతం చేసే మిగతా అంశాలపై విపులంగా చర్చించుకున్నారు. దేశాల మధ్య అపోహలు తొలగించుకోవాలి. అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. ఇందుకోసం చర్చలకు మించిన మార్గం లేదు. ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. ఒక దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశాల జోలికి వెళ్లకూడదు. పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. పరస్పర ప్రయోజనాలను గుర్తించి అవి నెరవేర్చే మార్గాల కోసం నిరంతరం కసరత్తు జరగాలి. ఇలాంటి పారదర్శకమైన ఆలోచనలే అటు జైశంకర్ నుంచి, ఇటు మోడీ నుంచి లావ్రోవ్ గ్రహించారు. అందుకే ఇండియాకు రష్యా మీద గానీ, ఉక్రెయిన్ మీద గానీ ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేవని తెలుసుకున్నారు. తమ రెండు దేశాల మధ్య భారత్ డబుల్ గేమ్ ఆడుతున్నట్టు కాకుండా.. ప్రపంచ శాంతి కోసం ఎంతదాకానైనా వెళ్లేందుకు, అదే సమయంలో ఆత్మగౌరవం, సార్వభౌమాధికారం వంటి కీలక అంశాల్లో ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డ భారత్ ను లావ్రోవ్ అర్థం చేసుకున్నారు. ఇలాంటి పూర్తి విశ్వాసం మీదనే.. భారత్ కు ఎలాంటి సాయమైనా చేసేందుకు, ఎలాంటి సరుకైనా అందించేందుకు ఎంతదూరమైనా వెళ్తామని చెప్పగలిగారు. 

మరి బహుళ ధృవ ప్రపంచం ఎలా ఉంటుంది? ఎవరో ఒకరి అజమాయిషీ లేకపోతే బలమున్న ప్రతిఒక్కరూ బలహీన దేశాల మీద కాలుదువ్వితే కంట్రోల్ చేసేది ఎవరు? ఉక్రెయిన్ లాంటి దేశాల బేలతనాన్ని ఆసరా చేసుకొని రష్యా లాగా ఎగిరిపడే దేశాలను నియంత్రించేది ఎవరు? దానికి మెకానిజం ఎలా ఉంటే బాగుంటుంది? ఇవన్నీ తరువాతి దశలో క్లారిటీకి వచ్చే అంశాలు. ఇప్పటికైతే బై-పోలారైజ్డ్ ప్రపంచానికి చరమగీతం పాడాలి. అందుకోసం ఇండియా కూడా తన స్టాండ్ మార్చుకుంది. నెహ్రూ హయాంలో అమల్లోకి వచ్చిన అలీన విధానానికి ఇండియా స్వస్తి చెప్పినట్టే భావించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. అలీన విధానం వల్ల ఇండియా బావుకున్నదేమీ లేదని తేలిపోయింది. పైగా.. ఎవరూ మనల్ని నమ్మే అవకాశం లేకుండా పోయింది. ఎవరితో కలవకపోవడమే అలీన విధానంలోని కిటుకు. అలాంటప్పుడు మనతో ఎవరైనా ఎందుకు కలవాలి? అందుకే పాకిస్తాన్ మన మీద దాడులకు దిగినప్పుడు నెత్తురోడుతూ ఎదుర్కొన్నాం. అటు చైనా కూడా కాలుదువ్వినప్పుడు, వేలాది మైళ్లు ఆక్రమించినప్పుడు పంటిబిగువున భరిస్తూ వస్తున్నాం. అగ్రరాజ్యాల దయాదాక్షిణ్యాల మీద కాకుండా.. సొంత శక్తిపైనే ఎదగాలని మోడీ నేతృత్వంలోని భారత్ శ్రమిస్తోంది. మన దేశ రక్షణ విభాగాని దాదాపు 70 శాతం నిధులు పెంచడమే అందుకు ఓ నిదర్శనం. ఈ కారణంగానే అమెరికా భారత్ వైఖరి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, ఆగ్రహం ప్రదర్శిస్తున్నా.. ఆంక్షల జోలికి వెళ్లడానికి జంకుతోంది. రష్యా-భారత్ చర్చల్లో అంతర్జాతీయ ఆంక్షల్ని తప్పించుకనే అంశాలపై విపులంగా చర్చించారు. అంటే ఏక ధృవ, ద్విధృవ ప్రపంచం నుంచి బయటపడి.. బహుళ ధృవ ప్రపంచం దిశగా సుదీర్ఘమైన ప్రయాణంలో ఓ అడుగు పడిందనే నిపుణులు భావిస్తున్నారు. 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...