తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు" పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత” అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.
Also Read: కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. "యప్ టీవీ" ద్వారా అమెరికాతో పాటు, యూరప్ దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ టీవి - భారత్, మన టీవి, టీవీ ఆసియా - తెలుగుతో పాటు ఇతర మాధ్యమాల్లో కూడా ప్రసారం అవుతుంది.
జె.వి.కుమార్ వృత్తి రీత్యా విశ్రాంత ఫార్మా ఉద్యోగులు. ప్రవృతి రీత్యా కవి, రచయిత, సామాజిక కార్యకర్త. సృజనాత్మక రచనలు చేసే జె.వి.కుమార్ చేపూరి ఇంత వరకు 900 పైచిలుకు కవితలు, 30కి పైగా వ్యాసాలు, 45కు పైగా కథలు రాశారు. వీరు రాసిన రచనల్లో సగానికి పైగా ఉత్తమ రచనలుగా ఎంపికవడం విశేషం. వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురణకు నోచుకున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎన్నో పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఆయన సాహితీ సృజనకు గాను సాహితీ రత్న, కవిరత్న, సహస్ర కవికిరణం అనే బిరుదులు అందుకున్నారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి పురస్కారం అందుకున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. భాగ్యనగర తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన జె వి కుమార్ చేపూరి కౌశలాన్ని తెలుగు సాహితీ లోకం వేనోళ్లా కొనియాడుతోంది.
"తానా ప్రపంచ సాహిత్య వేదిక "
( ప్రతి నెలా ఆఖరి ఆదివారం - అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం )
35వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం
( ఏప్రిల్ 22, 23, 2022, శుక్రవారం, శనివారం, భారతకాలమానం: 7:30 pm - అమెరికా: 7 am PST; 9am CST; 10 am EST;
ఏప్రిల్ 24, 2022, ఆదివారం, భారతకాలమానం: 8:30 pm - అమెరికా: 8 am PST; 10 am CST; 11 am EST;)
“కవితాలహరి”
అందరికీ ఆహ్వానం.
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
1. TANA TV Channel – in YuppTV
2. Facebook: https://www.facebook.com/TANAsocial
3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
4. https://youtube.com/teluguone
5. www.youtube.com/tvasiatelugu
6. www.youtube.com/manatv
7. https://www.etvbharat.com/telugu/andhra-pradesh
8. https://www.etvbharat.com/telugu/telangana
మిగిలిన వివరాలకు: www.tana.org
Comments
Post a Comment
Your Comments Please: