నటనం, నాట్యం... కళారూపం ఏదైనా దానికి ప్రేరణ మాత్రం కవిత్వమే. కవి హృదయం ఆవిష్కరించిన పొందికైన మాటలే కళాకారులు కట్టిన గజ్జెలకు ప్రాణం పోస్తాయి. నాట్యగత్తెలకు ప్రేరణనిస్తాయి. అలాంటి కవిత్వానికి పెద్దపీట వేసే ఉద్దేశంతో, కవులను సన్మానించుకునే సంకల్పంతో చిదంబర నటరాజ కళానిలయం వ్యవస్థాపకురాలు, నృత్యగురువు మంజుల ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖ కవులకు, ప్రముఖులైన కవితాభిమానులకు శాలువాలు కప్పి సన్మానించి తన కవిత్వ సేవను చాటుకున్నారు. చిదంబర నటరాజ కళానిలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు కవులు, సామాజిక కార్యకర్తలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, ప్రముఖ సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ నటుడు సమీర్, నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ (రిటైర్డ్) డాక్టర్ రామకృష్ణ, బి.కేశవులు, మురహరి, విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు చేపూరి లక్ష్మణాచారి, కేశంపేటకు చెందిన ఎం.సతీశ్ హాజరయ్యారు. ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రముఖ సామాజిక కార్యకర్త కొడిచర్ల రమేశ్ ఎంతో సహకరించారని మంజుల ప్రత్యేకంగా కొనియాడారు.
ఈ సదర్భంగా వేటూరి కలం - బాలు గళం పేరుతో స్వర సంగమం నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
Comments
Post a Comment
Your Comments Please: