పోలీసు విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా, బాధ్యతగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న ఎస్.రాజ్ కుమార్ ను స్టేట్ పోలీస్ సేవా పతకం వరించింది. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ పోలీస్ సేవా పతకానికి ఎంపికయ్యారు. జూన్ 2, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా పతకాన్ని, ప్రశంసలను అందుకున్నారు.
రాజ్ కుమార్ రక్షకభటుడిగా చేరినప్పటి నుంచీ వృత్తికే మొదటి ప్రాధాన్యతనిస్తూ పైఅధికారుల ఆదేశాలు పాటిస్తూ.. ప్రజల అవసరాలు గుర్తిస్తూ మెలగుతున్నారు. జమ్మికుంట, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్, ఎల్.ఎం.డి కాలనీ.. ఇలా తాను ఎక్కడ విధులు నిర్వహించినా.. స్థానిక ప్రజల మన్ననలు పొందుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ప్రజాసంబంధాలు పటిష్టంగా కొనసాగిస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవా నిరతిని, బాధ్యతల పట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు.. రాజ్ కుమార్ ను సేవా పతకానికి ఎంపిక చేశారు. విధి నిర్వహణలో తన అంకిత భావాన్ని గుర్తించిన అధికారులందరికీ రాజ్ కుమార్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన కొలీగ్స్, సీనియర్స్, మెంటార్స్ అందరికీ పేరుపేరునా రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ని బంధువులు, మిత్రులు అభినందించారు. వృత్తినే దైవంగా భావించినవారికి గుర్తింపు మాత్రమే కాదు.. ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రోత్సహించారు.
Comments
Post a Comment
Your Comments Please: