ఢిల్లీలో రెండేళ్లుగా అక్రమంగా ఉంటున్న ఓ చైనీయుడి ఉదంతం వెలుగుచూసింది. జు-ఫీ అనే చైనా దేశీయుడు రెండేళ్లుగా గ్రేటర్ నోయిడాలో అత్యంత విలాసవంతమైన ఓ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారుల కళ్లు కప్పి నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఓ ఐపీఎస్ అధికారి అనుమానంతో దాని మీద అధికారులు రైడ్ చేయడంతో విషయం వెలుగుచూసింది. జు-ఫీతో పాటు నాగాలాండ్ కు చెందిన పెటిఖ్రినో అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో ముగ్గురు ఇండియన్స్, ఒక చైనీయుడు తప్పించుకొని పారిపోయారు. క్లబ్బులో 70 రూములు, అత్యాధునిక సీసీటీవీలు అమర్చారు. ఫేక్ వీసా డాక్యుమెంట్లతో జు-ఫీ ఇక్కడే తిష్టవేసి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సైన్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి దేశ రహస్యాలు సేకరించే పనిలో జు-ఫీ ఉన్నాడన్న అనుమానాలతో విచారిస్తున్నారు. అయితే మూడు రోజులుగా విచారణ సాగుతున్నా జు-ఫీ నోరు విప్పడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఇప్పటికే విలువైన సమాచారం చేరవేసి ఉంటాడని భావిస్తున్నారు. చైనా నుంచి ఇండియాకు, ఇండియా నుంచి చైనాకు రావాలంటే.. కేవలం 20 వేలు ఖర్చు చేస్తే సరిపోతుందని జు-ఫీ చెప్పినట్లు విచారణాధికారులు అంటున్నారు.
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు. కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...
Comments
Post a Comment
Your Comments Please: