Skip to main content

కవిసార్వభౌముడు కలలో కనిపించి...

సహధర్మచారిణి గంగాదేవితో నాగేశ్వరరావుగారు

చరిత్ర అనేది మంచి-చెడుల సమ్మిశ్రమం. మంచి చేసినవారిని అనుసరించాలని పాజిటివ్ థింకర్స్ చెప్తే... చెడు చేసినవారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని, వాళ్లు ఈ భూమ్మీద ఉండటానికి అర్హులు కారని అందుకు విరుద్ధమైన వర్గమంతా చెప్తుంది. ప్రపంచమంతా ఈ రెండు మార్గాల్లోనే ప్రయణిస్తోంది. అయితే ఆ రెండు మార్గాలు  సర్వకాలాల్లోనూ పరిపూర్ణమైనవి కాకపోవచ్చు. ఎందుకంటే వాటిలో ఎవరి ఆచరణ మార్గం వారిదే. ఒకరితో ఒకరికి పని ఉండదు. ఎవరి ఫాలోయర్లను వారు తయారు చేసుకుంటారు.  ఎవరి శిబిరాన్ని వారు పోటాపోటీగా భర్తీ చేసుకుంటారు. దీనివల్ల సమాజం "వర్గ విభజన"కు గురవుతుందే తప్ప.. సామాజిక సమరసతకు అవకాశం ఉండదు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలు మంచి, చెడుల గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. మరి అది ఎలా సాధ్యం? అది జరగాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే పరిష్కారం. అదేంటంటే.. అందరికీ అన్నీ తెలియజేయడమే. 

Also Read: భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

ఎవరు ఏ మంచి చేశారో ప్రజలకు తెలియాలి? ఎవరి ద్వారా చెడు జరిగిందో కూడా ప్రజలకు తెలియాలి. నిజానికి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. తమ పూర్వీకులు ఫలానా మంచి చేశారు అని తెలుసుకోవడం ఎంత అవసరమో.. తమ పూర్వీకుల్లో ఫలానా వారి ద్వారా ఫలానా చెడు జరిగిందన్నది తెలుసుకోవడం కూడా ఈ సమాజానికి అంతే అవసరం. ఈ సూత్రాన్ని బాగా నమ్మినవారు మహామహోపాధ్యాయ రాష్ట్రపతి సన్మాన విభూషిత బ్రహ్మశ్రీ పెదపాటి నాగేశ్వరరావుగారు. 

పుణ్యదంపతులు సూర్యనారాయణ-లక్ష్మీకాంతమ్మ

చరిత్రలో ఏం జరిగిందో వివరించే బాధ్యతాయుతమైన బరువును స్వచ్ఛందంగా మోయడానికి ముందుకొచ్చారు పెదపాటి. అందుకు తనకు ఇష్టమైన సాహితీ రంగాన్ని ఎంచుకున్నారు. వందకు పైగా పుస్తకాలు ప్రచురించారు. ఒక్కో రచనలో ఒక్కో ఇతివృత్తాన్ని స్పృశించారు. చరిత్రలో చోటు చేసుకున్న అనేక చీకటి కోణాల్ని కూడా తన రచనా ప్రక్రియ ద్వారా గ్రంథస్తం చేసి పెట్టారు. భావి తరాలు చదువుకొని అవగాహనతో మసలుకోవాలనేది ఆయన ఆకాంక్ష. ఆయన రచనలు కట్టలు తెగే ఆవేశాన్ని కలిగించవు. రెచ్చగొట్టి దారితప్పేలా చేయవు. జస్ట్ అవగాహన కల్పిస్తాయి అంతే. అప్రమత్తంగా ఉండమని చెప్తాయి. కళ్లు తెరచి మసలుకొమ్మని తట్టి  లేపుతాయి. పాపులారిటీ కొలబద్దలకు అందని అద్వితీయమైన, అలౌకికమైన ఆధ్యాత్మిక విజ్ఞాన పరిమళాలు మొదలుకొని ఆధునిక చరిత్ర పుటల్లో ఎక్కడా చోటు దక్కని సామాజిక అన్యాయాన్ని కూడా ఆయన రచనలు మన కళ్లముందు పరుస్తాయి. ప్రశ్నిస్తారో, మౌనమునిలా ఆచరిస్తూ సాగిపోతారో తేల్చుకోవడం పాఠకుల వంతే. 
సాహిత్యంలో మనుచరిత్ర - ఒక తులనాత్మక అధ్యయనం, వసుచరిత్ర-సంస్కృత గ్రంథం, నైషధం విద్వదౌషధం, ఆముక్తమాల్యద, శ్రీనాథుని పంచప్రాణాలు, డాంటే మిల్టన్ శ్రీనాథులు... ఇలాంటివన్నీ మనం చదువుకున్న చరిత్రకు ఆవల మనకు తెలియని కోణాలను గురించి ఆసక్తికరంగా వివరిస్తాయి. శ్రీశైల గద్యం, శ్రీ లక్ష్మీ నరసింహ సుప్రభాతం, కాళీ సుప్రభాతం, భద్రాచల రామ సుప్రభాతం, విశ్వకర్మ సుప్రభాతం, వీరబ్రహ్మ సహస్ర నామ స్తోత్రం, తుకారాం పంచాక్షరి, జేజినాయన జాజిమల్లెలు, శ్రీ విశ్వకర్మ పురాణం.. వంటివాటిని కవితారూపకంగానూ అందించారు. 


వ్యక్తిగతం: పెదపాటి నాగేశ్వరరావు గుంటూరు జిల్లావాసి. జులై 1, 1941లో జన్మించారు. తండ్రి సూర్యనారాయణ,  తల్లి లక్ష్మీకాంతమ్మ. తండ్రి వృత్తిరీత్యా స్వర్ణశిల్పి. బంగారు ఆభరణాల తయారీలో ఆయన సిద్ధహస్తులు. కాబట్టి సహజంగానే శిల్పాకృతులు  మలచడంపై  చిన్నప్పుడే నాగేశ్వరరావుకు దృష్టి మరలింది. హైస్కూలు విద్యాభ్యాసం చిలకలూరిపేట, ఇంటర్ గుంటూరు, డిగ్రీ చీరాలలో జరిగాయి. పూనా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. హెదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో పి.హెచ్.డి చేశారు. ఆనాటి ఎండోమెంట్ డిపార్టుమెంట్ లో శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు. శిల్పశాస్త్రంలో తెలుగు యూనివర్సిిటీ నుంచి పి.హెచ్.డి. అందుకున్నారు. ఎండోమెంట్ డిపార్టుమెంట్ నుంచి 1999లో అసిస్టెంట్ స్థపతిగా రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచే తనకు ఇష్టమైన శిల్పకళలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించారు. అనేక దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్టించారు. తన ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న దేవాలయాలు, అందులోని విగ్రహాలకు స్వయంగా ప్రాణప్రతిష్ట చేశారు. పెదపాటి ప్రారంభించిన అనేక దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయంటే అతిశయోక్తి కాదు. అందుక్కారణం ఆయనలోని శిల్పకళా సౌజన్యమే. 

భాషా పాటవం, విద్యాసేవ: తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, మరాఠీల్లో పలు గ్రంథాలు రాశారు. మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ జీవిత చరిత్రను ప్రజలకు అందించారు. ముగ్గురు రాష్ట్రపతుల చేత సన్మానం అందుకున్నారు. 1965లో బి.డి.జెట్టి, 1985లో జైల్ సింగ్, ఆ తరువాత శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా 3 సార్లు సన్మానాలు అందుకున్నారు. వారికున్న అద్భుతమైన విద్వత్తు, సాహితీసేవ, శిల్పకళా సేవలే రాష్ట్రపతుల చేత సన్మానం అందుకునేలా చేశాయి. అంతేకాదు.. ముగ్గురు గవర్నర్లు, ముగ్గురు చీఫ్ మినిస్టర్ల  చేతులమీదుగా కూడా సన్మానాలు అందుకున్నారు. విద్యార్థుల్ని కల్చరల్  టూర్ కోసం నార్త్ ఇడియా కు తీసుకెళ్లి డిఫెన్స్ ఎకాడమీ, ఇంజినీరింగ్ యూనివర్సిటీల్లో అనేక విభాగాలు చూపించి అవగాహన కల్పించారు. ఉజ్జయినిలో జరిగిన అఖిల భారత విశ్వసంస్కృతం సభలకూ వారిని తీసుకెళ్లారు. తరగతి గదుల్లో బోధించడం కన్నా.. ఇలా టూర్ల ద్వారా ఆర్జించిన విద్యే విద్యార్థుల్ని ప్రయోజకుల్ని చేస్తుందని పెదపాటి నమ్ముతారు. పూనాలో పండిత పరిషత్ జరిగినప్పుడు.. తనలోని పాండితీ ప్రకర్షను చూసి పండిత పద్మాకరశాస్త్రిగారు.. ఎంతో ఆనందానుభూతుడై మహా మహోపాధ్యాయ రాష్ట్రపతి సన్మాన విభూషిత అంటూ బిరుద ప్రదానం చేశారని ఆనాటి తీపిగుర్తులు గుర్తు చేసుకుంటారు. 

కందిమల్లాయపల్లె లోని శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి 2010 నంచి ఆస్థాన పండితుడుగా కొనసాగుతున్నారు. 2002లో షష్టిపూర్తి జరిగినప్పుడు తన శిష్యబృందం కనకాభిషేకం చేసి గండపెండేరం తొడగడం తన జీవితంలో అపూరుపమైన జ్ఞాపకంగా చెబుతారు. 

ఆయనకు అత్యంత ఆత్మ సంతృప్తినిచ్చిన రచన శ్రీనాథుని పంచ ప్రాణములు. ఎందుకంటే శ్రీనాథ కవిసార్వభౌముడు కలలో కనిపించి తనకు పద్యాలు చెప్పాడని.. ఆయన చెప్పిన పద్యాలను, వాటి స్ఫూర్తితో మరికొన్నింటిని ఓ గ్రంథంగా అమర్చానని ఉద్విగ్నంగా చెప్పుకుంటారు. కలలో కనిపించిన శ్రీనాథుడు తనను లేపడం, పద్యాలు చెప్పడం, తద్వారా.. ఆనాడు శ్రీనాథుడు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు చిరస్థాయిగా ప్రపంచానికి తెలిసేలా చేసే అవకాశం చిక్కడాన్ని ఎంతో అద్భుతంగా ఇప్పటికీ ఫీలవుతానని పెదపాటి గుర్తు చేసుకుంటారు. ఆనాటి సంప్రదాయ బ్రాహ్మణ సమాజం కుట్రలను శ్రీనాథుడు ఎలా ఎదుర్కొన్నదీ, ఎన్ని అవమానాలు పడ్డదీ చూచాయగా చెబుతారు ఆ గ్రంథంలో అందుకే ఆ గ్రంథ రచనకు విశేషంగా ఫీలయ్యానంటారు. మద్రాసు యూనివర్సిటీ ప్రొఫెసర్ నిడదవోలు వెంకట్రావు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారట. ఆయన ప్రశంసలు తనకిప్పటికీ చెవుల్లో రింగుమంటాయంటారు. 

పెదపాటి నాగేశ్వరరావు జులై 10వ తేదీ, 2022న చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సహస్ర పూర్ణచంద్ర దర్శనయుక్త శతాభిషేక మహోత్సవం జరుపుకుంటున్నారు. సాహితీ సేవలో తరించిపోయిన ఈ విద్వత్సంపన్నుడి కృషి ఎందరికో స్ఫూర్తి నింపుతుందని ఆశిద్దాం. 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...