తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజకీయ నాయకురాలు రాములమ్మ అలియాస్ విజయశాంతి. అయితే రాములమ్మ ఈ మధ్య కాస్త వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆమె తెలంగాణ కాంగ్రెస్ ను వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరినా.. నిరాశే మిగులుతుందన్న చర్చ సాగుతోంది. హస్తం పార్టీలో ప్రచారకమిటీ చైర్ పర్సన్ పదవిని వదులుకున్న విజయశాంతి.. కమల దళంలో తనకంతా పాతమిత్రులే కదా.. తగిన ప్రాధాన్యమిస్తారని కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె పార్టీలో చేరి దాదాపు రెండేళ్లవుతున్నా.. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత గల పదవులూ రాకపోవడంతో ఆమె అనుచరులు, అభిమానులు రాములమ్మ నిరాశలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారట. ఆమె పార్టీలో చేరిన ఆరునెలల్లో.. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పదవి కేటాయించి ఢిల్లీ పెద్దలంతా ఇక సైలెంటయ్యారన్న చర్చ పార్టీలో సాగుతోంది.
Also Read: కాంగ్రెస్లో పసలేని దావత్లు
Also Read: కేసీఆర్ను ఓడించే భారీ స్కెచ్ రెడీ
Also Read: విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న టీ-సర్కారు
వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయశాంతి యాక్టివ్ గా పనిచేశారు. ఆ తరువాత అనేక కారణలతో ఆమె పార్టీ మారారు. తరువాత పాత పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో.. మళ్లీ తన రాజకీయ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకొని తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ఆమె రెండోసారి బీజేపీలో చేరిన నాటి నుంచే రాజ్యసభపై భారీ ఆశలు పెట్టుకున్నారట. ఇటీవల రాజ్యసభ సీట్ల కేటాయింపులో చివరివరకు విజయశాంతి పేరు వినిపించినా బీసీ కోటాలో.. డాక్టర్ లక్ష్మణ్ కు పార్టీ పెద్దలు అవకాశం కల్పించారు. దీంతో ఆమె నిరాశ చెందినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. రాజ్యసభ కాకపోయినా.. గతంలో జాతీయ మహిళా మోర్చా హోదాలో కీలకపదవి నిర్వహించినట్టు.. అలా జాతీయ కమిటీలో ఏదైనా మంచి పదవి కేటాయిస్తారని, అది కూడా కేంద్రమంత్రి హెదాలో ఏదో ఒక పదవి ఇస్తారని చాలామంది పార్టీలో చెప్పుకున్నారు కూడా. అయితే పార్టీలో చేరి రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా.. ఆమెకు ఎలాంటి పదవులూ తలుపు తట్టకపోవడంతో రాములమ్మ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోడీ లాంటి కీలక నేతలు పరిచయం ఉన్నా రామలమ్మకు... పదవులు రాకపోవడం సొంతపార్టీలోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చర్చ సాగుతోంది.
కొండంత ఆశలు పెట్టుకొని.. జాతీయపార్టీలో కీలక పదవి కోసం బీజేపీ గూటికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ లో మాదిరిగానే అవమానాలే ఎదురవుతున్నాయనే భావనలో విజయశాంతి ఉన్నారట. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం తప్ప.. పార్టీలో పదవులు ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ నడుస్తుండడంతో... మరి.. రాములమ్మకు కమలం పార్టీలో కీలక పదవి వస్తుందా, రాదా.. వస్తే ఎప్పుడొస్తుంది.. ఎలాంటి పదవి వస్తుందన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Comments
Post a Comment
Your Comments Please: