కమలనాథుల వ్యూహం తెలంగాణ బీజేపీ కేడర్లోనే గాక, ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం నింపేలా కనిపిస్తోంది. కేసీఆర్ చేతిలో దెబ్బ తిన్న పులిలా ఉన్న ఈటల చేతనే.. అదే కేసీఆర్ కు చుక్కలు చూపించాలని అమిత్ షా వ్యూహం పన్నారు. షా వ్యూహం పాసవుతుందా.. ఫెయిలవుతుందా అన్నది కాస్త పక్కనపెడితే.. ఈటల ప్రకటనల వెనుక భారీ పరమార్థమే దాగున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇంతకీ అమిత్ షా-ఈటల ఏం మాట్లాడుకున్నారు? ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు? వారి వ్యూహంతో కేసీఆర్ నిజంగానే ఉలిక్కిపడతారా.. అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తారని పేరున్న గులాబీ బాసుకు కూడా వణుకు పుట్టించే విధంగా పథకరచన చేస్తోంది కమలం క్యాంపు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హుజూరాబాద్ లో సంచలన విజయం నమోదు చేసి దేశవ్యాప్త రాజకీయ నేతల దృష్టిని తనవైపు మరల్చిన మాజీ మంత్రి ఈటల.. వచ్చే ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసిఆర్ ను ఢీకొట్టడానికే సిద్ధమవుతున్నారు. కేసిఆర్ పై గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటించడం అందుకే సంచలనంగా మారింది. అంతేకాదు.. అసలు తాను... BJP లో చేరిందే గజ్వేల్లో పోటీ చేయడానికంటూ మరో అడుగు ముందుకేసి సమరనాదం చేశారు ఈటల. కేసీఆరే టార్గెట్‌గానే గజ్వేల్లో పని మొదలు పెట్టినట్లు సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నారట ఈటల. ఈ విషయంలో బెంగాల్లో సువేందు అధికారి తరహాలో.. ఇక్కడ కేసీఆర్ ను ఓడించి తీరుతామని ఈటల ధీమాగా ఉన్నారట.
Also Read: భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?
ఇక ఈటల ప్రకటన వెనుక బీజేపీ అధిష్టానం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకే.. ఈటలకు పూర్తి వ్యూహం చెప్పి, ఒప్పించి ఈటలను రంగంలో దించినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు మౌనంగా ఉన్న ఈటల... ఒక్కసారిగా వాయిస్ పెంచడం, కేసిఆర్ టార్గెట్ అనే విధంగా ప్రకటనలు చేస్తుండడంతో ఆయన వెనుక షా వ్యూహం కచ్చితంగా ఉంటుందన్న చర్చ రాజకీయ పార్టీల్లో సాగుతోంది. ఇటీవల ఈటల అమిత్ షాతో దాదాపు గంటసేపు ప్రత్యేకంగా భేటీ అయి.. పూర్తి అంశాలు చర్చించినట్లుగా చెప్పుకుంటన్నారు. అందుకే.. ఈటల తాను సీయం నియోజకవర్గం గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారని చెప్పుకుంటున్నారు. పశ్చిమబెంగాల్ లో టీఎంసీ వర్సెస్ బీజేపీ ఎన్నికలు ఏ లెవల్లో ఉత్కంఠగా జరిగాయో.. రేపు తెలంగాణలోనూ అదేవిధంగా జరుగుతాయని ఈటల ధీమాగా ఉన్నారట. ఈటల-షా భేటీలో.. బీజేపీ హైకమాండ్ వ్యూహం పర్ఫెక్ట్ గా రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ను ఓడగొట్టే విధంగా షా... వ్యూహం రచించారని, ఆ ఆత్మవిశ్వాసం మేరకే ఈటల రాజేందర్... హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కేసీఆర్ ను చికాకుపరచేలా భవిష్యత్తులో గజ్వేల్ నుంచే చేరికలు ఉంటాయని కూడా ఈటల చెప్పడం చూస్తే.. ప్లాన్ అంతా రెడీ అయిందని, ఇక అమలు చేయడమే తరువాయిగా మిగిలిందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు.
మరి ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో.. గజ్వేల్ నే ఎంచుకుంటే.. కేసీఆర్ ఏం చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కేసీఆర్ గజ్వేల్ నుంచి మరో చోటికి మారేలా.. టీఆర్ఎస్ కేడర్ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ తీసేలా బీజేపీ నేతలు వ్యూహం పన్నారా? లేక సీఎం నియోజకవర్గంవర్గంలో ప్రాజెక్టులపై వ్యతిరేకత రావడం వల్లే కేసీఆర్ పై గెలవడం ఈజీ అవుతుందని ఈటల భావిస్తున్నారా? అదీకాకపోతే కేవలం బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా వ్యూహ రచనలో భాగంగానే ఈటల ఈ ప్రకటన చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి షా టార్గెట్ ఏవిధంగా ఉంటుందీ.. ఈటల ఏ విధంగా అమలు చేస్తారన్నది వేచి చూడాల్సిందే.
కెసిఆర్, కేటీఆర్ గారి తలపోగరు మాటలకు ప్రజలు బుద్ధి చెప్పే
ReplyDeleteరోజు దగ్గరలోనే ఉంది.. భాహుషా అమిత్ షా గారి ప్యుహం ఫలించ వచ్చు..
ReplyDelete