Skip to main content

Posts

Showing posts from August, 2022

చేతులు కడిగారా? చేతులు కలిపారా?

ఊరక రారు మహానుభావులన్నట్లు ఢిల్లీ నుండి ఓ పెద్దాయన వచ్చాడు. చాలా పెద్ద రాచకార్యానికి వచ్చిన ఆ పెద్దాయన.. జూనియర్ ను పిలిపించుకొని ముచ్చటించాడు. పెద్దవాళ్లు పెద్దపెద్ద టాపిక్‎లు మాట్లాడుకోవాలి గానీ.. కుర్రాళ్లతో మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయబ్బా.. అని గల్లీ లెవల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అసలే ఆ పెద్దాయనకు అగ్గిపుల్ల స్వామి అనే పేరొకటి ఉంది. మరి అలాంటప్పుడు కాక మీదున్న కుర్రాణ్ని అగ్గిపుల్ల స్వామి కలిస్తే.. అగ్గి రాజుకోకుండా ఎలా ఉంటుంది?  Also Read:  పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా? Also Read:  వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి కేంద్రహోంమంత్రి అమిత్ షా.. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల భేటీపై తెలుగు రాజకీయాల్లో రేగిన చర్చ రచ్చ రచ్చ అవుతోంది. ఈ మీటింగ్ పై ఎవరికి తోచినవిధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అబ్బురపడి ఆయన్ని పిలిపించుకుని అమిత్ షా శెభాష్ అంటూ కితాబిచ్చారని పైకి చెబుతున్న మాటలు.. కామెడీగా తేలిపోతున్నాయి. అదే నిజమైతే మరి రామ్‎చరణ్ ను, సినిమా దర్శకుడు రాజమౌళిని ఎందుకు పిలవలేదన్న ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం దొరకటం లేదట. ఏ...

పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

జూనియర్ ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షా భేటీ రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తి రేపుతోంది. వారేం మాట్లాడుకున్నారన్నది బయటకు పొక్కకపోయినా.. కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యమైన అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడనే పేరున్న అమిత్ షా.. తన విలువైన సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది.  బీజేపీ టాప్ లీడర్, టాప్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా.. నోవోటెల్ హోటల్లో ప్రముఖ తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ గెలుపు కోసం, దగ్గరి బంధువైన చంద్రబాబు కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీతో పాటు చంద్రబాబునాయుడుతో కూడా ఆయన ఎడం పాటిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టాకే.. పవన్ కల్యాణ్ తో చెట్టపట్టాలు వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటూ.. రాజకీయాల్లో పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్న ఎన్టీఆర్.. అమిత్ షా ను కలవడం ఏపీ రాజకీయాల్లో దుమారం ...

లేటు వయసులో రతన్ టాటా కొత్త ప్రాజెక్టు

లాభాపేక్షతో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరో కొత్త కాన్సెప్టును అనౌన్స్ చేశారు. ఒంటరిగా బతుకులు వెళ్లదిస్తూ.. తమకోసం ఎవరూ లేక, తాము ఎవరికీ పట్టక తమలో తామే కుమిలిపోయే సీనియర్ సిటిజన్ల కోసం ఓ స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. గుడ్ ఫెలోస్ పేరుతో ఈ స్టార్టప్ సంస్థ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది. ముంబైలో పైలట్ ప్రాజెక్టు మాదిరిగా 20 మంది వృద్ధులకు సపర్యలు చేస్తూ.. వారికి శేష జీవితం ఎంతో ఆనందంగా సాగేలా ప్రాజెక్టు పనిచేస్తోంది. తదుపరి ఫేజ్ లో పుణే, చెన్నై, బెంగళూరుల్లో సేవలు ప్రారంభిస్తామన్నారు రతన్. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా వృద్ధుల కోసం పని చేసే యువకుల్ని తీసుకుంటారు. వారితో ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ పాడుతూ.. మెరుగైన సమయం కేటాయించడం ఈ వర్క్ లో ముఖ్యోద్దేశం. క్యారమ్స్, చెస్ లాంటి ఇన్-హౌజ్ గేమ్స్ ఆడించడం, అవసరమైతే సీనియర్ సిటిజన్ల పక్కనే నిద్రించడం చేయాల్సి ఉంటుంది. ఈ స్టార్టప్ కోసం రతన్ టాటా పెద్దమొత్తంలోనే పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఎంతమొత్తం పెడుతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆలనాపాలనాకు నోచుకోని వీధికుక్కల పట్ల కూడా రతన్ టాటా ఎంతో శ్రద్ధ చూపిస...

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే...

ఉర్రూతలూగించే ఉయ్యాలవాడ వీరగాథ (సచిత్రంగా)

భార‌త స్వ‌ాతంత్ర్య పోరాట‌ తొలి గ‌ర్జ‌న ఆయన‌ది. సీమ పౌరుషానికి ప్ర‌తీక ఆయ‌న‌. ఆయ‌న పేరు చెబితే ఇంకా మీసం మొలవని కిశోరాలు కూడా మూతి మీద చెయ్యేసుకుని పొంగిపోతారంటే అతిశయోక్తి కాదు. ఆయనే.. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటిష్ సామ్రాజ్య‌పు కోట‌ల‌కు బీట‌లు పెట్టిన సీమ సింహం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. అద్భుతమైన ఆయన పోరాటానికి చ‌రిత్ర‌లో ప్రముఖ స్థానం దక్కకపోవచ్చు గానీ.. రాయల‌సీమ గ్రామాల్లో ఆయ‌న కీర్తి అజ‌రామ‌రం. ఆజాదీ అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆ వీరుడి వీర‌గాథ ప్రస్తుత కాలానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి Also Read:  భారతీయుడి శౌర్య ప్రతాపం మహారాణా ఉయ్యాలవాడ పేరు చెబితేనే నరనరానా ఉద్యమ స్ఫూర్తి రగులుతుందంటారు రాయలసీమ ప్రజలు. ఆయన పోరాట పటిమ, పౌరుష పరాక్రమాల గురించి స్థానిక భాషలో పాటలు కట్టి పాడుకుంటారు. ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనంపై పాటలు వినిపిస్తుంటాయి. భ‌ర‌త‌మాత దాస్య‌శృంఖ‌ల విముక్తి కోసం తెల్ల దొర‌ల‌పై తెగ‌బ‌డిన ఖ‌డ్గం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. తెల్ల‌టి గుర్రం.. చేతిలో నాట్య‌మాడే క‌త్తి.. పౌరుషానికి ప్ర‌తీక‌గా మెలితిరిగిన మీసం.. సీమ‌ల...