లాభాపేక్షతో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరో కొత్త కాన్సెప్టును అనౌన్స్ చేశారు. ఒంటరిగా బతుకులు వెళ్లదిస్తూ.. తమకోసం ఎవరూ లేక, తాము ఎవరికీ పట్టక తమలో తామే కుమిలిపోయే సీనియర్ సిటిజన్ల కోసం ఓ స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. గుడ్ ఫెలోస్ పేరుతో ఈ స్టార్టప్ సంస్థ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది. ముంబైలో పైలట్ ప్రాజెక్టు మాదిరిగా 20 మంది వృద్ధులకు సపర్యలు చేస్తూ.. వారికి శేష జీవితం ఎంతో ఆనందంగా సాగేలా ప్రాజెక్టు పనిచేస్తోంది. తదుపరి ఫేజ్ లో పుణే, చెన్నై, బెంగళూరుల్లో సేవలు ప్రారంభిస్తామన్నారు రతన్. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా వృద్ధుల కోసం పని చేసే యువకుల్ని తీసుకుంటారు. వారితో ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ పాడుతూ.. మెరుగైన సమయం కేటాయించడం ఈ వర్క్ లో ముఖ్యోద్దేశం. క్యారమ్స్, చెస్ లాంటి ఇన్-హౌజ్ గేమ్స్ ఆడించడం, అవసరమైతే సీనియర్ సిటిజన్ల పక్కనే నిద్రించడం చేయాల్సి ఉంటుంది. ఈ స్టార్టప్ కోసం రతన్ టాటా పెద్దమొత్తంలోనే పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఎంతమొత్తం పెడుతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆలనాపాలనాకు నోచుకోని వీధికుక్కల పట్ల కూడా రతన్ టాటా ఎంతో శ్రద్ధ చూపిస్తారు. తాజాగా ఆసరా లేని వృద్ధుల కోసం తన మదిలో మెదుల్తున్న ఆలోచనల్ని ఎంతో జాగ్రత్తగా పట్టాలమీదికి ఎక్కిస్తున్నారు రతన్‌టాటా. గుడ్ ఫెలోస్ ను శంతను నాయుడు ప్రారంభించారు. శంతనునాయుడు టాటా ఆఫీసులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 2018 నుంచి శంతనునాయుడు.. రతన్ కు సహాయకుడిగా ఉన్నారు. శంతను ఐడియాలజీ, కమిట్మెంట్ వంటి అంశాలతో తాదాత్మ్యం చెందిన రతన్.. తనలాగే ఒంటరి వృద్ధుల ఆనందం కోసం ఏదైనా చేయాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇక గుడ్ ఫెలోస్ పనితీరు గురించి పూర్తిగా తెలియాలంటే ఇంకొద్ది కాలం వేచి ఉండాల్సిందే.
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు. కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...
Comments
Post a Comment
Your Comments Please: