Skip to main content

Posts

Showing posts from September, 2022

పేరుకు తగినట్టుగానే ఆయన రారాజు-చిరంజీవి

తెలుగు చిత్రసీమలో మరో పాతతరపు ధ్రువతార నింగికేగింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటుడిగా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న కృష్ణంరాజు.. అటు రాజకీయాల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలనే తహతహ ఆయనకు ఉన్నా.. అందుకు తగిన సహకారం దొరకలేదనే అసంతృప్తికి లోనైనట్టు చెబుతారు. ఏ పార్టీలో ఉన్నామన్నది కాకుండా.. ఏం చేశామన్నదే ఆయన ఫిలాసఫీగా ఉండేదని.. అయితే రాజకీయాల్లో ఉండే అనేక రకాల ఒత్తిళ్లు, పరిమితుల కారణంగా.. ఏ పార్టీలో కూడా కృష్ణంరాజు పూర్తిగా ఒదిగి ఉండలేకపోయారన్న అభిప్రాయాలున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రేక్షకులకు తన విలక్షణమైన నటనను అపురూపమైన జ్ఞాపకంగా అందించారు కృష్ణంరాజు. 1940 జనవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు పూర్తి పేరు.. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు ప్రేక్షకులకు ఓ భారీ నట విగ్రహంగా మాత్రమే తెలిసిన కృష్ణంరాజులో బహుముఖీనమైన అభిరుచులు, ఆకాంక్షలు ఉన్నాయి. సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో అనేక పాత్రలను ఎంతో విజయవంతంగా పోషించినట్టు ఆయన సినీ ప్రస్థానం చెబుతుంది. తెలుగునేలపై స్వేచ్ఛా పోరాటాల సమయంలో తనదైన మ...

భారతదేశం పాములకు పాలు పోస్తోందా?

ఆఫ్ఘనిస్థాన్ మనకు శత్రు దేశమా.. మిత్రదేశమా? మిత్రదేశం అనడానికి ఎలాంటి బలమైన ఆధారాలూ లేవు. శత్రుదేశంగా పరిగణించడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. మరి ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండానే.. భారత్ పెద్దమొత్తంలో తిండిగింజలు, మెడిసిన్స్‎ను ఎందుకు పంపుతోంది? కనీసం అక్కడి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇప్పటివరకూ గుర్తించని భారత్.. భారతీయులు కూడా ప్రశ్నించేలా ఆ దేశానికి అంతపెద్ద మొత్తంలో ఆపన్నహస్తం ఎందుకు అందిస్తోంది?  యుగయుగాలుగా భారతీయులు చూపిస్తూ వస్తున్న ఔదార్యం ముందు ప్రపంచంలోని ఏ దేశమైనా దిగదుడుపేనంటారు. గతేడాది ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు కబ్జా చేసుకొని, అధికారం చేపట్టినప్పుడు ప్రపంచమంతా వణికిపోయింది. ముఖ్యంగా భారత ప్రభుత్వం తాలిబాన్ల కదలికల్ని నిశితంగా గమనిస్తూ అడుగులు వేస్తోంది. అమెరికా వెన్నుదన్నుతో కర్జాయ్ పరిపాలించినప్పుడు వెల్లివిరిసిన స్నేహ సంబంధాలు ఒక్కసారిగా అదృశ్యమైపోయి... తాలిబన్ల రాకతో మన దాపునే రాక్షస రాజ్యం పురుడుపోసుకున్నట్లయింది. అయితే తాలిబాన్ల వ్యవహార శైలి, పాలనలో షరియాను పక్కాగా అమలు చేయడం, మహిళలతో అనుసరించే విధానం వంటి అనేక కారణాలతో జనజీవనం స్తంభించింది. ప్రజల్లో భయాందోళనలు ...

విలీనమా? విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా?

తెలంగాణలో రసవత్తరమైన రాజకీయ అంకానికి తెర లేచింది. భారత ఉపఖండంలో తెలంగాణ విలీనాంశం అనేది ఓ కీలకమైన ఘట్టం. అయితే ఆ ఘట్టాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కొన్ని పక్షాలు ప్రయత్నిస్తుండగా.. అదే ఘట్టాన్ని ఆసరా చేసుకొని తమ రాజకీయ అవసరాలు తీర్చుకున్న పక్షాలు కూడా ఉన్నాయి. తెలంగాణ విలీనంతో కొన్ని వర్గాలు తమ ఉనికి కోల్పోతామని ఆందోళన చెందితే.. మరికొన్ని వర్గాలేమో సెంటిమెంట్లు గాయపడే అంశంగా పరిమితం చేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణలో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ నేతగా అనేక వేదికల మీద చెప్పిన కేసీఆర్.. తన మాట నిలుపుకోవడం లేదంటూ... బీజేపీ కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తామని డిక్లేర్ చేయడంతో... ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.  Also Read:  భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని.. అధికారిక ఉత్సవంగా నిర్వహించాలన్న డిమాండ్.. ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కేంద్రంలోని మోడీ సర్కారు సెప్టెంబర్ 17 రోజున పరేడ్ గ్రౌండ్స్‎లో విమోచన దినోత్సవాన్ని కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తామని, ఆ కార్యక్రమానికి తమరు ...