Skip to main content

Posts

Showing posts from January, 2023

వీరభద్ర విజయం - ఒక పర్ఫెక్ట్ సర్జికల్ స్ట్రయిక్

సర్జికల్ స్ట్రయిక్ అంటే 2016లో భారతదేశం పాకిస్తాన్ మీద చేసిందే అనుకుంటారు అందరూ. కానీ అది ఓ కొనసాగింపు మాత్రమే. అలాంటి సర్జికల్ స్ట్రయిక్, అంతకన్నా ప్రమాదకరమైంది, అంతకన్నా ఎన్నో రెట్ల భయంకరమైంది భారతీయ పురాణ కాలంలోనే జరిగింది. ఆ సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించిన రుద్రమూర్తే వీరభద్రస్వామి. బహుశా దాన్ని మొట్టమొదటి సర్జికల్ స్ట్రయిక్ గా భావించవచ్చేమో.  శత్రువు చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారమే సరైన చర్య. అవమానించడానికి శత్రువే కానక్కర లేదు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ అయినా సరే.. అవమానించాడంటే శత్రువు కిందే లెక్క. సాక్షాత్తూ పరమశివుడు కూడా అదే సూత్రాన్ని పాటించాడు. అల్లుణ్ని అవమానించడానికే దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టాడట. తండ్రి పిలవకపోయినా ఓ గొప్ప కార్యాన్ని, శుభకార్యాన్ని తలపెట్టాడు కాబట్టి వెళ్లొస్తానని శివుని దగ్గర బలవంతంగా అనుమతి తీసుకొని వెళ్లిపోయింది పార్వతి. దుర్బుద్ధితోనే యజ్ఞం తలపెట్టిన దక్షుడు.. కూతురు ముందే అల్లుణ్ని దారుణంగా అవమానించాడు. శివుడికి కూతురును ఇచ్చి పెళ్లి చేయడమే ఇష్టం లేని దక్షుడు.. కూతురే ఇష్టపడి చేసుకోవడంతో ఏ...