రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్ ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం వినియోగించుకొని నూతనంగా వచ్చేటటువంటి ఇతర సమాచారాలను తెలుసుకోవాలి అని కోరడం జరిగింది.
సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేశ్ బాబు మాట్లాడుతూ వార్తాపత్రికలలో వచ్చిన వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఎక్కువమందికి సమాచారన్నీ చేరవేసి దాని విలువ రెట్టింపు చెయ్యాలి అన్నారు. సమాజంలో వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు ఉన్న లెటర్ హెడ్ మీద విజ్ఞాపనలను ఇస్తే దానికి విలువ ఉంటుందని అందుకే BKS లాంటి సంస్థ అవసరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సోషల్ మీడియా ద్వారా స్థానిక ప్రజలు రైతుల సమస్యలను చిన్న చిన్న గ్రూపుల ద్వారా చేరవేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని అన్నారు.
జాతీయవాద విశ్లేషకులు పూర్వ సంఘ్ ప్రచారక్ రాకా లోకం యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు శ్రీ రాకా సుధాకర్ రావు మాట్లాడుతూ వార్త ఏ విధంగా రాయాలి ప్రధాన అంశం ఏమి ఉండాలి? పత్రికలు ఏ అంశాలకు స్పేస్ ఇస్తాయి? ఎలాంటి టైటిల్ పెడితే స్పేస్ ఇస్తారు? అనే అంశాలపై విశ్లేషణాత్మకంగా వచ్చిన BKS జిల్లా ప్రతినిధులను స్వయంగా రాయిస్తూ ప్రెస్ నోట్ లో ముందు వెనుక అంశాలు, ఏది ప్రధానమైనది ఏదీ అప్రస్తుతం, ఇన్ డైరెక్ట్ మెసేజ్, డైరెక్ట్ మెసేజ్, మోస్ట్ ఇంపాక్ట్ వాయిస్, న్యూస్ పెగ్, పిన్ పాయింట్ వార్తలను ఎలా వ్రాయాలి అనే విషయాన్ని ప్రచార ప్రముఖ్ జిల్లా స్థాయిలోని విద్యుత్ సమస్యలు, రెవెన్యూ అంశాలు, నకిలీ విత్తనాలపై మీడియాకు తన వాయిస్ ఇవ్వడం, సమాచార సేకరణ విశ్లేషణ అనే అంశాలపై బోర్డు పైన ప్రజంటేషన్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రదాన కార్యదర్శి రాజిరెడ్డి గారు , డా.ఏ వి రావుగారు , విజయ్ భాస్కర్ గారు, వివిధ జిల్లాల ప్రతినిధులు గుంటక సత్యనారాయణ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి మ 14 జిల్లాల ప్రతినిధులు మరియు యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్, లా విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి అన్నదానం చేసిన పారిశ్రామికవేత్త ఎస్.గణేశ్ రావును సన్మానిస్తున్న సీసీఎంబీ సైంటిస్ట్ వీరభద్రరావు
Comments
Post a Comment
Your Comments Please: