అప్పుడెప్పుడో తెలంగాణ ఏర్పాటుకు ముందు సెకండ్ క్యాపిటల్ అన్న మాట బాగా వినిపించింది. అప్పుడు ఉద్యమ సమయం కాబట్టి.. ఒక వర్గంవారు సమర్థిస్తే.. తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్రమైన విమర్శలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి కూడా ఓ ప్రముఖ వ్యక్తి నుంచి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవుతుందన్న ధీమా బలంగా వినిపిస్తోంది. అందుకు కారణాలేమై ఉంటాయి? దేశ రాజధానిగా ఢిల్లీ సేఫే కదా? అన్ని రకాల అంతర్జాతీయ హంగులూ అక్కడ ఉన్నాయి కదా? అయినా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలన్న ఆలోచన మళ్లీ ఎందుకు ఊపిరి పోసుకుంటోంది? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అత్యంత సీనియర్ నేతగా ఉండడమే గాక.. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు నోటి నుంచి హైదరాబాద్ రెండో క్యాపిటల్ అన్న మాట వినిపించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని.. 1956లో అంబేద్కర్ కూడా అలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారని.. అది ఈనాడు సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయని సాగర్జీ చెప్పుకొచ్చారు. Also Read: తెలంగాణ జాతిపిత యాదిలో.. Also Read: ఆద్యంతం "వికార పురుష్" ఇది కూడా చదవ
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.