ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అన్ని రకాల గృహ రుణాలపై మిగతా బ్యాంకులన్నిటికన్నా తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయని ఏపీజీవీబీ చైర్మన్ కె.ప్రతాపరెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీజీవీబీ అశోక్ నగర్ రాస్ మెక్ మరియు సంగారెడ్డి రీజినల్ కార్యాలయాన్ని చైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గృహ రుణాలు, వివిధ రుణాల్లో ఏపీజీవీబీలోనే అతితక్కువ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయని చెప్పారు. గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదని, సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఏపీజీవీబీ అన్ని బ్రాంచులలో హౌసింగ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వినియోగదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీజీవీబీ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కోరారు. ఈ కార్య్రమానికి చైర్మన్ కె. ప్రతాపరెడ్డి తో పాటు జనరల్ మేనేజర్ కె.ఈశ్వర సుబ్రమణ్యం, సంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఎస్.ఎల్.ఎన్ ప్రసాద్,అశోక్ నగర్ రాస్ మెక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ చెన్న, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు. కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...
Comments
Post a Comment
Your Comments Please: