ఆయన అవార్డుల కోసం పని చేయడు. అయినా అవార్డులు వెదుక్కుంటూ ఆయన్ని వరిస్తాయి. పని పట్ల ఆయన చూపే బాధ్యతే ఆయన వెంట అవార్డులు క్యూ కట్టేలా చేసిందంటే అతిశయోక్తి కాదంటారు ఆయన స్నేహితులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీ పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎస్.రాజ్‌కుమార్ ను ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి. తాజాగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌కుమార్ తన సేవలకు గాను ప్రశంసా పత్రం అందుకున్నారు.
రాజ్‌కుమార్ ఇప్పటికే 38 ఉత్తమ సేవా పురస్కారు, 24 నగదు పురస్కారాలు, మరో 4 ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన రాజ్‌కుమార్ రెగ్యులర్ పోలీస్ డ్యూటీలే గాక, అధికారులు అప్పగించే ప్రత్యేకమైన టాస్కులు, డ్రాఫ్టింగ్ వంటి ఏ పనులు అప్పగించినా అన్నింటా తన అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. అది చూసే రాజ్‌కుమార్ కోసమే పోలీస్ అధికారులు పలు ప్రత్యేకమైన పనులు అప్పగిస్తారన్న టాక్ కరీంనగర్ జిల్లాలో వినిపిస్తుంది. తాజా కార్యక్రమంలో ఎల్ఎండీ పోలీసులకు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్ఐ శీలం ప్రమోద్‌రెడ్డి, ఏఎస్ఐ నజీముద్దీన్, హెడ్ కానిస్టేబుల్ లింగారెడ్డి, శంకర్, ఆంజనేయులు, కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు లక్ష్మీనారాయణలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు చేతులు మీదుగా వారు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అవార్డు గ్రహీతలకు సీఐ పర్శ రమేశ్, ఎస్ఐ ప్రమోద్ రెడ్డి అభినందలు తెలిపారు.
Great
ReplyDelete