సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో చేతివృత్తులు చేసుకునేవారిలో ఆశలు, అంచనాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా వృత్తి పనివారలుగా ఉన్న కోట్లాది మందికి విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి చేకూరుతుందని మోడీ చెప్పారు. 18 సంప్రదాయ చేతివృత్తులవారికి శిక్షణ ఇచ్చి, వారికి సర్టిఫికెట్ కూడా జారీ చేసి.. వారి వృత్తికి ఉపయోగపడే టూల్ కిట్ కొనుగోలు కోసం 15 వేలు కూడా ఇస్తారని చెబుతున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ పూజా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని మోడీ స్వయంగా ప్రకటించారు. విశ్వసృష్టికి, సకల జగత్తు గమనానికి కారకుడైన విశ్వకర్మ పూజా మహోత్సవం రోజునే మోడీ పుట్టిన రోజు కావడంతో.. సెప్టెంబర్ 17కు దేశవ్యాప్తంగా కూడా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో 17వ తేదీన హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో వృత్తిదారులతో సభ నిర్వహిస్తున్నారట. ఈ స్కీము విధి విధానాలు ఆ రోజున తెలియజేస్తారట.
చితికిపోయిన చేతివృత్తులనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న కోట్లాది మందికి రెండున్నర శాతం వడ్డీ రాయితీతో ఎలాంటి పూచీకత్తు లేకుండానే మొదటి విడతగా లక్ష రూపాయలు, రెండో విడతగా 2 లక్షలు.. ఇలా మొత్తం 3 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పిస్తామని చెబుతున్నారు. చేతివృత్తులైన వడ్రంగం, కమ్మరం, కంచరి పని, కంసాలి, శిల్పం వంటి విశ్వబ్రాహ్మలు చేసుకునే వృత్తులతో పాటు.. పడవల తయారీదారులు, ఆయుధాలు తయారు చేసేవారు, పరికరాలు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు, రిపేరు చేసేవారు కుండలు తయారుచేసే కుమ్మరులు, మోచీ, మేదర, మేస్త్రీపని, బొమ్మలు లేదా ఆట వస్తువులు తయారు చేసేవారు, బార్బర్లు, పూల దండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీ, చేపలు పట్టేవారికి వలలు వగైరా పరికరాలు సమకూర్చడం. ఇలా 18 రకాల వృత్తి పనివారికి ఆర్థిక సాయం ఇచ్చే కీలకమైన కార్యక్రమానికి సెప్టెంబర్ 17నే మోడీ శ్రీకారం చుట్టడం విశేషంగా మారింది.
ఈ విధంగా సెప్టెంబర్ 17కు చారిత్రక, పౌరాణిక నేపథ్యం మాత్రమే గాక.. ప్రధాని జన్మదినం కూడా తోడవడంతో ఇది తెలంగాణలో కీలకంగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏపీ విశ్వబ్రాహ్మణ పెద్దల విజ్ఞాపనను గౌరవించి సెప్టెంబర్ 17 విశ్వకర్మ యజ్ఞమహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
Read this also: సెప్టెంబర్ 17.. విలీనమా, విమోచనమా, విద్రోహమా, సమైక్యతా దినమా, స్వాతంత్ర్య పర్వమా?
Comments
Post a Comment
Your Comments Please: