ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తరగతుల ప్రాంగణంలోనే ఆదివారం లైట్ ఆఫ్ నాడీ ఆస్ట్రాలజీ అనే ఆన్ లైన్ మేగజైన్ ను రాజా ఆవిష్కరించారు. ఇక్కడే ఉచిత వాస్తు తరగతలు కూడా బోధిస్తున్నారు.
మన పూర్వీకులు, రుషి పుంగవులు భారతీయ సంతతికి అందించిన ఈ విజ్ఞానాన్ని అందరూ అందుకొని తమ జీవితాలను సుఖమయం చేసుకోవాలని రాజా కోరారు. ఈ ఆన్ లైన్ మేగజైన్లో నిష్ణాతులైన అధ్యాపకులు, ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్న ఔత్సాహికులు ఆర్టికల్స్ రాసుకోవచ్చని.. ఇతరులను ఆస్ట్రాలజీపరంగా ఎంకరేజ్ చేయాలని ఆయన కోరారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న తమ ఉచిత బోధనా తరగతులను ఇటీవలే వరంగల్ లోనూ ప్రారంభించినట్లు రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రాలజీ అధ్యాపకులు, శిక్షార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం (ఏకాదశి) రాజా పుట్టినరోజు సందర్భంగా ఈ-మేగజైన్ ఆవిష్కరించారు.
లైట్ ఆఫ్ నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ఆవిష్కరిస్తున్న రాజా, ఇతర నిపుణులు
Comments
Post a Comment
Your Comments Please: