Skip to main content

భారతీయ నారీ శక్తిని బయటపెట్టిన తాజా రిపోర్ట్

ఆడపిల్లలు అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు... తాము ఎందులోనూ, ఎవరితోనూ తీసిపోమని. అయినా పురుషాధిక్య సమాజం.. మహిళల మీద ఆంక్షలు విధించింది. మహిళల మేలు కోసమేనని ఒకసారి.. మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తే గనక మగాళ్ల పని ఖతం.. అనే పేరుతో ఇంకోసారి.. ఇలా అనేక కోణాల్లో మహిళల్ని అణచివేయడమే పనిగా పెట్టుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే మాత్రం.. మహిళల్లో దాగున్న పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ రిపోర్టు ఏం చెబుతోంది? దాన్నుంచి మనవాళ్లు నేర్చుకోవాల్సిన అంశాలేంటి? 

ఆడవాళ్లకు చెప్పించే చదువు దగ్గర నుంచి, వారికి సొంతంగా ఏదైనా బాధ్యతలు అప్పగించేదాకా.. ప్రతిచోటా వారికి ద్వితీయ ప్రాధాన్యమే దక్కుతోంది. అయితే ఈ మధ్య ఇలాంటి అభిప్రాయాల్లో మార్పులు జరిగినా.. ఆ మార్పులు రావాల్సిన స్థాయిలో మాత్రం రాలేదు. అందువల్ల ఆకాశంలో సగం అని గౌరవించుకునే మనమే.. వారి అవకాశాలకు గండి కొట్టేశాం. ఫలితంగా దేశ ఆర్థిక ఎదుగుదలలో వారి పాత్ర తగ్గిపోయింది. దాని ప్రభావం కొన్ని తరాల దాకా పాకిందంటే అతిశయోక్తి కాదు. అయితే మహిళలను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా.. వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం వారి శక్తి సామర్థ్యాలకు తగినంతగా లేదన్న విషయాన్ని అందరూ ఒప్పుకొని తీరతారు. 

అయితే భారతీయ మహిళలు మాత్రం.. ఈ సమాజం తమను ఎంతగా అణచివేస్తున్నా.. వారి ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూనే వస్తున్నారు. సమాజం, బుద్ధి జీవులు తమను పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా తమ కర్తవ్యం నిర్వర్తిస్తూనే వస్తున్నారు. తమ సేవలకు ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వకుండానే.. చేరుకోవాల్సిన గమ్యాలను చేరుకుంటున్నారు. తమ భావి తరాలకు అద్భుతమైన మార్గాలు వేస్తూనే ఉన్నారు. ఆ విషయమే తాజా సర్వేలో బయటపడింది. 

దేశంలో ప్రఖ్యాతి చెందిన ఉన్నత విద్యా సంస్థ అయిన భారతీయ విద్యాభవన్ ఈ మధ్య ఓ సర్వే నిర్వహించింది. భారతదేశ ఆర్థిక పురోగతికి, నిలకడైన వృద్ధికి మూల స్తంభాల్లాంటి చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల్లో.. వాటిని అభివృద్ధిలో మహిళల పాత్ర ఏంటి.. అనే కోణంలో భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలోని ఎస్.పి.జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్-(ఎస్పీజేఐఎంఆర్) ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఇప్పటివరకు వెలుగుచూడని అంశాలు చాలా బయటపడ్డాయి. దేశంలో నడుస్తున్న కుటుంబ వ్యాపారాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగిందనేది ఆ రిపోర్టు సారాంశం. ఆ సర్వే రిపోర్టు ద్వారా మహిళలు సాధించిన విజయాలు, వారికి అందుతున్న ప్రోత్సాహం, ఎదుర్కొంటున్న సవాళ్లు, వ్యాపారాన్ని విస్తరించేందుకు వారు అనుసరిస్తున్న పద్ధతులు.. ఫలితంగా దేశానికి వారు తోడ్పడుతున్న తీరు వంటి చాలా కీలకమైన అంశాలు బయటపడ్డాయి. 

Follow the link: SPJIMR unveils India: State of Family Business Report 2023

ఎస్పీజేఐఎంఆర్.. దేశంలోని 17 పట్టణాల్లో ఈ సర్వే నిర్వహించింది. 357 బిజినెస్ ఫ్యామిలీస్ ని వారు సంప్రదించారు. ఈ సర్వే ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల మీదనే కాన్సంట్రేట్ చేసింది. ఆయా వ్యాపార సంస్థల నుంచి ప్రొడక్షన్ రావడంలో మహిళల నిర్ణయాత్మక పాత్ర ఏంటి.. అనే కోణంలో అధ్యయనాన్ని ఫోకస్ చేశారు. ఉద్యోగులుగా ఉన్న మహిళలు కాకుండా.. నిర్ణయాత్మక పాత్రలో ఉన్న మహిళల సంఖ్య ఎంత అనే అంశం మీద వారి ఫోకస్ ప్రధానంగా సాగిందట. దీంతో అద్భుతమైన రిపోర్టు బయటపడింది. భారత్ లో మేనేజీరియల్ రోల్స్ లో మహిళల పాత్ర గణనీయంగా పెరుగుతోందట. అంటే కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే పాత్రను అత్యంత సమర్థవంతంగా వారు పోషిస్తున్నారట. ఎస్పీజేఐఎంఆర్ రిపోర్టులో 40 శాతం కుటుంబ వ్యాపారాల్లో మహిళలే యజమానులుగా ఉన్నట్టు తేలింది. కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళల సంఖ్య 40 శాతం అంటే తక్కువేమీ కాదు. దీన్నే ఇంకో ఉదాహరణ ద్వారా చెప్పుకోవాలంటే.. ఈ రోజుల్లో ఏ ప్రభుత్వ ఏర్పాటునైనా 40 శాతం ప్రజలే నిర్ణయిస్తున్న విషయం గమనించాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. 54.7 శాతం మంది మహిళా సభ్యులు కుటుంబ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారట. అంటే మెజారిటీ సభ్యులు తమ వ్యాపారాల్లో విజయపథంలో దూసుకుపోతుండడం విశేషం. అయితే కుటుంబ సభ్యుల నుంచి, బోర్డు మెంబర్స్ నుంచి మరింత సహకారం, ప్రోత్సాహం లభిస్తే వారి సక్సెస్ రేటు పైపైకి దూసుకుపోవడం ఖాయమంటున్నారు ఆ రిపోర్టును విశ్లేషిస్తున్నవారు. అయితే మేనేజీరియల్ పోస్టుల్లో గణనీయంగా మహిళల సంఖ్య ఉన్నప్పటికీ.. సీఈవో స్థాయిల్లో మాత్రం మహిళల రిప్రజెంటేషన్ తక్కువగానే ఉందంటోంది ఆ రిపోర్టు. 

Read this also: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

భారత్ లోని కుటుంబ వ్యాపారాలు ఎక్కువగా సూక్ష్మ, చిన్న తరహాలోనే ఉన్నాయి. ఇది మన దేశపు కుటుంబ వ్యవహారాలకు అద్దం పడుతోందంటున్నారు నిపుణులు. భారత గ్రామీణ ప్రాంతాల్లోని కుటీర పరిశ్రమలే ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను నిలిపి ఉంచాయి. అయితే విదేశీ ఏలుబడి కారణంగా భారీ ఎత్తున పారిశ్రామికీకరణ జరిగిపోయింది. దాని ఫలితంగా దేశ ఆర్థిక ఎదుగుదలలో డబ్బు ప్రమేయం గణనీయంగా పెరిగిపోయింది. కానీ దాంతో సరిసమానంగా ధనవంతులు పెరగలేకపోయారు. అందుక్కారణం కుటీర పరిశ్రమల మీద వేటు పడటమేనంటారు నిపుణులు. అయితే పారిశ్రామికీకరణ వల్ల ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా పరుగులు అందుకుంది. కానీ అదే సమయంలో కుటీర పరిశ్రమల మీదనే ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. పూట గడవడం కోసం వలస బాట పట్టి చెల్లాచెదురైపోయాయి. గ్రామాలు విడిచిన ఎన్నో కుటుంబాలు దిక్కూ దివాణం లేకుండా అష్టకష్టాల పాలయ్యాయి. ఈ విషయాన్ని మన పాలకులు ఆలస్యంగా గుర్తించడంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వంటి పరిశ్రమలను నెమ్మదిగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఈ ప్రోత్సాహాలను అంది పుచ్చుకొని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని.. మళ్లీ తమ కుటుంబాల భవిష్యత్తును వెదుక్కుంటూ ఓ మహాయజ్ఞం మొదలైంది. విచిత్రంగా.. పాత కుటీర పరిశ్రమల్లో మహిళల పాత్ర ఎంతగా ఉండెనో.. ఇప్పుడు అదే పాత్రను సూక్ష్మ, చిన్న పరిశ్రమల్లోనూ మహిళలు పోషిస్తున్నట్టు ఈ రిపోర్టు ద్వారా వెలుగు చూసింది అంటున్నారు విశ్లేషకులు. 

భారతదేశ వ్యాపార చిత్రపటాన్ని ప్రభావితం చేస్తున్నవి ఈ ఎస్ఎంఈ లే. అంటే... స్మాల్ అండే మీడియమ్ ఎంటర్‎ప్రైజెస్సే. అంటే మహిళలు నడుపుతున్న ఈ పరిశ్రమలు విజయ పథాన నడుస్తున్నట్టు ఆ రిపోర్టు ద్వారా తేలిపోయింది. ఇక మహిళలు నడుపుతున్న ఎంటర్‎ప్రైజెస్ లో ఉత్పాదక విభాగంలో 83 శాతం సూక్ష్మ లేదా చిన్న పరిశ్రమలే ఉన్నాయట. అదే సేవా విభాగంలో అయితే 73 శాతం పరిశ్రమలే మహిళలు నడుపుతున్నవి ఉన్నాయి. దీన్ని బట్టి మహిళలు సేవా విభాగాన్ని మించి.. ఉత్పాదక రంగంలో ఎంతగా రాణిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. సంస్థ సర్వే చేసిన వ్యాపారాల్లో 70 శాతం ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ మహిళలు ఎక్కువగా ఉండడం మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. దేశ ఆర్థిక ఎదుగుదలలో మహిళల పాత్రను అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ఉపకరిస్తుందంటున్నారు నిపుణులు. 

ఫ్యామిలీ ఓనర్ షిప్, కంట్రోలింగ్ పవర్ అనేవి.. ఆయా పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నాయట. సర్వే చేసిన పరిశ్రమల్లో 51 శాతం ఎంటర్‎ప్రైజెస్ వంద శాతం ఫ్యామిలీ షేర్లను కలిగి ఉన్నట్లు తేలింది. ఫ్యామిలీ బిజినెస్ లు పటిష్టంగా నడవడానికి కంట్రోలింగ్ పవర్ మహిళల చేతుల్లో ఉండడం చాలా కీలకంగా కనిపిస్తుందంటున్నారు వ్యాపార నిపుణులు. ఇందుక్కారణం భారతీయ మహిళల మూలాల్లోనే ఉందంటారు. మన మహిళల అభిరుచులు, వారు పాటిస్తున్న విలువలు, లక్ష్యాలు వంటి అంశాలతో వారు ఎంతగా తాదాత్మ్యం చెందుతారో ఈ పర్సెంటేజే చెబుతుందంటున్నారు విశ్లేషకులు. పాలసీ మేకింగ్ లో గానీ, పాలసీని అమలు చేయడంలో గానీ, ఎంజాయ్‎మెంట్ వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా లక్ష్యాల కోసం పని చేసే లక్షణం మహిళలకే ఎక్కువ ఉందన్న విషయం ఆధారసహితంగా రుజువైందంటున్నారు. భారతీయ మహిళలను మరింతగా అర్థం చేసుకోవడానికి, వారికి ఇంకా ఎలాంటి టార్గెట్లు ఇవ్వవచ్చో అంచనా వేయడానికి ఈ రిపోర్టు చక్కగా పనికొస్తుందని ఎస్పీజేఐఎంఆర్ విశ్లేషిస్తోంది. 

ఇక పరిశ్రమలను గాడినపెట్టి.. తదుపరి బాధ్యతలను కుటుంబంలోని జూనియర్లకు అప్పగించాలని మొదటితరం మహిళా ఎంట్రప్రెన్యూర్లు భావిస్తున్నా.. బాధ్యతల అప్పగింత అంత సులువుగా జరగడం లేదట. కుటుంబాల్లో ఉండే అభిప్రాయ భేదాలు, వాటాల గోలలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వంటి అనేక కారణాల వల్ల బాధ్యతల బదిలీలో ఆలస్యం అవుతోందట. నిర్దేశిత లక్ష్యాలు అందుకోవడంలో జాప్యం జరగడానికి ఇది కూడా ఒక కారణమని అంచనా వేస్తున్నారు. మహిళలు నడుపుతున్న స్మాల్ అండ్ మీడియం పరిశ్రమలు.. ఇంత సక్సెస్ గా ఉండడానికి కారణమేంటనేది విశ్లేషిస్తే.. 75 శాతం కంపెనీ షేర్లు 63.3 శాతం కుటుంబాల చేతుల్లో ఉండడమేనని ఎస్పీజేఐఎంఆర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఒక ప్రాజెక్టు కలకాలం ఉండాలంటే.. ఆ ప్రాజెక్టును తమదిగా భావించేది కుటుంబ సభ్యులు మాత్రమే. అలా కుటుంబ సభ్యులు నిర్వహించే సంస్థలు దీర్ఘకాలం లాభాల్లోనే గాక.. దీర్ఘకాలం సజీవంగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆ కుటుంబ యాజమాన్యాల్లోనూ మహిళలు నడుపుతున్న సంస్థలు అద్భుతంగా నడుస్తున్నట్టు ఇప్పుడు తేలడం.. భారతీయ నారిలోని అసలైన శక్తిని రుజువు చేస్తోందంటున్నారు.

ఈ అధ్యయనంలో మరో అంశం కూడా తేలింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నవి చాలా తక్కువే ఉన్నాయట. కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే నూతన టెక్నాలజీని, డిజిటైజేషన్ లోని సౌలభ్యాలను ఉపయోగించుకుంటున్నాయట. అయితే ఈ పావు శాతం మంది.. తమ ప్రధాన వ్యాపార పోటీదార్లతో దాదాపు సరిసమానంగా పోటీ పడుతూ లాభాలు గడిస్తున్నారట. మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సూక్ష్మ పరిశ్రమలు ఆన్‎లైన్ సేల్స్ ను చక్కగా వినియోగించుకుంటున్నాయట. ఈ-కామర్స్ లో ఉండే సౌలభ్యాన్ని అర్థం చేసుకున్నవారు.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారట. ఈ డిజిటైజేషన్ ప్రక్రియ కూడా ఎస్ఎంఈల్లో చాలా వేగంగా జరుగుతున్నట్టు సర్వే నిర్వాహకులు గుర్తించడం విశేషం. 

మొత్తానికి ఎస్పీజేఐఎంఆర్ నిర్వహించిన సర్వే ద్వారా.. ప్రభుత్వాలకు, ప్రజలకు భారతీయ మహిళలు సాగిస్తున్న మహా యజ్ఞం.. భవిష్యత్తులో ఎన్ని ఫలాలు ఇస్తుందో తెలుసుకునే అద్భుతమైన అవకాశం దక్కిందంటున్నారు నిపుణులు. 



Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...