తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న, ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తుడైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 64వ బర్త్ డే వేడుకలు ఆత్మీయుల మధ్య ఎంతో హుందాగా, సాదాసీదాగా జరిగాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఉదయం నుంచీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నిరంజన్ రెడ్డి అభిమానులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యాక జిల్లా రూపురేఖలు మారిపోయాయని.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని భాగ్యనగర్ పోస్ట్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. మేగజైన్ మేనేజింగ్ ఎడిటర్ రాఘవరెడ్డి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే ఎన్నికల్లోనూ నిరంజన్ రెడ్డి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన బర్త్ డే వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో అభిమానులు వనపర్తికి తరలి రావడంతో పట్టణమంతా సందడి వాతావరణం నెలకొంది.
Also Read: నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ స్కెచ్
Also Read: మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు
Comments
Post a Comment
Your Comments Please: