Skip to main content

పొగ తాగడానికి పొగ పెడుతున్న రుషి సునాక్

ఈ ప్రపంచం కరోనా అనే ఓ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొంది. కానీ అంతకుమించిన మరో మహమ్మారి ప్రతి దేశాన్నీ పీడిస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆ మహమ్మారిని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.  ఆ మహమ్మారిని తరిమేయడానికి, ఇంగ్లాండ్ నుంచి తరిమేయడానికి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కంకణం కట్టుకున్నారు. త్వరలో ఓ చట్టం కూడా తేబోతున్నారు. మరి రిషి తేబోతున్న చట్టానికి.. ఏపీలో మన జగన్ తీసుకొచ్చి వెనక్కి వెళ్లిన చట్టానికి తేడా ఏంటి? 

Read this also: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

పొగ తాగుడు కారణంగా ప్రపంచంలో యేటా 80 లక్షల మంది చనిపోతున్నట్టు డబ్ల్యు.హెచ్.ఒ లెక్కలు కట్టింది. అందులో డైరెక్టుగా పొగాకు వినియోగం కారణంగా సంభవిస్తున్న మరణాలు ఏటా 70 లక్షలట. అంటే సిగరెట్ తాగని, పొగాకు బారిన పడనివారు కూడా దాని పరోక్ష ప్రభావం చేత ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారన్నమాట. అంటే ఈ 70 లక్షల మంది స్మోకర్ల కారణంగా వారు వదిలే పొగ పీల్చి.. పాపం అమాయకులైన నాన్ స్మోకర్లు మరో 13 లక్షల మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రపంచం తీవ్రంగా భయపడాల్సిన అతిపెద్ద పాండమిక్ ఇదే అయిందంటున్నారు ప్రపంచ క్యాన్సర్ నిపుణులు. కోవిడ్ టైమ్ లో ఇంగ్లాండ్ లో 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులలో స్మోకర్ల సంఖ్య నలుగురిలో ఒకరి నుంచి ముగ్గురిలో ఒకరికి పెరిగిందట. ఇది యూకే ప్రభుత్వం స్వయంగా తేల్చిన ఓ సర్వే రిపోర్టు. దిక్కుమాలిన పొగ కోసం స్లమ్ ఏరియాల్లో ఉండే నిరుపేదలు కూడా ఏటా పది శాతం ఆదాయాన్ని తగలేస్తున్నారట. ఇప్పుడు ఏటా దాదాపు 70 వేల పొగాకు వినియోగ మరణాలు ఒక్క యూకేలోనే సంభవిస్తున్నాయట.

క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న, దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రయత్నం కారణంగా.. ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పొగ తాగే దురలవాటును ఉన్నపళంగా అరికట్టాలని లేకపోతే.. ఇప్పుడు వేప్స్ కు అలవాటు పడిన చిన్నపిల్లలు, ఎలక్ట్రిక్ సిగరెట్లకు బానిసలైనవారు రేపు అసలైన టుబాకో ప్రోడక్ట్స్ కు అడిక్ట్ అవుతారని.. రానున్న రోజుల్లో పిల్లలంతా పెద్దలుగా ఎదగక ముందే ఈ లోకం నుంచి అదృశ్యమైపోయే ప్రమాదం పొంచి ఉందన్న డేంజర్ బెల్స్ రిషి మోగిస్తున్నారు. బుధవారం మాంచెస్టర్లో కన్సర్వేటివ్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సునాక్ తన నెక్స్ట్ ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేశారు. 

ఇంగ్లాండ్ దేశమంతటా సిగరెట్లు కొనే వినియోగదారుల ఏజ్ ను ఏటేటా పెంచుకుంటూ పోయి క్రమంగా నెక్స్ట్ జెనరేషన్ కు అసలు సిగరెట్ అనేది తెలియకుండా చేయాలనేది రిషి సునాక్ ప్లాన్. ఇందుకోసం చాలా స్పీడ్ గా చర్యలు చేపట్టాలని, వీలైనంత తొందరలో పార్లమెంట్లో చట్టం ఆమోదింపజేసుకొని.. చాలా వేగంగా అమల్లోకి వెళ్లాలని కన్సర్వేటివ్ పార్టీ యోచిస్తోందట. ఆ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో ప్రధానిగా రిషి చాలా కీలకంగా మారడం విశేషం. అయితే ఈ విషయంలో పలు దేశాలు ఇప్పటికే కొంతవరకు ప్రోగ్రామ్ ను అమల్లోకి తీసుకొచ్చాయి. గతేడాదే న్యూజీలాండ్ యాంటీ స్మోకింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది. 2008 తరువాత పుట్టినవారికి సిగరెట్లు అమ్మరాదనే చట్టాన్ని న్యూజీలాండ్ అమలు చేస్తోంది. అంటే 2009 జనవరి 1, ఆ తరువాత పుట్టినవారికి సిగరెట్లు అమ్మరాదనేది ఓ కటాఫ్ డెసిషన్. 14 ఏళ్ల లోపు ఉన్నవారికి న్యూజీలాండ్ లో సిగరెట్ అమ్మరాదు. ఇప్పుడదే బాటలో ఇంగ్లాండ్ కూడా పయనిస్తోంది. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ లో 18 ఏళ్ల యువకుల నుంచి సిగరెట్ ను దర్జాగా కాల్చే హక్కు చట్టపరంగా అమల్లో ఉంది. అది త్వరలో ఇంగ్లాండ్ లో మారబోతోంది. 

పొగాకుతో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోందని.. ప్రపంచాన్ని అదే భయపెడుతోందని.. దాన్ని అరికట్టాలనే ఓ బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు తీసుకున్నాయి. ప్రజలకు, పాలకులకు, రాజకీయ పార్టీలకు అవగాహన కల్పిస్తున్నాయి. అయినా ప్రభుత్వాలేవీ ఈ మహమ్మారిని అరికట్టడానికి ఇప్పటివరకు కృషి చేయలేదు. అందుక్కారణం సిగరెట్ స్మోకింగ్ అనేది రిచ్ పీపుల్ కల్చర్ గానే కాక.. అతి సామాన్యులు సైతం స్మోకింగ్ లేకుండా ఉండలేని పరిస్థితి ఎప్పుడో వచ్చేసింది. మరోవైపు సిగరెట్ కంపెనీలు బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి. వారు చెప్పినట్టల్లా ఆడే ప్రభుత్వాలు అన్ని దేశాల్లోనూ కొలువుదీరి ఉన్నాయి. అలాంటివాటికి చెక్ పెట్టాలంటే భారీ ఆదాయానికి స్వయంగా గండి కొట్టడమే అవుతుంది. అందుకే ఇప్పటిదాకా స్మోకింగ్ మీద కంట్రోల్ విధించలేకపోయారు. కానీ ఇప్పుడు మన భవిష్యత్తరాల ప్రాణం మీదికే వచ్చిందని రిషి సునాక్ భావిస్తున్నారు. మరోవైపు ఒరిజినల్ సిగరెట్ల లాగే కాస్త తక్కువ ప్రమాదం అంటూ డూప్లికేట్ సిగరెట్లు కూడా మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. వాటికోసం పిల్లలు ఎగబడుతున్నారు. అవే డిస్పోజబుల్ వేప్స్. మరోవైపు ఎలక్ట్రికల్ సిగరెట్లు కూడా మార్కెట్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రమంగా ఒరిజినల్ సిగరెట్ల వినయోగం వైపు మళ్లించేవే తప్ప.. నిజంగా ఆ అలవాటును మాన్పించడానికి కాదన్న వాదన ఉంది. అందుకే డిస్పోజబుల్ వేప్స్ పని పట్టడానికి కూడా సునాక్ నిశ్చయించుకున్నారట. 

పొగాకు ఉత్పత్తుల మీద క్రమంగా కంట్రోల్ విధించబోతున్న కారణంగా ఏటా 17 బిలియన్ పౌండ్ల ఆదాయం మిగులుతుందని.. అంతకన్నా విలువైన మన భావితరాల ఆయుర్దాయం పెరుగుతుందని రుషి సునాక్ అంటున్నారు. త్వరలో వచ్చే బిల్లును పార్టీలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా అందరూ ఓటేయాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఇక రుషి నోట ఈ మాట వెలువడిందే ఆలస్యం.. స్టాక్ ఎక్స్చేంజీలోని అన్ని సిగరెట్ కంపెనీల షేర్లు పతనమైపోవడం ప్రారంభమైంది. క్యాన్సర్ నివారణ కోసం ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థలు.. రిషి తీసుకోబోతున్న స్టెప్పును స్వాగతిస్తున్నారు. అయితే దాని అమలు అనుకున్నంత సులభం కాదని.. ఎంతో చిత్తశుద్ధి, మరెంతో పరిణతితో పాటు... చాలా పటిష్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని... స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ ను స్మోక్ ఫ్రీ కంట్రీగా చేయడానికి పెద్దఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. దానికి 14వేల మంది మద్దతు లభించిందట. 50కి పైగా ఎంపీల మద్దతు కూడా లభించిందట. వారే కాక.. కౌన్సిలర్లు, ప్రభువులు, 20కి పైగా స్వచ్ఛంద సంస్థల మద్దతు కూడా లభించిందట. పొగాకు వినియోగంపై చాలా వేగంగా ఉక్కుపాదం మోపుతూ పోతే 2030 వరకు స్మోక్ ఫ్రీ కంట్రీ అవుతుందని సునాక్ భావిస్తున్నారని సమాచారం. అయితే ఇంగ్లాండ్ లోని పేదలు, మురికివాడల్లో ఉండేవారు... 2050 వరకు స్మోకింగ్ కి దూరంగా ఉండడం అసంభవం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అడ్డదార్లలో లభిస్తున్న పొగాకు, గంజాయి వంటి వాటికి అడ్డుకట్ట వేయకుండా కేవలం చట్టాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఆ లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఏమైనా రుషి ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవడం మాత్రం దేశానికి చాలా మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తుండడం విశేషం. అంటే సునాక్ ఒకు శుభారంభాన్ని చేసినట్టేనంటున్నారు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా. 

ఇక ఇదే ఇష్యూను మన ఏపీతో పోల్చుకొని ఓసారి చూద్దాం. జగన్ తాను పవర్లోకి వచ్చాక దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పారు. పాపం.. తన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చి చూశారు కూడా. అప్పుడు తెలిసింది ఆయనకు.. మద్య నిషేధాన్ని అమలు చేయడం  ఎంత కష్టమో. దాన్ని అమలు చేసే ప్లానింగ్, మెకానిజం, చిత్తశుద్ధి.. ఇలాంటివేవీ ప్రదర్శించని జగన్.. దాన్ని సాకుగా తీసుకొని.. ఏకంగా ధరలు పెంచేసి మళ్లీ ఓ ఆదాయమార్గంగా ఎంచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ తరువాత జగన్ మద్య నిషేధం మాట కూడా ఎత్తడం లేదు. అయితే న్యూజీలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాలు ఏ విధంగా పొగాకు వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కటాఫ్ డేట్ పెట్టుకొని నెక్స్ట్ జెనరేషన్ కు అందకుండా చేసేందుకు యోచిస్తున్నాయో.. ఇక్కడ కూడా అలాంటి ప్రయోగం ఏదైనా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలంటున్నారు నిపుణులు. అయితే మద్య నిషేధమైనా, పొగాకు నిషేధమైనా.. ఇప్పుడున్న తరాన్ని వదిలేసి.. రేపటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రకమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటూ పోతే.. క్రమంగా ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. మరి జగన్.. రిషి సునాక్ బాటను ఎంచుకుంటారా? 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...