హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.
జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థాయిలో అందిస్తున్న తమ సేవలను గుర్తించి.. ఆస్ట్రాలజీని మరింత ఎక్కువ మందికి చేరవేసేలా తమకు ఫ్లోరిడా యూనివర్సిటీవారు ఓ గొప్ప అవకాశం కల్పించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుటున్నాం అన్నారు రాజా. తమకు ఆసియా ఖండ వ్యాప్తంగా ఆస్ట్రాలజీ, వాస్తు, యోగ శాస్త్రాలు బోధించే అవకాశం వచ్చిందని.. హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు ముమ్మరం చేస్తామని చెప్పారు. సనాతన ధర్మంలోని విశ్వ శ్రేయస్సును కోరి తాము ఉచితంగా అందిస్తున్న ఈ సేవలను ఔత్సాహికులు అంతా వినియోగించుకొని జీవితాలను సుఖమయం చేసుకోవాలని రాజా విజ్ఞప్తి చేశారు. జేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే తాము దాదాపు నాలుగు వేల మందికి జ్యోతిష్య శిక్షణ ఇచ్చామని.. ఇప్పుడు ఫ్లోరిడా బ్రాంచి ద్వారా తమ సేవలు విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. తమ బ్రాంచి ఆధ్వర్యంలో ఈ కోర్సులతో పాటు రానున్న రోజుల్లో గీతాశాస్త్రం, ఉపనిషత్తుల్లో కూడా కోర్సులు అందించేందుకు కృషి జరుగుతోందన్నారు.
హైదరాబాద్ బ్రాంచ్ కి చాన్సలర్ గా రాజా వ్యవహరిస్తారు. ప్రో చాన్సలర్ గా డా కె.వి.రఘునాథన్, సీఈఓ గా హైమావతి బాధ్యతలు నిర్వహిస్తారని రాజా చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు శేషు, డైరెక్టర్లు కె.శారద, కె.వి.శరవణకుమార్, ఫణిరాజు, కె.రవీందర్, వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
లోగో, బ్యానర్ ఆవిష్కరిస్తున్న ఎన్.వి.ఆర్.ఎ. రాజా
కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు
Read this: మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్
నోట్- ఈ వార్త ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. కామెంట్ రాయండి.
🙏🙏🙏
ReplyDelete