ఏపీ రాజకీయాల్లో "కీ రోల్" పోషించాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ కు.. టైగర్ నాగేశ్వరరావు ఇబ్బందికరంగా మారాడట. అదేంటి? టైగర్ నాగేశ్వరరావుతో పవన కళ్యాణ్ కు వచ్చిన ఇబ్బందేంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా. పవన్ రెండో భార్య రేణూ దేశాయ్.. అందులో "కీ రోల్" పోషించడం.. ఆ సినిమా ఫంక్షన్ లో రేణూ మాట్లాడిన మాటలు పవన్ ను పరోక్షంగా టచ్ చేయడం వంటి కారణాలతో ఆయన ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయట. ఇంతకీ రేణూ ఏమంది? ఆమె మాటలు పవన్ కెరీర్ కు ఎలా ఎఫెక్ట్ అవుతాయి?
Read this also: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం
ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరై.. తన వ్యక్తిగత విషయాలతో పాటు తన గత విషయాల గురించి కూడా చెప్పుకున్నారు రేణూ దేశాయ్. అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించాలని.. అదృష్టం కలిసొస్తే సీఎం అవ్వాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లో రేణూదేశాయి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవన్ కు సంబంధించి ఎదురైన ప్రశ్నలకు పెద్దగా రెస్పాండ్ కాని రేణూ.. అతను సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా..? అనే ప్రశ్నకు సైతం ఒకింత కటువుగానే స్పందించారంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్. ఒక పొలిటీషియన్‌గా అతను ఈ సొసైటీకి అవసరమని మాత్రమే గతంలో ఓ వీడియో ద్వారా చెప్పానని.. అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు. ఇక సీఎం అవుతారా లేదా అనేది మాత్రం తాను కోరుకోనని చెప్పడం.. పవన్ ఫ్యాన్స్ లోనే గాక.. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఆసక్తి రేపుతోంది. అక్కడితో ఆగకుండా.. దేవుడు ఉన్నాడని.. ఏ విషయమైనా ఆయనే డిసైడ్ చేస్తాడని.. కనీసం ఒక కామన్ వ్యక్తిగా కూడా ఆయన వైపు స్టాండ్ తీసుకోనని రేణూ తేల్చి చెప్పడం దుమారం రేపుతోంది.
పవన్ కళ్యాణ్ తన పిల్లలికి తండ్రిగా ఉంటారు... అంతే తప్ప ఆయన రాజకీయ జీవితం గురించి తాను మాట్లాడబోనని ఖండితంగా చెప్పారు రేణు. ఫలానా వ్యక్తిని సపోర్ట్ చేయండి అంటూ తనకు ఎన్నికల ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. పవన్ గురించి తాను ప్రతిసారీ నిజాలే చెప్పానని.. విడాకుల సమయంలో చెప్పినవి కూడా అన్నీ నిజాలేనని.. కొద్దిరోజుల క్రితం పవన్ గురించి చెప్పిన మాటల్లో కూడా నిజమే ఉందని... కావాలంటే లై డిటెక్టర్ పెట్టి చెక్ చేసుకోవచ్చునని రేణు చెప్పడం పవన్ ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది.
ఒక మంచి పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ సొసైటీకి ఎంతో అవసరం అని తాను గత వీడియోలలో తెలియజేశానని... అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు రేణూ. ఆయన సీఎం అవ్వాలని తాను కోరుకోవడం లేదని.. తనలో గూడు కట్టుకున్న గాఢమైన అభిప్రాయాన్ని అంతే గాఢంగా రేణూ చెప్పారంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక కామన్ మ్యాన్ గా కూడా తాను పవన్ కళ్యాణ్ పట్ల స్టాండ్ తీసుకోను అంటూ.. రేణు పవన్ పొలిటికల్ జర్నీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని.. టీడీపీ పొత్తును ఆసరా చేసుకొని వీలైనన్ని ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని జనసేన అధినేత చురుగ్గా పావులు కదుపుతున్నారు. అవకాశం వస్తే తప్పకుండా సీఎం పదవి అధిరోహిస్తానని పదేపదే చెప్తున్నారు. ఈ క్రమంలో పవన్ మాజీ సతీమణి రేణు చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ పై ప్రభావం చూపిస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. పవన్ కు లోకల్ భార్య ఒకరు.. నేషనల్ భార్య ఒకరు.. ఇంటర్నేషనల్ భార్య ఒకరు అంటూ జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ వైవాహిక జీవితాన్ని రాజకీయంగా వాడుకోజూస్తున్న వైసీపీకి.. ఇప్పుడు రేణూ చేసిన వ్యాఖ్యలు ఉపయుక్తంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరి.. దీనికి పవన్ మళ్లీ ఎలా రెస్పాండ్ అవుతారోనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Comments
Post a Comment
Your Comments Please: