Skip to main content

ఐదు కీలకాంశాలపై ఆస్ట్రాలజీ నిపుణుల పత్ర సమర్పణ

భాగ్యనగర్ పోస్ట్, హైదరాబాద్, 08: జ్యోతిష్య శాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మానవ జీవన ప్రయాణాన్ని సులభంగా, సుఖంగా కొనసాగించవచ్చని.. అనుకున్న లక్ష్యాలను అనుకున్నట్టుగా అందుకునే అద్భుతమైన భారతీయ విజ్ఞానమే జ్యోతిష్యం అని జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా అన్నారు. భారతీయ రుషి పరంపర నుంచి వచ్చిన ఆ విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందించేందుకే తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని.. ప్రజల జీవితాలు సుఖమయం చేయడానికి మించిన సేవ మరోటి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే జేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఔత్సాహికుల కోసం ఉచిత జ్యోతిష్య తరగతులు బోధిస్తున్నామని.. దేశంలో ఏ యూనివర్సిటీలో కూడా అందించలేని స్థాయిలో ఔత్సాహికులకు లోతైన అవగాహన కల్పిస్తున్నామన్నారు. 

ఈ సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి కళాసాగరంలో పలు ముఖ్యమైన అంశాలపై ఐదుగురు నిపుణులు సమర్పించిన థీసిస్ పై ప్రజెంటేషన్ నిర్వహించారు. ఫెర్టిలిటీలోని సమస్యలు, సంతానోత్పత్తిలో కలిగే అవరోధాలకు ఆస్ట్రాలజీలో ఉండే పరిష్కారాలపై సీసీఎంబీ-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రవీందర్ తన ప్రజెంటేషన్ సమర్పించారు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి కఠినమైన, ఉన్నతమైన పరీక్షలకు హాజరయ్యేవారి జాతకాలను పరిశీలించడం ద్వారా ఆ అవకాశాలను ముందుగానే అంచనా వేసి ఆ తరహా తర్ఫీదు పొందితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మంథా అనురాధ తన థీసిస్ ను సమర్పించారు. అనూరాధ ఐఐటీ టాపర్ గా నిలవడం విశేషం. ఇక రాశిచక్రంలో ఐదో స్థానాన్ని విశ్లేషించి.. అందులోని పాజిటివ్, నెగెటివ్ కోణాలను హరిణి తన ప్రజెంటేషన్ ద్వారా పేర్కొన్నారు. ఫార్మా ఇండస్ట్రీలో రాణించేవారి జాతకాలపై లోతైన పరిశోధన చేసి తన థీసిస్ ను సమర్పించారు గోపాలకృష్ణ. శాంతియుతమైన, విజ్ఞానయుతమైన సమాజానికి అవసరమైన ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెంచే జాతక చక్రాలపై ఎం.వెంకటరావు తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఈ ఉన్నత విద్యావంతులంతా జేకేఆర్ ఫౌండేషన్ అందించిన ఆస్ట్రాలజీని అభ్యాసం చేసి ఎదిగినవారే కావడం విశేషం. 

Also Read: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

Also Read: మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు

Also Read: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్

జేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఆస్ట్రాలజీ తాము ఇప్పటికి వందలాది మందిని తీర్చి దిద్దామని.. వారంతా మెచ్యూర్డ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారని.. అలాంటి సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ రాజా అన్నారు. ఈ క్రమంలో ఫౌండేషన్ ద్వారా హనుమకొండలో కూడా ఇటీవలే తరగతులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది ఔత్సాహిక జ్యోతిష్య శాస్త్ర అభ్యాసకులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. 



త్వరలో ఆస్ట్రాలజీలో ప్రత్యేకమైన యూనివర్సిటీ
జేకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో ఆస్ట్రాలజీ విజ్ఞానాన్ని అందించేందుకు ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీ రాబోతుందని.. అందుకు తగిన నేపథ్య కార్యక్రమం అంతా పూర్తయిందని వాస్తు నిపుణుడు శరవణన్ పేర్కొన్నారు. త్వరలోనే యూనివర్సిటీ పేరు, దాని విధివిధానాలు, ఇతర అంశాలను జేకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజా ప్రకటిస్తారని చెప్పారు. 

ప్రజెంటేషన్ ఇస్తున్న వివిధ రంగాల్లోని ఆస్ట్రాలజీ నిపుణులు

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.