Skip to main content

మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్

ఆ నియోజకవర్గంలో ఓట్లు చీలకుండా ఉండేందుకు బీఆర్ఎస్ అధిష్టానం వేసిన ఎత్తుగడ ఫలిస్తుందా? ఆ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మంత్రికి... మొన్నటివరకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడు కూడా ఇప్పుడు జత కావడం మంత్రికి కలిసొస్తుందా? తనకు కలిసి రావడం కోసం మంత్రి ఈ స్కెచ్ వేశారా? లేక అవతలి పార్టీని దెబ్బ తీయడానికే ఆయన్ని కలుపుకున్నారా? సుదీర్ఘమైన అనుభవం, ప్రజలతో మంచి కనెక్షన్ ఉన్న ఆ నాయకుడు కారెక్కితే బీఆర్‍ఎస్‍ కు భారీ మెజారిటీ ఖాయమా? మొన్నటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కారు పార్టీలో కలిసి మెలిసి తిరగడానికి కారణమేంటి? బీఆర్‍ఎస్‍ లో చేరిన ఆ నేత లక్ష్యమేంటి? గులాబీ బాస్‍ ఇచ్చిన ఆఫర్‍ ఏంటి?

Read this: కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం"

Read this: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

వనపర్తి జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నాయకుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీని వీడి బీఆర్ఎస్ లోకి వచ్చారు. రావులను బీఆర్‍ఎస్‍లోకి తీసుకు రావడం వెనుక అధికార బీఆర్‍ఎస్‍ అధిష్టానం ఎంతో పకడ్బందీగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వనపర్తి నియోజకవర్గంలో క్రియాశీల రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న రావుల చంద్రశేఖర్‍ రెడ్డిని బీఆర్‍ఎస్‍ లోకి చేర్చుకోడానికి గులాబీ బాస్‍ పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్న ప్రచారం సాగుతోంది. రావుల చంద్రశేఖర్‍ రెడ్డి.. గతంలో కూడా పలుమార్లు వివిధ పార్టీల్లో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన మాత్రం తాను చివరికి బీఆర్‍ఎస్‍ లోనే చేరేందుకు సుముఖత చూపారు. వనపర్తి నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు చాలా మంది ఇప్పటికీ బీఆర్‍ఎస్‍ లోనే ఉన్నారు. ఇప్పుడు రావుల కూడా బీఆర్‍ఎస్‍ లో చేరడంతో వనపర్తి జిల్లాలో టీడీపీ పూర్తిగా కనుమరుగైందనే చెప్పాలి. రావుల, బీఆర్‍ఎస్‍ లో కలవడంతో వనపర్తి జిల్లాలో బీఆర్‍ఎస్‍ పార్టీకి మరింత బలం చేకూరినట్లైందన్న చర్చ ఆ జిల్లాలో జోరుగా సాగుతోంది. 

ఐతే రావుల బీఆర్‍ఎస్‍ లో చేరడం వెనుక పెద్ద మతలబే ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రావుల చంద్రశేఖర్‍ రెడ్డి బినామీ అన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్‍ లో చంద్రబాబు జైలుకెళ్లడం, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో రావులను బీఆర్‍ఎస్‍ వైపు మళ్లేలా చేశాయన్న టాక్‍ వనపర్తిలో జోరుగా సాగుతోంది. రావుల కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో, ఆయనకు బీఆర్‍ఎస్‍ నుంచి రాజ్యసభ, లేదా మహబూబ్‍ నగర్‍ పార్లమెంటు నుంచి బరిలో దించి ఎమ్మెల్యేల మద్దతుతో గెలిపించుకుంటామన్న గులాబీ బాస్‍ హామీతో రావుల బీఆర్‍ఎస్‍ గూటికి చేరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రావులను కారెక్కించుకునేందుకు గులాబీ పెద్దలు తెరవెనుక పెద్ద తతంగమే నడిపారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. చంద్రబాబు బినామీగా ముద్రపడ్డ రావులను.. నయాన కాకపోతే భయాన అయినా సరే కారెక్కించుకోవాల్సిందే అన్న నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ పాచిక పారిందంటున్నారు స్థానిక రాజకీయ పరిశీలకులు. ఆంద్రప్రదేశ్‍ లో చంద్రబాబు నాయుడును అక్కడి జగన్ సర్కారు చిక్కుల్లోకి నెట్టినట్టుగానే.. ఇక్కడ తాము కూడా... రావులకు అలాంటి పరిస్థితి తీసుకురాగలమన్న హెచ్చరికల కారణంగానే రావుల దారికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఐతే గతంలోనూ బీఆర్ఎస్ నుంచి రావులకు పార్టీలో చేరాల్సిందిగా పలు మార్లు ఆఫర్లు వచ్చినా... ఆయన సున్నితంగా తిరస్కరించారు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఆయన మాత్రం పార్టీలో చేరక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అయితే రావుల చేరిక మంత్రి నిరంజన్‍ రెడ్డికి బాగా కలిసి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో నిరంజన్‍ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న మేఘారెడ్డి.. ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు. నిరంజన్‍ రెడ్డిని వ్యతిరేకిస్తూ మేఘారెడ్డి కాంగ్రెస్‍ లో చేరారు. ఐతే ఒకప్పుడు టీడీపీ నేత ఐన మేఘారెడ్డి రావుల చంద్రశేఖర్‍ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. టీడీపీ క్రమంగా బలహీనపడుతున్న నేపథ్యంలో స్వయంగా రావుల చంద్రశేఖర్‍ రెడ్డే... మేఘారెడ్డిని బీఆర్‍ఎస్‍ లోకి పంపించారన్న ప్రచారం సాగింది. ఐతే అలా రావుల మద్దతుతో బీఆర్‍ఎస్‍ లోకి వెళ్లిన మేఘారెడ్డి.. మంత్రి నిరంజన్‍ రెడ్డిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‍ లో చేరి టికెట్టు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న రావుల, కాంగ్రెస్‍ పార్టీలో చేరిన పెద్దమందడి ఎంపీపీగా ఉన్న మేఘారెడ్డికి రావుల మద్దతు ఉంటుందని... ఈ క్రమంలో రావుల వెంట ఉన్న సంప్రదాయ ఓటుబ్యాంకు మేఘారెడ్డివైపు మళ్లకుండా.. బీఆర్ఎస్ కే మళ్లించుకునేందుకు రావులను ప్రణాళిక బద్ధంగా గులాబీ పెద్దలు వ్యవహిరించి సఫలీకృతులు కావడం వనపర్తి రాజకీయాల్లో చర్చాంశంగా మారింది. 

వనపర్తిలో అధిక మెజారిటీ సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 2014 ఎన్నికల్లో చివరిసారి పోటీచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి 45 వేల పైచిలుకు ఓట్లు లభించాయి. తర్వాత 2018లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి కూడా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉంటున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటం.. బీఆర్ఎస్ లో  చేరడం ద్వారా రావులకు ఇప్పటికిప్పుడు శాసనమండలి సభ్యత్వం ఇచ్చి.. తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి బరిలోకి దించుతామని ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచినట్లు సమాచారం. అయితే ఈసారి వనపర్తిలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేయాలనే ఉద్దేశంలో భాగమే.. రావులను బీఆర్‍ఎస్‍ లోకి లాగినట్టు వనపర్తి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి రావుల రాకతో నిరంజన్ రెడ్డి గెలుపు మరింత పక్కాగా మారుతుందని ఆ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. మరి.. రావుల రాక ఫలితం ఎంతమేరకు నిరంజన్ రెడ్డికి బదిలీ అవుతుందనేది చూడాలి. 

నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్

నోట్- ఈ వార్త ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. కామెంట్ రాయండి. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...