Skip to main content

Posts

Showing posts from January, 2024

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత...

ఆలోచింపజేస్తున్న 'వోట్ టీడీపీ-సేవ్ ఆంధ్రా' క్యాంపెయిన్

ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడి టీడీపీని మళ్లీ ప్రజలకు చేరువ చేసేలా సరికొత్త వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ప్రచార బాధ్యతలను తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయవాది, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త దుర్గా స్థపతి ఆచార్యకు అప్పగించారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ ఈ ప్రచార బాధ్యతలను తమకు అప్పగించారని దుర్గాస్థపతి ఆచార్య చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఇప్పటికే బాగా అర్థం చేసుకున్న తాము.. అందులో భాగంగానే అద్భుతమైన ఫలితాలు రాబట్టే దిశగా సృజనాత్మకమైన రీతిలో నినాదాలు రూపొందించి కార్యక్షేత్రంలోకి వెళ్తున్నామని స్థపతి చెప్పారు. అదే పద్ధతిలో కార్యక్రమాల రూపకల్పన జరిగిందన్నారు.  టీడీపీ కోసం తమ క్యాంపెయిన్ ఎలా ఉంటుందో ఇకపై చూస్తారని.. తమ విజన్ కు, సృజనాత్మకమైన పనితీరును బాగా అర్థం చేసుకోవడం వల్లే ఎంతో నమ్మకంతో తమకు ఈ కీలకమైన బాధ్యతలు టీడీపీ నేతలు అప్పగించారని స్థపతి చెప్పారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయ...

బీజేపీ విజయానికి దూసుకొస్తున్న కొత్త నినాదం

ప్రతి జాతీయ ఎన్నికలోనూ సరికొత్త నినాదంతో విజయాలు నమోదు చేస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. మోడీ, అమిత్ షా నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ పార్టీ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరింత వినూత్నంగా ప్రచారానికి ప్లాన్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోవాలని భావిస్తున్న బీజేపీ ఈసారి సృజనాత్మకమైన కన్సల్టెంట్లను రంగంలోకి దింపుతోంది.  అందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ప్రచార బాధ్యతలను ప్రముఖ కన్సల్టెంట్ దుర్గా స్థపతి చేపట్టారు. హైదరాబాద్ హైకోర్టులో అడ్వొకేట్ గా పనిచేస్తూ రాజకీయ కన్సల్టెంట్ గా కొనసాగుతున్న దుర్గాస్థపతి ఆచార్యకు ఈటల రాజేందర్ తమ పార్టీ జాతీయ స్థాయి ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా "యూత్ విత్ మోడీ - బూత్ విత్ మోడీ" అనే ఆకర్షణీయమైన ఎన్నికల నినాద అస్త్రాన్ని ఈటల ఆవిష్కరించారు. అలాగే "ఈటలతో మనమందరం -  అవుతుంది ప్రతి ఇల్లూ రామమందిరం" అనే మరో ఆకర్షణీయమైన క్యాప్షన్ ని కూడా సోషల్ మీడియాలోకి వదిలారు ఈటల. ఈ నినాదాలు అర్థవంతంగా ఉండడమే గాక.. ఎంతో ఆకట్టుకుంటున్నాయని, ప్రజల్ని ఆలోచింపజేస్తాయన్న నమ్మకం తనకు...

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది...