Skip to main content

యాభై రోజుల్లోనే పాస్ మార్కులు కొట్టేసిన రేవంత్

- కూర సంతోష్, సీనియర్ జర్నలిస్ట్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటింది. సీఎంగా రేవంత్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. 2 హామీలు చేశామని చెబుతున్న ఆయన మిగతా అమలుకు కసరత్తు చేస్తున్నారు. మంత్రులకు సామాన్య ప్రాధాన్యం ఇస్తూ కేబినెట్ సమిష్టి తత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు  అధికారుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భిన్నాభిప్రాయాలు, అసంతృప్తులకు మారు పేరైన కాంగ్రెస్ లో ఎవరూ నిరాశ చెందకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.

Read this also: ఆనాడు బూర్గుల.. నేడు రేవంత్

Read this also: జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

తెగిన కంచెలు

సీఎంగా ప్రమాణం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్ ముందు ఉన్న కంచె తొలగింపజేశారు రేవంత్. గతంలో ప్రగతి భవన్ లోకి సామాన్యులకే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులకే అనుమతి ఉండేది కాదు. కానీ రేవంత్ ప్రజావాణి ద్వారా ప్రగతి భవన్ లోకి ఎంట్రీ కల్పించారు. వారంలో 2 రోజులు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించడానికి స్పెషల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గతంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వాటి కోసం హైదరాబాద్ కు భారీగా జనం వస్తున్నారు. దీన్ని గమనించిన రేవంత్ క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కారం కోసం ప్రజాపాలన ప్రోగ్రాం అమలు చేశారు. అభయ హస్తం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

పాలనపై పట్టు

రేవంత్ రెడ్డి పాలనకు కొత్త. ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా మాత్రమే పనిచేశారు. మంత్రి పదవి ఏనాడూ చెపట్టలేదు. అయితే రేవంత్ సీఎం అయిన వెంటనే సమీక్షలు నిర్వహిస్తూ పాలనపై పట్టు సాధించే ప్రయత్నం చేశారు. మరోవైపు పాలనలో ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. గతంలో బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించేవారన్న ఆరోపణలు ఉన్న అధికారులను ట్రాన్స్ ఫర్ చేశారు. వారి స్థానంలో బాగా పని చేస్తారని పేరున్న వారిని నియమించారు. సమర్థత ఉండి లూప్ లైన్ లో ఉన్న అధికారులను మెయిన్ స్ట్రీంలోకి తెచ్చారు. గతంలో కొందరు అధికారుల హవా ఎక్కువగా ఉండేదని, ఇతర శాఖల్లో వారు చొరబడే వారని, ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు సెక్రటేరియట్ వర్గాలు.

మంత్రులకు స్వేచ్చ

ముఖ్యమంత్రి అంటే మంత్రులలో ముఖ్యుడు అని రాజ్యాంగం చెబుతోంది. అయితే కేసీఆర్ హయాంలో ఇది లేదు. కేసీఆర్ ఒక్కడే నిర్ణయాలు తీసుకునేవారు. మంత్రులు నామమాత్రంగా ఉండేవారు. కేబినెట్ అంటే కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు మాత్రమేనని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే రేవంత్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు పూర్తిగా స్వేచ్చ ఇచ్చారు. దీంతో వారు సెక్రటేరియట్ లో తమ శాఖలపై రివ్యూలు నిర్వహిస్తూ, నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందమే సందర్శించింది. ఆర్థిక శాఖ, ఇరిగేషన్, సివిల్ సప్లై, రవాణా మంత్రులు తమ శాఖల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పదవి నామమాత్రం కాదని నిరూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. సహచరుడు భట్టికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. కీలకమైన సమీక్షల్లో ఆయన్ను భాగస్వామ్యం చేస్తున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను భట్టితో పాటు కలిశారు రేవంత్ రెడ్డి. ఆర్థిక పరిస్థితిపై ఇద్దరు కలిసి చర్చించారు. మరోవైపు ప్రధానిని తనొక్కడినే కలవకుండా భట్టిని కూడా తీసుకెళ్లారు. కేంద్రమంత్రులను కలిసేందుకు వెళ్లినప్పుడు సంబంధిత మంత్రులను తీసుకెళ్తున్నారు. వారితోనే బ్రీఫింగ్ ఇప్పిస్తున్నారు.

రేవంత్ ను కలిసిన బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (BFSI) ప్రతినిధులు

కేంద్రంతో సత్సంబంధాలు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రంలోని మోదీ సర్కార్ తో మంచి సంబంధాలు ఉండవని ఎన్నికల సమయంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ వీటిని పటా పంచలు చేశారు రేవంత్. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర సమస్యలు వివరించారు. పెండింగ్ లో ఉన్న నిధుల విడుదలకు హామీ పొందారు. అమిత్ షాను కలవగానే రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులు కేటాయించబడ్డారు. రేవంతో చొరవతో రిపబ్లిక్ డే పరేడ్ లో రాష్ట్ర శకటానికి అవకాశం కలిగింది.  

పార్టీలో అందరికీ విలువ

రేవంత్ రెడ్డి సీఎం మాత్రమే కాదు. పీసీసీ చీఫ్ కూడా. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరైనా ఏప్పుడైనా ఏదైనా మాట్లాడుతారు. అసంతృప్తి గళం వినిపిస్తారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ లో అంతర్గత కొట్లాటలు ఎక్కువ అవుతాయన్న వాదనలు వినిపించాయి. అయితే ఈ వాదనలు పటాపంచలు చేశారు రేవంత్ రెడ్డి. తన కంటే ముందు నుంచి ఉన్న సీనియర్లను కలపుకొని పోతున్నారు. పార్టీలో అందరికీ విలువ ఇస్తున్నారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి.. భట్టి, రేవంత్ తో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి తమ స్నేహ బంధం గొప్పదని,  ప్రతిపక్షాలకు  ఇది అర్థం కాదన్నారు. గతంలో తనను తీవ్రంగా వ్యతిరేకించి, పార్టీ నుంచి బయటకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డి కూడా తనను పొగిడేలా చేసుకున్నారు రేవంత్.

వనరుల వేట

ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు కాబట్టి గ్యారంటీలకు నిధుల సేకరణ కోసం చర్యలు ప్రారంభించారు రేవంత్. ప్రధాని మోదీని కలిసి, రాష్ట్రానికి విడుదల కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దుబారా ఖర్చులు చేయబోమని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామని, తద్వారా పథకాలకు నిధుల కొరత రానీవ్వబోమంటున్నారు రేవంత్. కాన్వాయ్ లో వాహనాలు తగ్గించుకున్నారు. కాంగ్రెస్ వస్తే విదేశీ పెట్టుబడులు రావన్న విమర్శలు తప్పని నిరూపించడానికి స్వయంగా దావోస్, లండన్ వెళ్లారు. 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

జర్నలిస్టులకు విలువ

ఇక చివరగా జర్నలిస్టులకు విలువ. కేసీఆర్ హయాంలో జర్నలిస్టులు ప్రశ్నించడమే నేరంగా ఉండేది. ఎవరైనా ప్రశ్నిస్తే ఏ చానల్ మీది, ఏ పత్రిక మీది అని అడగడమో..?  లేదా  సెటైర్లు వేయడమో..? దబాయించడమో జరిగేది. కానీ రేవంత్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులకు అందుబాటులో ఉన్నారు. గతంలో కొత్తగా సెక్రటేరియట్ లో నిషేదాజ్ఞలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి లేవు. మరోవైపు గతంలో ప్రభుత్వ సమాచారాన్ని కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. దాదాపు అందరు జర్నలిస్టులకూ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అందుతోంది.

చివరగా ఒక్కమాట.. రేవంత్ పాలనకు ఇప్పుడే మార్కులు వేయలేం. ఎందుకంటే ఇప్పుడు 50 రోజులు మాత్రమే గడిచాయి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. హామీల అమలుకు ఆయనే 100 రోజుల గడువు పెట్టారు. హామీల అమలు చేస్తే ఖచ్చితంగా ఆయన్ను అందరూ మెచ్చుకుంటారు. లేకుంటే విపక్షాలు, సాధారణ జనంతో పాటు సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. 


Comments

Popular posts from this blog

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, కేంద

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.