Skip to main content

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. శుక్రవారం పాటను రిలీజ్ చేయగానే.. రాత్రి వరకు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. 

ఆ పాట వింటున్నకొద్దీ తెలంగాణ స్ఫూర్తితో గోరటి సాహితీ వైదుష్యం ఓలలాడిస్తుండగానే.. ఎక్కడా ప్రొఫెసర్ జయశంకర్ జాడ కనిపించకపోవడం తెలంగాణవాదుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమవుతోంది. అయితే దీనిపై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఆయన్ని వివరణ కోరింది. అయితే ముందుగా అది సినిమా పాట అని.. ఆ సినిమాలో జయశంకర్ తో సంబంధం లేదని గోరటి చెప్పినా.. మరి మిగతా అంతమంది ప్రస్తావనపై ప్రశ్నించినప్పుడు.. జయశంకర్ పేరును పెట్టకపోవడం తప్పేనని గోరటి ఒప్పుకున్నారు. కచ్చితంగా జయశంకర్ పేరు ఉండాల్సిందేనని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని కూడా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు గోరటి వివరణ ఇచ్చారు. మరోవైపు సినిమా ఇంకా విడుదల కాలేదు కాబట్టి.. ఆ పాటను సవరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును చేరుస్తానని చెప్పడం విశేషం. 

ఎంతో భవిష్యత్తున్న రాకేశ్ ఎందుకిలా చేశాడు?

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రాకేశ్ సొంత జిల్లా వరంగల్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. పక్కా హైదరాబాదీ అయిన రాకేశ్ కు ప్రొఫెసర్ జయశంకర్ గురించి తెలియదనుకోవాలా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను హైలైట్ చేస్తూ తీస్తున్న సినిమాలో కేసీఆర్ ఎంతో గౌరవించే, ఆరాధించే జయశంకర్ పేరు లేకపోవడం రాకేశ్ వైఖరిపై అనుమానాలకు తావిస్తోందంటున్నారు తెలంగాణ సినీ ఇండస్ట్రీ నిపుణులు. జయశంకర్ పేరు పెట్టాలని నిర్మాత సూచించకపోవడాన్ని గోరటి వెంకన్న కారణంగా చూపుతున్నా.. ఒక తెలంగాణవాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, బహుళ జనం ఆదరిస్తున్న ఆయన జయశంకర్ పేరును విస్మరించడంపై నొచ్చుకున్నారు. మరి రాకేశ్ కావాలనే ఆయన పేరును తీసుకోరాదని గీత రచయితకు సూచించారా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. దీనిపై రాకేశ్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. 

తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చి.. ఈటీవీలో సూపర్ రేటింగ్ ఉన్న ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రామ్ లో రాణిస్తున్న రాకేశ్ లాంటి తెలంగాణ కళాకారులు.. తెలంగాణకు చిరునామా లాంటి జయశంకర్ సార్ ను విస్మరించడం విమర్శలకు దారితీస్తోంది. వెండితెర మీద ఎంతో భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్న రాకేశ్ తదుపరి ఎలాంటి చర్య తీసుకుంటాడోనన్న ఆసక్తి రేగుతోంది. 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...