Skip to main content

Posts

Showing posts from July, 2024

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన యూని

అలుపెరుగని పోరాట యోధుడు పద్మాచారి

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ మెస్ లో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి పద్మాచారి చేసిన సేవలు మరువలేనివని. ఏ చిరు ఉద్యోగికి ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిలా ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడే యోధుడు అని ఏసీపీ (సీసీఎస్) కె.ఎం కిరణ్ కుమార్ అన్నారు. రెండేళ్ల క్రితమే పద్మాచారి పదవీ విరమణ పొందారు. ఉద్యోగులందరూ మళ్లీ పద్మాచారిని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పద్మాచారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ ఎ.సి.పి(సి.సి.ఎస్) మాట్లాడుతూ... పద్మాచారి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేయటం, ఉద్యోగుల సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటికీ ఉద

గురుపూజలో పాల్గొనండి విజ్ఞానాన్ని ఆర్జించండి

సనాతన ధర్మంలో గురుపూజకు ఉన్న ప్రాశస్త్యాన్ని నేటి తరం ప్రజలు గుర్తించాలని, సద్గురువుల కృపకు పాత్రులు కావాలని జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా కోరారు. జేకేఆర్ జ్యోతిష్య విజ్ఞాన పరిశోధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్ పల్లిలోని కళాసాగరంలో గురుపూజా ఉత్సవం జరుగుతుందని రాజా తెలిపారు. భారతీయ గురు పరంపర ఎప్పుడూ విజ్ఞానాన్ని విస్తరించిందని.. వారి కృషి వల్లే అనేక రకాల ఖగోళ, వాస్తు, యోగ విజ్ఞానం వంటి శాస్త్రాలు జన బాహుళ్యంలోకి చొచ్చుకు వెళ్లాయన్నారు రాజా. ఆ పరంపరలో భాగంగానే జేకేఆర్ ఫౌండేషన్ కృషి చేస్తోందని.. అంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని అందిస్తున్న గురు పరంపరకు కృతజ్ఞతలు తెలుపుకోవడం ద్వారా మరింత విజ్ఞానాన్ని ప్రజలంతా అందుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు.  కళాసాగరంలో ఉదయం 10 గంటలకు నిపుణులైన జ్యోతిష్య శాస్త్రవేత్తల ప్రసంగాలు మొదలవుతాయని రాజా చెప్పారు. స్పిరిచ్యువల్ ఆస్ట్రాలజీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, పామిస్ట్రీ, సుఖవంతమైన వివాహ జీవితం కోసం ఆస్ట్రాలజీని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. జేకేఆర్ ఫౌండేషన్ కు ఫ్లోరి