సనాతన ధర్మంలో గురుపూజకు ఉన్న ప్రాశస్త్యాన్ని నేటి తరం ప్రజలు గుర్తించాలని, సద్గురువుల కృపకు పాత్రులు కావాలని జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా కోరారు. జేకేఆర్ జ్యోతిష్య విజ్ఞాన పరిశోధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్ పల్లిలోని కళాసాగరంలో గురుపూజా ఉత్సవం జరుగుతుందని రాజా తెలిపారు. భారతీయ గురు పరంపర ఎప్పుడూ విజ్ఞానాన్ని విస్తరించిందని.. వారి కృషి వల్లే అనేక రకాల ఖగోళ, వాస్తు, యోగ విజ్ఞానం వంటి శాస్త్రాలు జన బాహుళ్యంలోకి చొచ్చుకు వెళ్లాయన్నారు రాజా. ఆ పరంపరలో భాగంగానే జేకేఆర్ ఫౌండేషన్ కృషి చేస్తోందని.. అంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని అందిస్తున్న గురు పరంపరకు కృతజ్ఞతలు తెలుపుకోవడం ద్వారా మరింత విజ్ఞానాన్ని ప్రజలంతా అందుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు.
కళాసాగరంలో ఉదయం 10 గంటలకు నిపుణులైన జ్యోతిష్య శాస్త్రవేత్తల ప్రసంగాలు మొదలవుతాయని రాజా చెప్పారు. స్పిరిచ్యువల్ ఆస్ట్రాలజీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, పామిస్ట్రీ, సుఖవంతమైన వివాహ జీవితం కోసం ఆస్ట్రాలజీని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. జేకేఆర్ ఫౌండేషన్ కు ఫ్లోరిడా (అమెరికా)లోని జ్యోతిష్య యోగశాస్త్ర యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ లభించిందని.. ఆ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆసియా ఖండ వ్యాప్తంగా జేకేఆర్ ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించబోతున్నామని రాజా చెప్పారు. గురుపూజోత్సవం అనంతరం మధ్యాహ్నం 1.30 గం.కు ప్రసాద వితరణతో కార్యక్రమం ముగుస్తుందన్నారు.
కార్యక్రమ వివరాల కోసం 91210 20199, 93910 29145 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: