సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన యూనివర్శిటీవారికి చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment
Your Comments Please: