Skip to main content

Posts

Showing posts with the label TELANGANA

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...

అలుపెరుగని పోరాట యోధుడు పద్మాచారి

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ మెస్ లో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి పద్మాచారి చేసిన సేవలు మరువలేనివని. ఏ చిరు ఉద్యోగికి ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిలా ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడే యోధుడు అని ఏసీపీ (సీసీఎస్) కె.ఎం కిరణ్ కుమార్ అన్నారు. రెండేళ్ల క్రితమే పద్మాచారి పదవీ విరమణ పొందారు. ఉద్యోగులందరూ మళ్లీ పద్మాచారిని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పద్మాచారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ ఎ.సి.పి(సి.సి.ఎస్) మాట్లాడుతూ... పద్మాచారి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేయటం, ఉద్యోగుల సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటిక...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప...

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుక...

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు....

మా దేవీదేవతలకు పూజ చేసుకోనివ్వండి: ఎంపీ అర్వింద్

నిజామాబాద్ జిల్లా బోధన్ లో గల ఓ ప్రధాన దేవాలయంలోకి హిందువులను అనుమతించి, అక్కడ పూజలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేస్తున్నారు. బోధన్ లో గల ఇంద్రనారాయణస్వామి ఆలయాన్ని హిందువులకు అప్పగించాలని ఆయన కోరుతున్నారు. 10 శతాబ్దంలో బోధన్లో ఇంద్రనారాయణుడి దేవాలయాన్ని ఆనాటి రాష్ట్రకూట రాజైన మూడో ఇంద్రుడు నిర్మించాడని.. అది జైన్ టెంపుల్ గా చరిత్రకారులు నిర్ధారించారని అర్వింద్ చెబుతున్నారు. ఆ తరువాత కళ్యాణి చాళుక్యుల కాలంలో రాజా సోమేశ్వరుడి హయాంలో ఆలయాన్ని పునరుద్ధరించి దానికి ఇంద్రనారాయణస్వామి దేవాలయంగా నామకరణం చేశారన్నారు.  ఆలయ నిర్మాణం నక్షత్రాకారంలో ఉంటుంది. ఎంతో అద్భుతమైన, ఆకర్షణీయమైన శిల్పాలు దేవాలయంలో ఆశ్చర్యం గొల్పుతాయి. ఆనాటి శిల్పాచార్యుల ప్రతిభకు దేవాలయ గోడలపై ఉన్న శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆక్రమణ తరువాత దాన్ని మసీదుగా మార్చారు. దానికి దేవల్ మసీద్ అనే పేరు పెట్టారు. గర్భగుడిని మార్చి.. ప్రార్థనలు చేసుకునేందుకు ఓ వేదికను నిర్మించి.. మిగిలిన దేవాలయాన్ని పూర్తిగా అలాగే ఉంచి దేవల్ మ...

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో  తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతనోత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టీయూజేఎస్‌ కన్వీనర్‌ ఎం.ఎం.రహమాన్‌ ముఖ్యమంత్రికి వివరించారు.  ముఖ్యమంత్రి తమ విజ్ఞప్తికి స్పందించి లోగో ఆవిష్కరిస్తూ ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని, అక్కడికక్కడే సమాచార శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినందుకు సీఎంకు రహమాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఓం చీఫ్‌ పీఆర్‌ఓ అయోధ్యరెడ్డిలకు సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో నేతలు మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, యాటకర్ల మల్లేష్‌, పసూనూరి రవీందర్‌, తాటికొండ రమేష్‌బాబు, సాదిక్‌, కాస...

యాభై రోజుల్లోనే పాస్ మార్కులు కొట్టేసిన రేవంత్

- కూర సంతోష్, సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటింది. సీఎంగా రేవంత్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. 2 హామీలు చేశామని చెబుతున్న ఆయన మిగతా అమలుకు కసరత్తు చేస్తున్నారు. మంత్రులకు సామాన్య ప్రాధాన్యం ఇస్తూ కేబినెట్ సమిష్టి తత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు  అధికారుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భిన్నాభిప్రాయాలు, అసంతృప్తులకు మారు పేరైన కాంగ్రెస్ లో ఎవరూ నిరాశ చెందకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. Read this also: ఆనాడు బూర్గుల.. నేడు రేవంత్ Read this also: జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి తెగిన కంచెలు సీఎంగా ప్రమాణం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్ ముందు ఉన్న కంచె తొలగింపజేశారు రేవంత్. గతంలో ప్రగతి భవన్ లోకి సామాన్యులకే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులకే అనుమతి ఉండేది కాదు. కానీ రేవంత్ ప్రజావాణి ద్వారా ప్రగతి భవన్ లోకి ఎంట్రీ కల్పించారు. వారంలో 2 రోజులు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించడానికి స్పెషల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గతంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వాట...

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత...

ఆలోచింపజేస్తున్న 'వోట్ టీడీపీ-సేవ్ ఆంధ్రా' క్యాంపెయిన్

ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడి టీడీపీని మళ్లీ ప్రజలకు చేరువ చేసేలా సరికొత్త వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ప్రచార బాధ్యతలను తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయవాది, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త దుర్గా స్థపతి ఆచార్యకు అప్పగించారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ ఈ ప్రచార బాధ్యతలను తమకు అప్పగించారని దుర్గాస్థపతి ఆచార్య చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఇప్పటికే బాగా అర్థం చేసుకున్న తాము.. అందులో భాగంగానే అద్భుతమైన ఫలితాలు రాబట్టే దిశగా సృజనాత్మకమైన రీతిలో నినాదాలు రూపొందించి కార్యక్షేత్రంలోకి వెళ్తున్నామని స్థపతి చెప్పారు. అదే పద్ధతిలో కార్యక్రమాల రూపకల్పన జరిగిందన్నారు.  టీడీపీ కోసం తమ క్యాంపెయిన్ ఎలా ఉంటుందో ఇకపై చూస్తారని.. తమ విజన్ కు, సృజనాత్మకమైన పనితీరును బాగా అర్థం చేసుకోవడం వల్లే ఎంతో నమ్మకంతో తమకు ఈ కీలకమైన బాధ్యతలు టీడీపీ నేతలు అప్పగించారని స్థపతి చెప్పారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయ...

బీజేపీ విజయానికి దూసుకొస్తున్న కొత్త నినాదం

ప్రతి జాతీయ ఎన్నికలోనూ సరికొత్త నినాదంతో విజయాలు నమోదు చేస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. మోడీ, అమిత్ షా నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ పార్టీ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరింత వినూత్నంగా ప్రచారానికి ప్లాన్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోవాలని భావిస్తున్న బీజేపీ ఈసారి సృజనాత్మకమైన కన్సల్టెంట్లను రంగంలోకి దింపుతోంది.  అందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ప్రచార బాధ్యతలను ప్రముఖ కన్సల్టెంట్ దుర్గా స్థపతి చేపట్టారు. హైదరాబాద్ హైకోర్టులో అడ్వొకేట్ గా పనిచేస్తూ రాజకీయ కన్సల్టెంట్ గా కొనసాగుతున్న దుర్గాస్థపతి ఆచార్యకు ఈటల రాజేందర్ తమ పార్టీ జాతీయ స్థాయి ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా "యూత్ విత్ మోడీ - బూత్ విత్ మోడీ" అనే ఆకర్షణీయమైన ఎన్నికల నినాద అస్త్రాన్ని ఈటల ఆవిష్కరించారు. అలాగే "ఈటలతో మనమందరం -  అవుతుంది ప్రతి ఇల్లూ రామమందిరం" అనే మరో ఆకర్షణీయమైన క్యాప్షన్ ని కూడా సోషల్ మీడియాలోకి వదిలారు ఈటల. ఈ నినాదాలు అర్థవంతంగా ఉండడమే గాక.. ఎంతో ఆకట్టుకుంటున్నాయని, ప్రజల్ని ఆలోచింపజేస్తాయన్న నమ్మకం తనకు...

ఎంబీసీ జాతిపిత కాళప్ప 75వ బర్త్ డే వేడుకలు

అత్యంత వెనుకబడిన కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి మెప్పించిన కె.సి.కాళప్ప జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య నిరాడంబరంగా జరిగాయి. ఆదివారం హైదరాబాద్ బండ్లగూడలోని తన స్వగృహంలో కాళప్ప 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంబీసీల్లోని పలు కులాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తమ కులాల అభ్యున్నతి కోసం కాళప్ప చేసిన కృషిని అంతా గుర్తు చేసుకున్నారు. కాళప్ప అనారోగ్యానికి గురైన తరువాత ఎంబీసీ ఎజెండా చలనం లేకుండా పోవడంపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం వరకు కాళప్ప పూర్తి ఆరోగ్యంగా ఉండి యావత్ ఎంబీసీల ఎజెండాను పరుగులు పెట్టించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.  2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించి.. అందుకోసం సామాజిక అధ్యయనం చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టారు. ఆ సమయంలో బీసీల్లో ఉన్న మోస్ట్ బ్యాక్‎వార్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) కు కూడా సమన్యాయం, సహజ న్యాయం జరగాలనే బలమైన వాయిస్ వినిపించారు కాళప్ప. బీసీల్లో ఉన్న దాదాపు నూటపాతిక కులాల్లో కేవల...

ఆనాడు బూర్గుల.. నేడు రేవంత్

ఆధునిక పోకడలకు దూరంగా ఉండే వెనుకబడ్డ కొడంగల్ నుంచి.. రాష్ట్ర అత్యున్నత పదవికి ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రస్థానం చాలాచాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అంతేకాదు.. పాత మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రికి ఎన్నికైన రెండో సీఎం రేవంత్ కావడం మరో విశేషం. ఆయన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాల గురించి ఓసారి చూద్దాం.  తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికైన సందర్భం ఒక ముఖ్యాంశమైతే.. పాలమూరు జిల్లా నుంచి సీఎంగా ఎన్నికవుతున్న రెండో వ్యక్తి కూడా రేవంతే కావడం మరో ముఖ్యాంశం. ఆంధ్రాలో విలీనం కాక ముందు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు బూర్గుల రామకృష్ణారావు. ఆయన అప్పటి కల్వకుర్తి తాలూకాలోని పడకల్లు గ్రామంలో జన్మించారు. గొప్ప మేధావి, రచయిత, నిజాంపై పోరాడిన ధీరుడిగా కీర్తి గడించిన బూర్గుల తరువాత.. ఇంత కాలానికి మళ్లీ పాలమూరు ప్రాంతం నుంచి రేవంత్ రూపంలో మరో వ్యక్తి సీఎం అవుతున్నాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతుండడంతో ఆ ప్రాంతానికి మరోసారి ఆ ఖ్యాతి దక్కినట్టయింది. పాలమూరు నుంచి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లోకి ఎక్కుతున్నారు.  ముఖ్యమంత్రి పీఠాన్ని అధి...

థాంక్స్ టు సోనియమ్మ

తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రేవంత్ రెడ్డి. పట్టిన పట్టు వదలడు అనే పేరున్న రేవంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా అలాగే మలుచుకున్నారు. రాజకీయ జీవితాన్ని తాము కోరినట్టుగా మలుచుకున్న అతికొద్ది మంది నాయకుల్లో రేవంత్ ఒకరు. చాలా మందికి అదృష్టవశాత్తూ సీఎం కుర్చీ దొరకవచ్చు. కానీ రేవంత్ కు ఆ సీటు అదృష్టవశాత్తూ దొరకలేదు. తన ప్రయాణాన్నే సీఎం కుర్చీ దిశగా టార్గెట్ చేసి పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు. ఆ విషయాల గురించి మరింత డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ముందు.. రేవంత్ తెలంగాణ సీఎం అయిన సందర్భం గురించి చెప్పుకోవాలి.  నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు తెలంగాణ ప్రజానీకం. ఈ కృషిలో రేవంత్ పాత్రను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇతర కాంగ్రెస్ నేతలెవరూ చేయని పనిని రేవంత్ చేసిపెట్టారు. ప్రజల్లో నమ్మకం కలిగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామేం చేస్తారో రేవంత్ చెప్పారు. ఆయన మాటల్ని ప్రజలు నమ్మారు. రాష్ట్ర కాంగ్రెస్ సైన్యాన్ని నడిపించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్.. టీ-పీసీసీ చీఫ్ గా అనుకున్న లక...

కాంగ్రెస్ ను తలెత్తుకునేలా చేసిన టఫ్ మ్యాన్

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. బీఆర్ఎస్ కార్డు సైడ్ అయిపొయ్యి.. కాంగ్రెస్ కార్డు ముందుకొచ్చింది. దీనికంతటికీ కారణం ఒకే ఒక్కడు. ఆయనే టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగిల్ హ్యాండెడ్ గా పార్టీని, సీనియర్లను, శ్రేణులను, కేడర్ ను నడిపించి ఉన్నతాసనాన్ని ఖరారు చేసుకున్నారు రేవంత్. మరి.. ఈ ఉన్నతమైన స్థానం ఆయనకు ఊరికే లభించిందా? ఆయన కృషి ఎలాంటిది?  తెలంగాణ ప్రభుత్వ మార్పిడిలో కీలకమైన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారూ ఉంటే అది రేవంత్ రెడ్డి. టీ-పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడం వెనుక.. కాంగ్రెస్ కు కాకతాళీయమైన అవసరమేం లేదంటారు నిపుణులు. రేవంత్ ను టీ-పీసీసీ చీఫ్ గా తీసుకోవడం వెనుక ఉభయుల ప్రయోజనాలూ ఉన్నాయట. అందుకే కాంగ్రెస్ ను తనకు అప్పగిస్తే.. కొన్ని కీలకమైన నిర్ణయాలు తనకు కట్టబెడితే.. పార్టీని నడిపిస్తానని.. హైకమాండ్ నిశ్చింతగా ఉండొచ్చని.. కచ్చితంగా రిజల్ట్ రాబడతానని ఎంతో నమ్మకంగా చెప్పారట రేవంత్. ఆయన మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ చూసే.. సోనియా, రాహుల్ టీ-పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించేందుకు ముందుకొచ్చారు. దానిపై టీ-కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు, ఎన్ని అసంతృప్తులు వచ్చినా డోంట్ ...

వనపర్తి గెలుపు బాటలో నిరంజన్ రెడ్డి

తెలంగాణలో సుదీర్ఘమైన, చెప్పుకోదగిన చరిత్ర గల పాతకాలపు సంస్థానమే వనపర్తి. ఆత్మాభిమానానికి, పౌరుష పరాక్రమాలకు, కవి గాయక వైతాళికులకు పెట్టింది పేరు.. ఈ వనపర్తి. కాలక్రమంలో అదే ఇప్పుడు నియోజకవర్గంగా మారింది. అలాంటి వనపర్తిలో ఎన్నికల పోరాటం రసవత్తరంగా మారుతోంది. అందుక్కారణం సిట్టింగ్ మినిస్టర్ గా, నీళ్ల నిరంజనుడిగా పేరున్న కేసీఆర్ అనుచరుడు ఒకరైతే.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తెలంగాణ ఆవిర్భవించిన సమయంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి మరొకరు. అయితే ఆయనకు టికెట్ ఇస్తానని ఊరించిన కాంగ్రెస్ అధిష్టానం.. మేఘారెడ్డిని అభ్యర్థిగా మార్చేసింది. ఇలాంటి సమయంలో వనపర్తిలో గెలుపు జెండా ఎగరేసేది ఎవరు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే తెలంగాణకు ముందు.. తెలంగాణకు తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాలమూరు రూపురేఖలు మారిపోయాయి. అందులో భాగమైన వనపర్తి జిల్లా పేరుతో ఏర్పడిన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు తీసింది. ఇప్పుడీ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి సిట్టింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మేఘా...