Skip to main content

Posts

పట్నంలో అద్దె బాధలు తీర్చిన ఆపద్బాంధవుడు

దినసరి కూలీగా వచ్చి పేదల మనసుల్లో గుడి కట్టుకున్న బాలలింగం కరోనా సృష్టిస్తున్న కల్లోలంతో నిరుపేదలు, రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలు, పొట్ట చేత పట్టుకొని దూర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు వీధిపాలవకుండా కొందరు ఆపద్బాంధవులు ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతినెలా ఫస్టు రాగానే ఇంటి అద్దెల కోసం టీనెంట్స్ వెంట పడే ఆసాములు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో అడుగడుగునా ఉంటారు. అయితే తాను మాత్రం అలా కాదంటూ ఓ ఆపన్నహస్తం ముందుకొచ్చింది. కరోనా సమయంలో తనకు అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదని పెద్దమనసు చేసుకున్న యజమాని తన టీనెంట్స్ కి భరోసా ఇవ్వడం ఎందరో యజమానులకు స్ఫూర్తిదాయకంగా మారింది.  Also Read: రెంట్లు తగ్గాలి.. ఫీజులు ఎత్తేయాలి.. సామాన్యుడి సరికొత్త డిమాండ్లు హైదరాబాద్, బాలానగర్ లో ఉంటున్న కోడూరి బాలలింగంను మా ప్రతినిధి ఫోన్లో పలకరించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లానుంచి చాలా ఏళ్లక్రితం పని వెదుక్కుంటూ హైదరాబాద్ వలస వచ్చిన బాలలింగం పెద్దగా చదువుకోలేదు. బతుకుబండి లాగేందుకు బార్ లో పాత్రలు క్లీన్ చేసే పనికి కుదురుకొని.. అలా నెమ్మదిగా ఓ మిత్రుడి సాయంతో మెకానికల్ వర్క్ షాప్ పెట్టుకొని చిన్నపాటి ...

అగ్గితోటి కడగడమే అందరికీ క్షేమకరం

  చచ్చినవాడు పుడతాడో లేదో గట్టిగా చెప్పే శక్తి సామర్థ్యాలు మనకు లేకున్నా.. పుట్టినవాడు కచ్చితంగా చచ్చి తీరుతాడనేది మాత్రం తిరుగులేని సత్యం. ఆ సత్యాన్ని తిరగరాద్దామని మనవాళ్లు ఎన్నో వేల కోట్ల డాలర్లు వెచ్చించి ప్రయోగాలు చేస్తున్నా ఇప్పటికైతే ఆశావహమైన ఆనవాళ్లేమీ కనిపించలేదు. ప్రపంచ మానవ జీనోమ్ ప్రాజెక్టు అంతిమ లక్ష్యం కూడా అదేనని ఆ మధ్య మీడియా అంతా వివిధరకాల కథనాలు గుప్పించింది. మనిషి మరణాన్ని అధిగమించబోతున్నాడని, ఆ సుదినం దగ్గర్లోనే ఉందని శాస్త్రవేత్తలు కూడా ఊరించారు. అలాంటి ప్రయోగాల్లో కనీసం అంగుళం కూడా ఫలితం సాధించినట్టు రుజువులైతే లభించలేదు. అయితే ఇప్పుడు ప్రపంచ మానవుడు మృత్యువును జయించే ప్రయోగాలు దేవుడెరుగు.. అసలు కంటికి కనిపించనంత అతి చిన్న వైరస్ కణానికే భయపడి చస్తున్నాడు. ఇలాంటి వైరస్ ఇప్పటివరకు మనిషి కంట పడలేదు. కరోనా ఉన్నట్టు గుర్తించారు కానీ.. అది చూపించే ప్రభావం మనిషి అనుభవంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ మాయావి వైరస్ పంజా ఎంత విస్తృతంగా ఉందో అనుభవంలోకి వస్తోంది.  భూతల స్వర్గం అమెరికాలో చనిపోయినవారి శవాలను వారి బంధువులకో, తెలిసినవారికో అప్పగించడానికి కూడా సమయాభావం ఏర్పడు...

ఆనందం ఆవిరైన సౌత్ కొరియా.. మరి చైనా సంగతేంటి?

Imp Link: అగ్గితోటి కడగడమే అందరికీ క్షేమకరం కరోనా విశ్వరూపం అనూహ్యమైన ఉపద్రవంగా మారబోతుందా? ఇదే అనుమానం ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తోంది. కరోనాను చాలా తొందరగా అధిగమించామనుకుంటున్న దేశాలకు వణుకు పుట్టిస్తోంది. క్వారంటైన్ లో ఉండి కోలుకున్న దాదాపు వంద మంది సౌత్ కొరియా కోవిడ్-19 పేషెంట్లు ఎంతో నిబ్బరంగా రోజువారీ కార్యకలాపాల్లో మునిగిపోయారు. అయితే వారికి నిర్వహించిన పరీక్షల్లో మళ్లీ పాజిటివ్ తేలడంతో వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా అదుపులోకి వస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ ట్రెండ్ ఏంటో అవగతం కావడం లేదని సౌత్ కొరియా వ్యాధి నిరోధక శాఖ డైరెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  Also Read: నెగెటివ్ వచ్చినా మరణం తథ్యమేనా? సౌత్ కొరియాలో కరోనా అదుపులోకి రావడంతో ఇప్పటికే పాఠశాలలు తెరిచారు. జనజీవనం మీద, జన సంచారం మీద ఆంక్షలను పరిమితం చేయడంతో రోజువారీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే వారి ఆందోళనకు కారణమవుతోంది. ఈ క్రమంలో చైనా పరిస్థితేంటి అన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్నాయి. వుహాన్ లో కరోనా కొత్త కేసులు జీరో స్టేటస్ కి తీసుకొచ్చిన క్రమంలో వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేశా...

నెగెటివ్ వచ్చినా మరణం తథ్యమేనా?

Photo Credit: deccanherald.com (symbolic image) కరోనా వైరస్ విశ్వరూపంలో కొత్తకోణం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ డాక్టర్ తాజాగా కోవిడ్-19 బారిన పడడం వైద్య నిపుణులను కూడా కలవరపెడుతోంది. 60 ఏళ్లున్న జనరల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ) ఇండోర్ లోని త్రివేణి కాలనీలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఆయన కరోనాతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు కొద్దిరోజుల క్రితం జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. అది సాధారణ ఎలర్జీగానే భావించారు. అయినప్పటికీ ఈ నెల 3, 4 తేదీల్లో కరోనా టెస్టులు కూడా నిర్వహించారు. ఆ రెండు సార్లు కూడా నెగెటివ్ తేలడంతో డాక్టర్, ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అవే అలర్జీ లక్షణాలతో ఆయన రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్లకు వైద్యసేవలు అందించారు. అయితే ఆయనకు కోవిడ్-19 సోకిందని తెలిసేటప్పటికే చనిపోవడం కలకలం రేపుతోంది.  Also Read: అంతా బానే ఉంది కానీ..                   కరోనా కాటేస్తుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారు?             ...

అంతా బానే ఉంది కానీ..

షబ్-ఎ-బారాత్ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియాలో చేసిన సుదీర్ఘ ప్రసంగం మొత్తమ్మీద బాధ్యతాయుతంగానే కనిపించడం చెప్పుకోదగ్గ విశేషం. ముందుగా రాత్రి 9 గంటలకు ప్రసంగం ఉంటుందని డిక్లేర్ చేసినా ఆ సమయాన్ని రాత్రి పదిన్నరకు వాయిదా వేశారు. దీంతో జనరల్ మీడియాలో దానికి పెద్దగా స్పేస్ దక్కలేదు. కానీ దాదాపు ఒక గంట సేపు జరిగిన సోషల్ ఇంటరాక్షన్ కి ట్విిట్టర్ లో భారీ రెస్పాన్స్ కనిపించింది. ట్విట్టర్ లో ఆయనకు 11 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అందులో నేను కూడా ఒకణ్ని. వ్యూహాత్మక ప్రసంగంలో మేటిఅసదుద్దీన్ అద్భుతమైన వాక్చాతుర్యం గల వ్యక్తి. ఎలాంటి విషయాన్ని, ఎలాంటి సందర్భాన్నయినా తనకు అనుకూలంగా చక్కగా మలుచుకోవడంలో, బాధ్యతను అవతలి వ్యక్తి మీదికి తోసేయడంలో ఘనాపాటిగా పేరుంది. గురువారం రాత్రి జరిగిన సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో తొలి భాగం ఎంతో బాధ్యతగా మాట్లాడిన అసదుద్దీన్.. రెండో భాగానికి వచ్చేసరికి మళ్లీ పాతపాటే పాడారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ సపోర్టర్స్ అంతా కూడబలుక్కొని విషం చిమ్ముతున్నారని కడిగిపారేశారు. కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమన్న అర్థం వచ్చేలా పాత వ...

కరోనా కాటేస్తుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారు?

Photo Credit: Sakshi Post ఖైదీలు ఏం చేస్తున్నారు? హాయిగా ముప్పూటలా తిని పడుకుంటున్నారా? అలాగే అసలు క్రైమ్ రేట్ 50 శాతానికన్నా తగ్గిపోయి కొత్త ఖైదీలెవరూ రాని పరిస్థితుల్లో జైళ్ల అధికారులు ఏం చేస్తున్నారు? గోళ్లు గిల్లుకుంటున్నారా? లేక అక్కరకొచ్చే పనేదైనా చేస్తున్నారా? ఖైదీలను ఖాళీగా ఉంచకుండా జైలు సిబ్బంది చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కరోనా సృష్టించిన కరువును పూడ్చేందుకు జైలుసిబ్బంది బయటి ప్రపంచానికి తెలియని అపురూపమైన సేవలు అందిస్తున్నారు. జైలు సిబ్బందిని గైడ్ చేస్తూ, ఖైదీల టాలెంట్ ను సరైనరీతిలో వాడుకునే పక్కా ప్రణాళికలు రచిస్తున్నది ఇప్పుడు ఆయా జైళ్ల అధికారులే.  కరోనా మహమ్మారిని నివారించడంలో జైలు అధికారుల సహకారం అంతా ఇంతా కాదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వేసే బెడ్ నుంచి పరిచే దుప్పటి, పేషంట్స్ డ్రెస్ లు, మూతికి కట్టుకునే మాస్కులు, శానిటైజర్లు, యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాలు తయారయ్యేది జైలు అధికారుల పర్యవేక్షణలోనే. రోజూ వచ్చే నిందితులను ఏ విధమైన నిబంధనలతో లోనికి అనుమతిస్తారో తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. కరోనా నేపథ్యంలో లోపలికి వచ్చేవారిని 14 రోజులు విడిగా వుంచి అతను పూర్తిగా ఆరోగ్యంగా...

మీరు రోహింగ్యాలా..? అయితే నో ఎంట్రీ, కేటీఆర్ ఎంట్రీ

కరోనా అలజడి మరింత ముదిరిపోకముందే దానికి చెక్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. మణిపూర్ నుంచి వచ్చిన రోహింగ్యాలకు హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ సిబ్బంది ఎంట్రీకి అవకాశం ఇవ్వకపోవడం వార్తాంశమైంది. హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్న స్టార్ సూపర్ మార్కెట్ కు ఇద్దరు రోహింగ్యాలు నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు వెళ్లారు. చూడగానే వారు విదేశీయుల్లాగా కనిపించారు అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి. దీంతో వారిని అనుమానించారు. మీరెవరు అని అడిగారు.  మేం రోహింగ్యాలం.  ఎక్కణ్నుంచి వచ్చారు?  మణిపూర్ నుంచి. ఐడీ కార్డు చూపించండి అని అడిగారు. వారు ఆధార్ కార్డు చూపించారు. అయినా షాపులోకి ఎంట్రీ అవకుండా యజమాని వచ్చిన తరువాత రావాలని, తామేం చేయలేమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ సందర్భంలో వారిలో ఒకరు తీసిన వీడియోను వారి మిత్రుడు ట్విట్టర్లో పెట్టడంతో దానిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు.  రేసిజం ఏ స్థాయిలో ఉన్నా సహించరాదని, దీనిపై సంబంధిత పోలీసు బాసు యాక్షన్ తీసుకోవాలని, వారి ఆకలి తీర్చే మార్గం వెదకాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి కిరణ్ రిజి...