Skip to main content

Posts

ఆఖరు కేజీ వరకు వరి కొనుగోలు చేస్తాం - మంత్రి వేముల

  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చివరి కేజీ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళనకు గురికావద్దని, రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, చెప్పుడు మాటలు విని ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి భరోసా ఇచ్చారు.కరోనా వైరస్ వల్ల రైతులెవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశామని, నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందని, గురువారం ఒక్క రోజే 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా.. అందుకు మొత్తం 355 కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చామని, గురువారం 336 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగిందన్నారు.పెట్టుకున్న అంచనాకు 30 శాతం అంటే 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ 336 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సేకరించిన వరి ధాన్యంలో 92% అంటే 1.68...

పేదలకు సరుకులు పంచిన ప్రణవి ఫౌండేషన్

  లాక్ డౌన్ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద కూలీలు, ఉపాధి లేనివారికి ప్రణవి ఫౌండేషన్ తోడ్పాటునందించింది. జనతా కర్ఫ్యూ, ఆ తరువాత లాక్ డౌన్ కష్టాలు చుట్టుముట్టడంతో భోజన సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న పేదప్రజలు ఉండే కాలనీ మాణికేశ్వరీ నగర్, ఒడ్డెర బస్తీలో తాజాగా ప్రణవి ఫౌండేషన్ వంట సరుకులు అందజేసింది. బియ్యం, గోధుమపిండి, ఉల్లిగడ్డ, మిర్చి, పసుపు ఇత్యాది వంట సరుకులను ఫాండేషన్ సమకూర్చింది. ప్రణవి ఆధ్వర్యంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి విడతలవారీగా తాము వంటసరుకులు పంపిణీ చేస్తున్నామని, తమ ఫౌండేషన్ తో పాటు పేద ప్రజల సేవలో మరికొందరు ఔత్సాహికులు కూడా తమను ప్రోత్సహిస్తున్నారని ఫౌండేషన్ అధ్యక్షుడు జైన్ కుమార్  ఆచార్య వారికి కృతజ్ఞతలు చెప్పారు. లాక్ డౌన్ మరింతకాలం పొడిగించే అవకాశం కనిపిస్తున్నందున ఔత్సాహికుల నుంచి ఇదే తరహా స్ఫూర్తి కొనసాగాలని జైన్ కోరారు.  ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జి.శ్రీకాంత్, ఇమ్రాన్, కె.వెంకటరమణ, జి.మోహన్, ఎస్.రాధాకృష్ణ, జి.ఆనంద్ ఆచార్య, రమేశ్ నాయ క్, సామేశ్ తదితరులు పాల్గొన్నారు. 

బిహార్ వలస కూలీలకు ఎంబీఎఫ్ ఆపన్న హస్తం

  లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం కావడం, ఉపాధి  అవకాశల్లేక నెల రోజుల పైగా గడవడంతో  వలస కూలీల ఇబ్బందులు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో మాతృభూమి ఫౌండేషన్ మరోసారి ముందుకొచ్చింది. లాక్ డౌన్ విధించిన నాటి నుంచి వరుసగా ఉపాధి కోల్పోయిన పేదలకు, మురికివాడల్లో ఉన్నవారికి, వలస కూలీలకు ఆహార సరుకులు అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 30వ తేదీన బిహార్ నుంచి వచ్చి చిక్కుకుపోయిన వలస కూలీలు 50 మంది సరుకులు అందజేశారు. హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ వద్ద పెద్దసంఖ్యలో కేంద్రీకృతమై ఉన్న వలస కూలీలను గుర్తించి వారికి ఈ సరుకులు అందజేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు కె.కిరణ్ చెప్పారు.   తమ శక్తి మేరకు, ప్రజలకు తమ సేవలు అవసరం ఉన్నంతమేరకు స్పందిస్తామని కిరణ్ తెలిపారు.   

కష్టకాలంలో జర్నలిస్టులకు చేయూతనిస్తున్న పల్లె రవికుమార్

కరోనా కష్టకాలంలో మీడియా యాజమాన్యాల నుంచి, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఎలాంటి ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న సగటు జర్నలిస్టుల  కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ చేయూతనందిస్తున్నారు. తన పరిధిలో ఇప్పటికే చౌటుప్పల్, నల్గొండ వంటి కేంద్రాల్లో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేసిన రవికుమార్, తాజాగా మునుగోడులో ఒక్కో జర్నలిస్టు కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. కరోనా సాకుతో మీడియా సంస్థలు ఇప్పటికే పలువురు జర్నలిస్టులను పక్కన పెట్టేశాయి. అటు ఫీల్డులో పనిచేసే రిపోర్టర్లు సైతం రోడ్డునపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఆహార సరుకులే కాక, తక్షణావసరాల కోసం డబ్బు కూడా వారి అకౌంట్లలో జమ చేయాలని, జర్నలిస్టు కమ్యూనిటీ కూడా పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది మాదిరే కరోనా బారిన పడుతున్నారని, అలాంటివారి కోసం మీనమేషాలు లెక్కించరాదని రవికుమార్ పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా కూడా అదే విజ్ఞప్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి చేశారు.  ఈ కార్యక్రమంలో TJF రాష్ట్ర నాయకుడు పోగుల ప్రకాష్, జిల్లా నాయకులు ఈదులకంటి కైలాష్, తిరందాస్ శ్రీనివ...

ఆదిశంకరాచార్యుడి విజయంలో అసలు రహస్యం

(2530వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)   ద్వాపరయుగ అంతంలో ధర్మ సంరక్షణకు కురుక్షేత్రంలో జరిగిన సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం ఆహుతి అయింది. భగవాన్ శ్రీకృష్ణుడు రక్షించిన ధర్మం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. క్రమంగా దేశమంతటా జాతి విరుద్ధమైన ప్రవృత్తులు ప్రబలిపోయాయి. దేశం పతనం వైపు వేగంగా పరుగులిడుతుంది. ఇలాంటి సమయంలో దేశాన్ని సరియైన దిశవైపు నడిపించడానికి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రయత్నాలకు ఆధారం వేదాలు. వేదాల్లోని అంతరార్థ సత్యాన్ని తిరిగి ప్రకటించడం కోసం 3 కొత్త దర్శనాలు వెలుగులోకి వచ్చాయి. 1. పతంజిల యోగ దర్శనం, 2. జైమిని మీమాంస దర్శనం, 3. బాదరాయణ వేదాంత దర్శనం.  Readable: మీ ఇంటికే ఫుడ్ - డయల్...   వేదాల్లోని కర్మకాండకు వ్యతిరేకంగా భగవాన్ శ్రీకృష్ణుడే పూనుకున్నాడు. కర్మకాండపై భాగవత ధర్మం తిరుగుబాటు చేసింది. దేశంలోని సాంఘిక వ్యవస్థకు దెబ్బ  తాకకుండా ఇంద్రుడు మొదలైన దేవతల పూజలు మాన్పించాడు శ్రీకృష్ణుడు. వేదాల మీద, వైదిక వ్యవస్థ మీద సంపూర్ణ ఆదర భావం కూడా చూపించాడు. అక్కడి నుండి భాగవత ధర్మం యొక్క ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. ఆ మూడు దర్శనాలతో కొత్తపుంతలు తొక...

మీ ఇంటికే ఫుడ్ - కాల్ టు...

  గ్రేటర్ హైదరాబాద్ లో అందరికీ ఆహారం అందించేందుకు తెలంగాణ సర్కారు కొత్త తరహా ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దాని ప్రకారం 040-21111111 ల్యాండ్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలి. అక్కడ రికార్డయ్యాక వారు మరో సెల్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ దగ్గరే కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫుడ్ ఎక్కడికి చేర్చాలి అనే వివరాలు అడిగి నోట్ చేసుకుంటారు. ఆ నెంబర్లు  9154170990 లేదా 9154170991 కు డయల్ చేయాల్సి ఉంటుంది. లేదా నేరుగా ఇదే నెంబర్ కు డయల్ చేసినా ఆహారం అందించాల్సిన అడ్రస్, వివరాలు తీసుకుంటారు. మధ్యాహ్న భోజనం కోసం ఉదయం 10 గంటల వరకు కాల్ చేయాలి. అలాగే సాయంత్రం భోజనం కోసం 4 గం. వరకు కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది.    ఆ తరువాత ఇచ్చిన అడ్రస్, ఫోన్ నెంబర్ ను బట్టి అన్నపూర్ణ క్యాంటీన్ సిబ్బంది.. సమీపంలోని సెంటర్ కు వచ్చి కాల్ చేస్తారు. ఆ కాల్ ను అనుసరించి ఫుడ్ ప్యాకెట్ తీసుకోవాల్సి ఉంటుంది.   

ఆకలేస్తోందా.. కాల్ 040-21111111

  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకలైనవారికి అన్నం రెడీగా ఉందంటున్నారు టీఆర్ఎస్ సీనియర్ లీడర్ కల్వకుంట్ల కవిత. ఇందుకోసం ఒక హెల్ప్ లైన్ తీసుకొచ్చామని, ఆ నెంబర్ ని అందరికీ తెలిసేలా పాపులరైజ్ చేయాలని ట్విట్టర్ ద్వారా ఆమె కోరారు. భోజనం అవసరం ఉన్నవారు  040-21111111 (040-2 ఏడు ఒకట్లు) నెంబర్ కి కాల్ చేస్తే భోజనం ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నదని, హైదరాబాద్ లాంటి పెద్దనగరంల ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించరాదని కవిత ఆకాంక్షించారు. ఆహారం నేరుగా అందుకునే అవకాశం లేనివారు ఈ నెంబర్ కు డయల్ చేయడం ద్వారా ఆకలి తీర్చుకోవచ్చని ట్వీట్ చేశారు కవిత.    Related Link: మీ ఇంటికే ఫుడ్ - కాల్ టు...